
ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గాయకులకు ఇచ్చే తక్కువ పారితోషికం గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 101 రూపాయలు మాత్రమే కొందరు గాయకులు అందుకుంటున్నారని ఆమె వెల్లడించారు.
Key Points
కనికా కపూర్ 101 రూపాయలే పారితోషికంగా అందుకున్నారని వెల్లడించారు.
భారతీయ గాయకులకు తగినంత పారితోషికం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
గాయకుల జీవనోపాధి గొంతు బతికున్నంతకాలం మాత్రమే అని వివరించారు.
పెన్షన్ లేకపోవడం గాయకుల భవిష్యత్తుకు ముప్పు అని ఆమె అభిప్రాయపడ్డారు.
కనికా కపూర్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సింగర్స్‌లలో కనికా కపూర్ ఒకరు. బేబీ డాల్, చిట్టియాన్ కా లైయాన్ వే వంటి పాటలతో ఫుల్ ఫేమస్ అయింది సింగర్ కనికా కపూర్. అయితే, సింగర్స్‌కు సంబంధించిన రియాలిటీ గురించి ఇటీవల ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఈ బ్యూటిఫుల్ సింగర్.
బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ హోస్ట్‌గా చేస్తున్న బంక్ విత్ ఉర్ఫీ షోలో గాయనీగాయకులకు ఇచ్చే పారితోషికం గురించి చెప్పింది కనికా కపూర్. గాయకులకు భారతదేశంలో నిజంగా సరైన పారితోషికం లభించదని, వారు వాస్తవంగా డబ్బు ఎలా సంపాదిస్తారో వివరించింది.
“సింగర్స్‌కు సరైన పారితోషికం అందదు. నేను కుదుర్చుకున్న అన్ని కాంట్రాక్ట్స్ మీకు చూపిస్తాను. నాకు కేవలం రూ.101 మాత్రమే చెల్లించారు. రెమ్యునరేషన్‌కు బదులుగా వారు మాకు మేలు చేస్తున్నట్లు చెప్తారు. నేను పేరు చెప్పలేను కానీ, ఇండియాలో ఒక గొప్ప గాయకుడు కూడా తన పాటలకు సరైన పారితోషికం తీసుకోవట్లేదు” అని కనికా కపూర్ తెలిపింది.
గాయకులకు తక్కువ పారితోషికం
“అతను ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. అతన పాటలకు, రాయలిటీకి ఏమాత్రం తగిన పారితోషికం ఇవ్వట్లేదు. ఇండియాలో సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వడం వంటిది ఏమాత్రం జరగట్లేదు” అని గాయనీ కనికా కపూర్ చెప్పుకొచ్చింది. “మరి సింగర్స్ ఎలా సంపాదిస్తారు” అని ఉర్ఫీ జావేద్ అడిగింది.
దీనికి “మీరు పాడినంతకాలమే మీరు బతికి ఉంటారు. మీ గొంతు బతికున్నంతకాలమే, మీరు ఏవైనా ప్రదర్శనలు (పర్ఫామెన్స్ షోలు) ఇవ్వగలిగనంత కాలం మాత్రమే మీరు సంపాదించగలరు. కానీ, రేపు ఏదైనా జరిగితే సింగర్స్‌కు ఎలాంటి పెన్షన్ ప్లాన్ ఉండదు” అని కనికా కపూర్ వివరించింది.
“నేను ఎవరి కాంట్రాక్ట్స్ చూడకపోయినా నిజానికి సింగర్స్ తాము పాడిన పాటలకు కేవలం 101 రూపాయలు మాత్రమే అందుకుంటున్నారు అనేది నిజం” అని కనికా కపూర్ స్పష్టం చేసి చెప్పింది.
భవిష్యత్తు భద్రత లేకపోవడం
ఇకపోతే కనికా కపూర్ ఐటమ్ సాంగ్స్‌తో చాలా పాపులర్ అయింది. సన్నీ లియోన్ నటించిన రాగిణి ఎంఎంఎస్ 2 (2014) చిత్రంలోని బేబీ డాల్ అనే చార్ట్ బస్టర్ డెబ్యూ సాంగ్‌తో కనికా ఫేమస్ అయింది. ఈ సాంగ్ ఆమెను ఓవర్ నైట్ సెన్సేషన్‌గా మార్చింది. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ వాయిస్‌లలో ఒకటిగా చేసింది.
ఈ సాంగ్ తర్వాత లవ్లీ (హ్యాపీ న్యూ ఇయర్), చిట్టియాన్ కా లైయాన్ వే (రాయ్), దేశీ లుక్ (ఏక్ పహేలీ లీలా), బీట్ పె బూటీ (ఎ ఫ్లయింగ్ జాట్) వంటి అనేక హిట్ సాంగ్స్ పాడింది కనికా కపూర్.
కనికా కపూర్ వ్యాఖ్యలు భారతీయ గాయకుల పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. వారికి తగిన గౌరవం, పారితోషికం అందించే వ్యవస్థ అవసరం అని ఈ ఘటన తెలియజేస్తుంది.


