
న్యూమరాలజీ ప్రకారం, జన్మ తేదీ ఆధారంగా వ్యక్తిత్వం, భవిష్యత్తును అంచనా వేయవచ్చు. ఈ వ్యాసం 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారి జీవిత విశేషాలను, ప్రభుత్వ ఉద్యోగాలలో వారి విజయ అవకాశాలను వివరిస్తుంది.
Key Points
1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు అధికం.
ప్రభుత్వ ఉద్యోగాలలో, ముఖ్యంగా IAS లాంటి పోస్టులలో విజయం సాధించే అవకాశం ఉంది.
స్వతంత్రత, ఆత్మగౌరవం వీరి ప్రత్యేకతలు.
సంబంధాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.
న్యూమరాలజీ ప్రకారం 1 రాడిక్స్ నెంబర్ గల వారి లక్షణాలు
న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయనేది చెప్పడంతో పాటుగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం ఒక మనిషి ఎలా సక్సెస్ అవ్వచ్చు, ఏ రంగంలో కలిసి వస్తుంది, ఎటువంటి కెరియర్ లో సక్సెస్ ని అవ్వచ్చు అనేది కూడా చెప్పవచ్చు. ఈరోజు న్యూమరాలజీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఏదైనా నెలలో 1,10,19, 28 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా తెలివైన వారు. ఉన్నత చదువులు చదువుకుంటారు. పరిశోధనకు సంబంధించిన వాటిలో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కడికి వెళ్ళినా అందరూ వీరిని గౌరవిస్తారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉండడంతో కెరియర్ లో దూసుకుపోతారు. మెడికల్ కి సంబంధించిన ఫీల్డ్ లో కూడా వీరికి కలిసి వస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగాలలో విజయం
ఈ తేదీల్లో పుట్టిన వారు స్వతంత్రంగా ఉంటారు. వారికి నచ్చినట్లుగా వారి జీవిస్తారు. ఇతరుల సలహాలు కూడా తీసుకోవడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరి మీద ఆధారపడడం కూడా ఇష్టం ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వీరికి ఎక్కువ.
రిలేషన్ షిప్ లో ఇబ్బందులు
సంబంధాలు మరియు సవాళ్ళు
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువగా రిలేషన్షిప్ లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వీరి గుండె రాయి లాంటిది. దీనితో ఎక్కువగా రిలేషన్ షిప్ లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ఈ సమాచారం న్యూమరాలజీ ఆధారంగా మాత్రమే. ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.


