|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా కూతురు జోలికొస్తే ఊరుకునేది లేదు.. కారుతో తొక్కిస్తానంటూ కాజోల్ స్ట్రాంగ్ వార్నింగ్

Published: 21-06-2025, 6:47 AM

బాలీవుడ్ నటి కాజోల్ తన కూతురిని ట్రోల్ చేస్తున్న వారికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘మా’ అనే హారర్ థ్రిల్లర్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కాజోల్, తన కూతురిని విమర్శించేవారిని కారుతో ఢీకొడతానని అన్నారు.

Key Points

1

కాజోల్ తన కూతురిని ట్రోల్ చేసిన వారికి హెచ్చరిక జారీ చేశారు.

2

కారుతో ఢీకొడతానని కాజోల్ బెదిరించారు.

3

సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై కాజోల్ తీవ్రంగా స్పందించారు.

4

కాజోల్ ప్రస్తుతం 'మా' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

కాజోల్ హెచ్చరిక

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) హారర్ థ్రిల్లర్ ‘మా’(maa) సినిమాతో రాబోతుంది. విశాల్ ఫ్యూరియా(Vishal Furia) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రోనిత్ రాయ్(Ronit Roy), కెరిన్ శర్మ, నితిన్, సూర్‌సజ్యశిఖా దాస్, ఇంద్రనీల్ సేన్ గుప్త(Indranil Sengupta) కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో కాజోల్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, తన కూతురిని ట్రోల్ చేస్తున్న వారికి కాజోల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘నా కూతురు జోలికి వస్తే ఊరుకునేది లేదు. అలాంటి వాళ్లు నా కారు ముందుకు రావద్దు.

ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో వారిని ఢీ కొట్టి శరీరాలపై నుంచి పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్‌లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది. మీరు అమేజింగ్ అని పెడుతున్నారు. కానీ ఎవరో ఒకరు మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టి బాధపెడుతున్నారు. ఆ చెత్త వాగుడు వాగే వారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను చెడు గురించి కాదు. అయినప్పటికీ నా కూతురిని విమర్శిస్తే మాత్రం ఊరుకోను’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

‘మా’ సినిమా ప్రమోషన్లు

సోషల్ మీడియా స్పందన

కాజోల్ చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన కూతురి రక్షణకు ఆమె ఇచ్చిన స్పందన నెటిజన్లను విభిన్నంగా ఆకర్షించింది. ‘మా’ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.