|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాపాడు… కాపాడు (ఏలుమలై)

Published: 11-08-2025, 2:47 PM

రాన్నా హీరోగా పరిచయమవుతున్న ‘ఏలుమలై’ చిత్రం నుండి ‘కాపాడు దేవా’ అనే పాట లిరికల్ వీడియో విడుదలైంది. ప్రియాంకా ఆచార్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

Key Points

1

హీరో రాన్నా డెబ్యూ సినిమా ‘ఏలుమలై’

2

ప్రియాంకా ఆచార్య హీరోయిన్‌గా నటించారు

3

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది

4

‘కాపాడు దేవా’ లిరికల్ వీడియో విడుదల

‘ఏలుమలై’ సినిమా విశేషాలు

హీరోయిన్‌ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఏలుమలై’. ఈ చిత్రంలో ప్రియాంకా ఆచార్‌ హీరోయిన్‌. పునీత్‌ రంగస్వామి దర్శకత్వంలో నరసింహా నాయక్‌ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్‌ సుధీర్‌ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్‌ స్టూడియోస్‌ నిర్మించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాలోని ‘కాపాడు దేవా..’పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘‘కాపాడు… కాపాడు… ప్రేమికుల చేతులిల విడిపించకు… కాపాడు… కాపాడు… దేవా… ప్రేమనిలా ఒంటరిగ విడిచెల్లకు…’ అంటూ ఈపాట సాగుతుంది. సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్‌ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్‌ ఈపాటకు సాహిత్యం అందించగా, మంగ్లీపాడారు.

‘కాపాడు దేవా’ పాట విడుదల

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల

‘కాపాడు దేవా’ లిరికల్ వీడియోతో సినిమాపై అంచనాలు పెరిగాయి. త్వరలోనే ‘ఏలుమలై’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.