
📌 Key Points
- నటి కామాక్షి భాస్కర్ల విభిన్న ప్రకటనలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
- వైద్య విద్యను అభ్యసించిన కామాక్షి, నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
- ‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో కామాక్షికి మంచి గుర్తింపు లభించింది.
- ఒత్తిడిని జయించడానికి శవాల మధ్య కూర్చుంటానని కామాక్షి చెప్పడం సంచలనం రేపింది.
హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆమె నిరాశగా ఉన్నప్పుడు శవాల మధ్య కూర్చుంటానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కామాక్షి భాస్కర్ల సినీ ప్రస్థానం
Kamakshi Bhaskarla: కొంతమంది హీరోయిన్లు సినిమాలతోనే కాకుండా తమ సోషల్ మీడియా వీడియోల ద్వారా కూడా తెగ ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు.. కామాక్షి భాస్కర్ల. చాలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరోపక్క ఆమె సోషల్ మీడియాలో చేసే కొన్ని వీడియోలు అలానే ఆమె చెప్పే కొన్ని మాటలు ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆకట్టుకుంటూ ఉంటాయి.
కామాక్షి భాస్కర్ల అసలు వృత్తి డాక్టర్. ఆమె చైనాలో ఎంబీబీఎస్ చదివింది. చదువు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేసింది. అయితే చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండటంతో తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆమె 2019లో విడుదలైన ప్రియురాలు అనే సినిమాతో నటిగా పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు చేసింది. కానీ ఆమెకు అసలు గుర్తింపు తెచ్చింది మా ఊరి పొలిమేర సినిమా. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. తర్వాత వచ్చిన పొలిమేర 2 సినిమాలో కూడా ఆమె లక్ష్మీ పాత్రలో నటించి మరింత పేరు సంపాదించింది.
వైద్యురాలు నుండి నటిగా మారిన కామాక్షి
ఈ సినిమాలో చేసిన నటనకు గాను కామాక్షి భాస్కర్లకు 2024లో న్యూ ఢిల్లీలో జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది. దీంతో ఆమె పేరు మరింతగా వినిపించింది.
ఇటీవల కామాక్షి నటించిన “12A రైల్వే కాలనీ” అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చేసింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
తనకు చాలా ఒత్తిడి లేదా నిరాశగా అనిపించినప్పుడు ఒక ప్రత్యేకమైన పని చేస్తానని ఆమె తెలిపింది. మనసుకు ప్రశాంతత కావాలనిపించినప్పుడు తాను స్మశానానికి వెళ్తానని చెప్పింది. అక్కడికి వెళ్లినప్పుడు జీవితం గురించి చాలా విషయాలు గుర్తుకు వస్తాయని ఆమె చెప్పింది.
ఒత్తిడిని జయించేందుకు కామాక్షి వినూత్న పద్ధతి
స్మశానంలో కొంతసేపు నిశ్శబ్దంగా ఉండటం వల్ల మనసుకు ఒక రకమైన శాంతి లభిస్తుందని కామాక్షి తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత తనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు.. అనిపిస్తుందని కూడా చెప్పింది.కానీ అలా శవాల మధ్యలో కూర్చుంటే తనకు మనశాంతి వస్తుంది అని ఈ హీరోయిన్ అనధం అందరిని ఆశ్చర్యపరిస్తోంది.
కామాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె ఆలోచనను ఆసక్తికరంగా చూస్తుండగా, మరికొందరు ఆశ్చర్యంగా భావిస్తున్నారు.
కామాక్షి భాస్కర్ల చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మనోధైర్యానికి కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.


