
జేష్ఠ మాసం హిందూ క్యాలెండర్‌లో ప్రత్యేకమైన నెల. ఈ నెలలో కొన్ని పూజలు, దానాలు చేయడం వలన పుణ్యఫలం లభిస్తుంది. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.
Key Points
జేష్ఠ మాసంలో ఉపవాసం, దానధర్మాలు పుణ్య ఫలితాలను ఇస్తాయి.
సూర్యుడు, హనుమంతుడు, కుజుడికి ప్రత్యేక పూజలు చేయండి.
హనుమంతుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు.
జేష్ఠ మాసంలో ఉపవాస దీక్ష
తెలుగు నెలల్లో మూడవ నెల అయినటువంటి జేష్ఠ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. జేష్ఠ మాసానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఈరోజు తెలుసుకుందాం. చాలా మందికి జేష్ఠ మాసం ప్రాముఖ్యత, విశిష్టత తెలియదు. జేష్ఠ మాసంలో ఏం చేయాలి? ఏ దేవుళ్ళని పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు? ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
జేష్ఠ మాసంలో ఏం చేయాలి? జేష్ఠ మాసంలో ఏం చేయడం వలన పుణ్య ఫలితం ఉంటుంది?
జేష్ఠ మాసంలో ఉపవాస దీక్షని ఆచరించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుజుడు జేష్ఠ మాసానికి అధిపతి అని చెబుతారు. ఈ నెలలో చేసే దానధర్మాలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. అదే విధంగా మంగళవారం నాడు ఉపవాస దీక్షను ఆచరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.
2.సూర్యుడికి, హనుమంతుడికి ప్రత్యేక పూజలు:
సూర్యుడు, హనుమంతుడు, కుజుడి పూజ
జేష్ఠ మాసంలో హనుమంతుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. హనుమాన్ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఈ సమయంలో వరుణుడు, సూర్యుడిని పూజిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో సూర్యుడిని, ఆంజనేయ స్వామిని, కుజుడిని పూజించడం వలన ఎంతో విశేష ఫలితాలని పొందవచ్చు.
జేష్ఠ మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా ఈ నెలలో నీటిని సంరక్షించడం ఎంతో ముఖ్యం.
4.నీటిని దానం చేస్తే మంచిది:
జేష్ఠ మాసంలో జల దానం చేయడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు. అందుకనే ఈ మాసంలో చలివేంద్రాలని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
దానధర్మాలు మరియు జలదానం
5.హనుమంతుడికి ఎందుకు పూజ చేయాలి?
జేష్ఠ మాసంలో హనుమంతుడికి ఎందుకు పూజ చేయాలనే విషయానికి వస్తే, హిందూ పురాణాల ప్రకారం, ఈ నెలలో హనుమంతుడు శ్రీరాముడిని కలిసారట. అందుకనే జేష్ఠ మాసంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
జేష్ఠ మాసంలోని పవిత్రతను గుర్తించి, పై సూచనలను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


