
టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్‌కు మరో నిదర్శనం. ఆయన పెన్సిల్ ఆర్ట్ రూ.1,45,300లకు అమ్ముడైంది. తెలుగు హీరోలలో ఇంత ఖరీదైన పెన్సిల్ ఆర్ట్ ఇది మొదటిసారి.
Key Points
జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ రూ. 1,45,300కు అమ్ముడైంది.
తెలుగు హీరోలలో ఇంత ఖరీదైన పెన్సిల్ ఆర్ట్ ఇది మొదటిసారి.
బులా రూబీ అనే ఆర్టిస్ట్ ఈ పెన్సిల్ ఆర్ట్ ను రూపొందించారు.
ఎన్టీఆర్ క్రేజ్‌ను ఈ ధర ప్రతిబింబిస్తుందని అభిమానులు అంటున్నారు.
అత్యధిక ధరకు అమ్ముడైన పెన్సిల్ ఆర్ట్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్ మాసెస్ కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు . ఆర్ఆర్ఆర్ , దేవర , వార్ -2 చిత్రాలతో జూనియర్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు . ఇటీవలే హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు . కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది . ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు .
బులా రూబీ యొక్క అద్భుతమైన నైపుణ్యం
అయితే జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే కాదు .. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్ ఉందని అర్థమైంది . బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తన టాలెంట్ తో ఆవిష్కరించారు . తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది . ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్ కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు . తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ట్ కు ఏకంగా రూ .1,45,300 రూపాయలు అమ్ముడైంది . ఈ విషయాన్ని ఆర్టిస్ట్ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది .
ఎన్టీఆర్ క్రేజ్‌కు ప్రతిబింబం
ఎన్టీఆర్ ఆర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది .. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది . ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్ లో పోస్ట్ చేసింది . ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . తన టాలెంట్ తో ఎన్టీఆర్ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు .
జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్‌కు లభించిన భారీ ధర ఆయన క్రేజ్‌కు అద్దం పడుతోంది. బులా రూబీ కళాకృతి అందరినీ ఆకట్టుకుంది.


