
📌 Key Points
- బిగ్‌బాస్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పై జవాన్ సుందర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
- కళ్యాణ్ ఆర్మీ కాదని, సీఆర్పీఎఫ్ అని జవాన్ సుందర్ తన వీడియోలో వ్యాఖ్యానించాడు.
- సుందర్ తన వీడియోకు క్లారిటీ ఇస్తూ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించాడు.
- ఈ వివాదం కారణంగా కళ్యాణ్ అభిమానులు జవాన్ సుందర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు.
బిగ్‌బాస్ ఫైనలిస్ట్ కళ్యాణ్ గురించి ఓ జవాన్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. కళ్యాణ్ ఆర్మీ నేపథ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్ సుందర్ తర్వాత క్లారిటీ ఇవ్వడంతో వివాదానికి తెరపడింది.
జవాన్ సుందర్ వ్యాఖ్యలతో వివాదం
బిగ్‌బాస్ సీజన్-9 ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతూనే మొదటి ఫైనలిస్ట్‌గా మారిన కళ్యాణ్ (Kalyan)పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కామన్ మెన్ కేటగిరిలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. ఊహించని విధంగా ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తన ఆటతీరుతోనే కాకుండా.. ప్రవర్తనతో ఫైనల్ వరకు చేరుకున్నాడు. విన్నర్‌గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలోనే.. ఓ బీఎస్ఎఫ్ జవాన్ సుందర్, కళ్యాణ్‌ను ఆర్మీ నుంచి డిస్‌మిస్ చేశారంటూ చేసిన వీడియో సంచలనంగా మారింది. కొందరు తమకు అనుగుణంగా మార్చేసి వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. అందులో కళ్యాణ్ ఆర్మీ కాదంటూ.. సీఆర్పీఎఫ్ అంటూ క్రియేట్ చేశారు.
కళ్యాణ్ గురించి జవాన్ క్లారిటీ
ఈ వీడియో కాస్త వైరల్ అవుతుండగా.. కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుందర్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, సుందర్ క్లారిటీ ఇచ్చాడు. ‘‘కళ్యాణ్ పడాల ఇండియన్ ఆర్మీ కాదు.. సీఆర్పీఎఫ్ అని ఒక వార్త ట్రెండ్ అవుతుంది. ఆర్మీ అయినా సీఆర్పీఎఫ్ అయినా డిఫెన్స్ కు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ అయినా చేసేది దేశ సేవే. 89 రోజుల తర్వాత డిఫెన్స్ నుంచి డిస్మిస్ చేస్తారా లేదా అనే కళ్యాణ్ బయటకు వస్తే తెలుస్తుంది. అదే విషయం గురించి ఒక క్లారిటీ మాత్రమే ఇచ్చాను. అంతేకానీ కళ్యాణ్ ను బ్యాడ్ చేయాలని కాదు.
అభిమానుల ఆగ్రహం: ట్రోల్స్ పర్వం
అలాంటి ఉద్దేశం నాకు లేదు. నేను చెప్పిన వీడియోను అర్థం చేసుకోకుండా కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ కళ్యాణ్ ను బ్యాడ్ చేయాలనుకున్నారు.ఒకసారి సైనికుడు అయితే ఎప్పటికీ అతడు సైనికుడే. హౌస్ లో కళ్యాణ్ ఎక్కడా కూడా సైనికుడిలా ఉండట్లేదు. జెన్యూన్ పర్సన్ లాగే ఉంటున్నాడు. కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. గెలిపించండి. అతను ఎదుగుతుంటే చూడలేవా అని కామెంట్ చేశారు. కానీ 5వేల ఫాలోవర్స్ ఉన్న సమయంలోనే ఒక సైనికుడు తన కల నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాడని వీడియో చేశాను. అది లక్షకు వెళ్లింది. కళ్యాణ్ ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. నా సపోర్ట్ అతడికే’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో ట్రోల్స్‌కు చెక్ పడినట్లు అయింది.
చివరకు, జవాన్ సుందర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో కళ్యాణ్ చుట్టూ అలుముకున్న వివాదం సమసిపోయింది. కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ, తన మద్దతు అతడికేనని జవాన్ ప్రకటించడంతో ట్రోల్స్‌కు చెక్ పడింది.


