|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘కె-ర్యాంప్‌’ అంటే బూతు కానేకాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్‌

Published: 27-09-2025, 9:43 AM

కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘కె-ర్యాంప్’ సినిమా టైటిల్‌పై వస్తున్న విమర్శలకు దర్శకుడు జైన్స్ నాని స్పష్టతనిచ్చారు. ఇది బూతు పదం కాదని, కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని వివరించారు. ఈ చిత్రం నవ్వుకునే వైబ్‌తో తెరకెక్కిందని హీరో కిరణ్ పేర్కొన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల కానుంది.

Key Points

1

'కె-ర్యాంప్' టైటిల్ అసభ్య పదం కాదని దర్శకుడు జైన్స్ నాని స్పష్టం చేశారు.

2

ఈ పేరు 'కిరణ్ అబ్బవరం ర్యాంప్' అని, హీరో కుమార్ పేరు నుండి వచ్చిందని వివరించారు.

4

సీనియర్ నటుడు నరేశ్ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ అవుతుందని అంచనా వేశారు.

టైటిల్‌పై దర్శకుడు జైన్స్ నాని వివరణ

కిరణ్ ‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె- ర్యాంప్ ‌’( K Ramp). ఈ మూవీ టైటిల్ ‌ అనౌన్స్ ‌ చేసినప్పటి నుంచే బూతు సినిమా అని ట్రోల్ ‌ చేశారు . ఇక ట్రైలర్ ‌ లో కూడా ఒకటి రెండు బూతు పదాలు ఉండడంతో ..కె- ర్యాంప్ ‌ అంటే కూడా బూతు పదమే అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైటిల్ ‌ పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు . కె – ర్యాంప్ ‌ అంటే అసభ్యపదం కాదని .. దాని అర్థం కిరణ్ ‌ అబ్బవరం ర్యాంప్ ‌ అని అన్నారు . ఆయనను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్ ‌ రాశానని చెప్పారు .

తాజాగా చిత్రయూనిట్ ‌ నిర్వహించిన ప్రెస్ ‌ మీట్ ‌ లో దర్శకుడు జైన్స్ ‌ నాని మాట్లాడుతూ .. ‘ టైటిల్ ‌ చూసి అది బూతు పదం అని అంతా అనుకుంటున్నారు . కానీ మా ఉద్దేశం అది కాదు . కె – ర్యాంప్ ‌ అంటే కిరణ్ ‌ అబ్బవరం ర్యాంప్ ‌. ఈ సినిమాలో హీరో పేరు కుమార్ ‌.. అందుకే టైటిల్ ‌ అలా పెట్టాం ’ అన్నారు .

“నవ్వుకునే సినిమా” అన్న కిరణ్ అబ్బవరం

కిరణ్ ‌ అబ్బవరం(Kiran Abbavaram) మాట్లాడుతూ .. థియేటర్‌లో కూర్చుని నవ్వుకునే వైబ్‌ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు నాని రూపంలో మంచి బ్రదర్‌ దొరికాడు. లైఫ్‌లో నానిని ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను. సెట్‌కు వెళ్లగానే ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని 20 నిమిషాలు నవ్వుకునే వాళ్లం. ఇది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు’ అన్నారు.

అక్టోబర్ 17న ‘కె-ర్యాంప్’ విడుదల

ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు జైన్స్‌ నాని ఈ కథ చెప్పగానే, రెండే రెండు మాటలు చెప్పా. ‘నువ్వు చాలా పెద్ద డైరెక్టర్‌ అవుతావు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌’ అని చెప్పా. యూత్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు కలిసి చూడ్సాల్సిన చిత్రమిది’ అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

దర్శకుడు కె-ర్యాంప్ టైటిల్‌పై స్పష్టతనివ్వడంతో పాటు, ఇది కుటుంబంతో చూడదగ్గ చిత్రమని సీనియర్ నటుడు నరేశ్ తెలిపారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.