|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాజల్ కారవాన్‌లో షాకింగ్ ఘటన: ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడే బయటపెట్టిన హీరోయిన్!

Published: 24-07-2026, 12:07 PM

నటి కాజల్ అగర్వాల్ తన కెరీర్ తొలినాళ్లలో కారవాన్‌లో ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది. అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుందో వివరిస్తూ, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించిన ఘటనను గుర్తుచేసుకుంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

కాజల్ అగర్వాల్ తన కారవాన్‌లో జరిగిన షాకింగ్ ఘటనను బయటపెట్టింది.

2

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి లేకుండా కారవాన్‌లోకి ప్రవేశించి టాటూ చూపించాడు.

4

ఈ ఘటన సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రైవసీ ఆవశ్యకతపై చర్చకు దారితీసింది.

కాజల్ కారవాన్‌లో షాకింగ్ అనుభవం

Kajal Incident: కాజల్ అగర్వాల్.. ఇప్పుడంటే పెళ్లయ్యాక కాస్త సైలెంట్ అయింది కానీ ఒకప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో చేసిన రచ్చ అంత ఇంతా కాదు లక్ష్మీ కళ్యాణం తో ఎంట్రీ ఇచ్చిన ఈ బాంబే బ్యూటీ మగధీరతో ఒక్కసారిగా టాప్ లీగ్ లోకి దూసుకొచ్చింది . అలాంటి భామ తాజాగా చెప్పిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది . అభిమానం హద్దులు దాటితే అది ఎలా ఉంటుందో చెబుతూ తనకు జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ ని ఇప్పుడు బయట పెట్టింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ షూటింగ్ టైంలో  తనకి ఎదురైన అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చింది.

రావడం రావడమే అబ్బాయి తన షర్టు విప్పేసి

అది ఒక సినిమా షూటింగ్ ఫస్ట్ డే నే అది జరిగిందని తెలిపింది .ఆరోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక తన కార్వాన్ లో ఒంటరిగా రెస్ట్ తీసుకుంటున్నాను అని అయితే అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వచ్చాడని పర్మిషన్ లేకుండా సడెన్ గా దూసుకు వచ్చాడని చెప్పుకొచ్చింది .దాంతో ఒక్కసారిగా తాను భయభ్రాంతులకు గురయ్యానని తెలిపింది.అయితే ఆ తర్వాత అతను ఆ సినిమాకి పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలిసింది అని వాపోయింది. ఇక రావడం రావడమే అబ్బాయి తన షర్టు విప్పేసి తన ఒంటిపై ఉన్న కాజల్ అనే పేరు గల టాటూ ని చూపించాడని, నేను మీ అభిమానిని అందువల్లే ఇలా టాటూ వేయించుకున్నానని చెప్పాడని తెలిపింది.

అభిమానం హద్దులు దాటితే..

ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

అయితే అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దులు దాటకూడదు అని ఆ భయంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని కాసేపు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదని ఆరోజు జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తుచేసుకుంది కాజల్.ఒకరి వ్యక్తిగత స్పేస్ లోకి అనుమతి లేకుండా రావడం చాలా తప్పని కాజల్ మాటల్లో స్పష్టంగా కనిపించింది . ఇక ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. చాలామంది నెటిజన్లు కూడా సెలబ్రిటీలకి ప్రైవసీ ఎంత ముఖ్యమో ఇలాంటి ఘటనలు ప్రూవ్ చేస్తున్నాయి అంటూ సోషల్ ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో

కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే 2007లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2009లో వచ్చిన మగధీరతో ఒక్కసారిగా స్టార్ లీగ్ లోకి దూసుకుపోయింది. ఇక ఆ తర్వాత వరుసగా డార్లింగ్ ,మిస్టర్ ఫర్ఫెక్ట్ ,బృందావనం బిజినెస్ మాన్, నాయక్, బాద్షా, టెంపర్ ,ఖైదీ నెంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది . ఒక దశలో ప్రతి స్టార్ హీరోల సినిమాలో కాజలే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే కాజల్ ఏ రేంజ్ లో ఒక ఊపు ఊపింది అర్థమవుతుంది.

సెలబ్రిటీల గోప్యతపై చర్చ

ఎలాంటి కేరింగ్ తీసుకుంటారో !

ఇక 2020 అక్టోబర్ 30న తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న కాజల్ 2022లో నీల్ జన్మనిచ్చింది.అయితే పెళ్లి పిల్లల తర్వాత కెరీర్ ఎండ్ చేస్తుందనుకున్న ఈ భామ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి అదే జోష్ ని కంటిన్యూ చేస్తుంది.

ఈ క్రమంలోనే బాలకృష్ణతో భగవంత్ కేసరి సినిమాని చేసిన కాజల్ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న nbk 111 లోను కీలకపాత్రలో కనిపిస్తోంది. మరోవైపు భారీ బడ్జెట్ తో వస్తున్న రామాయణంలో మండోదరి పాత్ర పోషిస్తున్న కాజల్ తాజాగా ది ఇండియా స్టోరీ అనే సోషల్ ఓరియెంటెడ్ ఫిలిమ్ లో లాయర్ పాత్రలో కనిపించింది.ఏది ఏమైనా కాజల్ చెప్పిన ఈ కార్వాన్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చూడాలి ముందు ముందు ఈ ఘటనలు జరగకుండా ఇండస్ట్రీలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటారో !

కాజల్ బయటపెట్టిన ఈ ఘటన సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యత ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తుంది. అభిమానం ఉండొచ్చు కానీ, అది ఇతరుల వ్యక్తిగత స్థలాన్ని గౌరవించే విధంగా ఉండాలని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.