
తమిళ సూపర్ స్టార్ జయం రవి తన మాజీ భార్య ఆర్తి రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో లేఖను విడుదల చేశారు. కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కష్టకాలంలో కెనీషా తనకు ఆధారంగా నిలిచిందని చెప్పుకొచ్చారు.
Key Points
జయం రవి మాజీ భార్యపై కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు
పిల్లలను కూడా చూడనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం
కెనీషా తన జీవితంలో వెలుగులా వచ్చిందని తెలిపారు
కోర్టులోనే వివాదాన్ని పరిష్కరిస్తానని స్పష్టీకరణ
మాజీ భార్యపై సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో జయం రవి తన మాజీ భార్య ఆర్తి రవిపై సంచలన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. లేఖలో జయం రవి..తన భార్య నిలువెల్లా దోచేసిందని ఆరోపించారు. ఆమె కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయలు అప్పు చేసి తనను నడిరోడ్డుకు లాగేశారని ఆరోపించారు. తన ఆడంబరాల కోసం ఆర్తి ఆమె కుంటుంబ సభ్యులు తననుదోచుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం కన్న బిడ్డలను కడూా చూడనివ్వడం లేదని మండిపడ్డారు.
పిల్లలను చూడనివ్వకపోవడంపై ఆగ్రహం
తన పిల్లల కోసం డబ్బులు ఇస్తున్నానని కానీ వాళ్లను చూడనివ్వకుండా బౌన్సర్లను నియమించారని చెప్పారు. తన గురించి పిల్లలకు తెలుసు అని వాళ్లను సింపతీ కోసం వాడుకోవడం లేదన్నారు. మానసికంగా, శారీరకంగా అలిసిపోయానని ఈ సమయంలో జీవితంలో వెలుగులా కేనీషా వచ్చిందని చెప్పారు. ఎన్నో బాధలు భరించానని, ఇక ఓపిక లేదని ఎమోషనల్ అయ్యారు. పదేళ్ల సంపాదన తల్లి దండ్రులకు పంపకుండా వీళ్లకే ఇచ్చానని అయినా నిందిస్తున్నారని చెప్పారు.
కెనీషాతో జీవితంలో కొత్త అధ్యాయం
తాను ఇంటినుండి కట్టుబట్టలతో వచ్చినప్పుడు కెనీషా సపోర్ట్ చేసిందన్నారు. తనను దగ్గరుండి చూసుకుందని సంతోషంగా ఉంచాలని చూసిందన్నారు. తనకు తన పేరెంట్స్ కు ఎంతో సాయం చేసిందన్నారు. ఆమె క్యారెక్టర్‌ను ఎవరైనా అగౌరవపరిస్తే ఒప్పుకోనని చెప్పారు. తనను ఎలా గౌరవిస్తారో కెనీషాను కూడా అలాగే గౌరవించాలని కోరాడు. ఇక్కడితో దీనిని వదిలేస్తున్నానని కేసు కోర్టు పరిధిలో ఉందని ఏం ఉన్నా కోర్టులోనే చూసుకుందామని మాజీ భార్యకు జయం రవి స్పష్టం చేశాడు.
జయం రవి తన మాజీ భార్యపై చేసిన ఆరోపణలు, కెనీషా తో కొత్త జీవితం గురించి వివరించారు. ఈ వివాదం కోర్టులోనే పరిష్కారమవుతుందని తెలిపారు.


