
ఐఎండీబీలో 7 రేటింగ్‌తో విజయవంతమైన కన్నడ క్రైమ్ డ్రామా “నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు” జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కోటీశ్వరుడి విచిత్రమైన దొంగతనాల కథ చూడదగినది.
Key Points
కన్నడ క్రైమ్ డ్రామా "నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు" ఓటీటీలోకి.
ఐఎండీబీలో 7 రేటింగ్ సొంతం చేసుకున్న సూపర్ హిట్ సినిమా.
జూన్ 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్.
కోటీశ్వరుడు సరదా కోసం దొంగతనాలు చేయడం కథాంశం.
నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు ఓటీటీ రిలీజ్
కన్నడ క్రైమ్ డ్రామా మూవీ నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు. అంటే తెలుగులో మీ వస్తువులకు మీరే బాధ్యులు అని అర్థం. మనం ఎక్కడికి వెళ్లినా ఈ హెచ్చరికను చూస్తూనే ఉంటాం. ఇదే టైటిల్ తో వచ్చిన కన్నడ ఆంథాలజీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ మూవీ నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు (Nimma Vasthugalige Neeve Javaabdaararu). ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఈ సినిమాను ఈ శుక్రవారం (జూన్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.
కోటీశ్వరుడి ఆసక్తికరమైన దొంగతనాలు
ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం (జూన్ 25) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు – సూపర్ హిట్ సినిమా మీ సన్ నెక్ట్స్ లో జూన్ 27న రానుంది” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని వెల్లడించింది.
నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు మూవీ టైటిల్ తోనే ప్రేక్షకులను ఆకర్షించింది. మనం ఎక్కడికి వెళ్లినా మీ వస్తువులకు మీరే బాధ్యులు అనే బోర్డులు కనిపిస్తూనే ఉంటాయి. దీంతో అదే టైటిల్ తో దర్శకుడు కేశవ్ మూర్తి ఈ సినిమా తీశాడు. ఇందులో దిలీప్ రాజ్, శిల్పా మంజునాథ్, అపూర్వ భరద్వాజ్, ప్రసన్న శెట్టిలాంటి వాళ్లు నటించారు.
ఐఎండీబీ 7 రేటింగ్‌తో సూపర్ హిట్
మన దగ్గర ఎంత ఉన్నా పక్కవాళ్ల వస్తులపై ఉండే వ్యామోహం ఎలాంటిదో మనకు తెలుసు. ఆ సింపుల్ పాయింట్ ను బేస్ చేసుకొనే ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా ఓ ఆంథాలజీ. మూడు వేర్వేరు కథల సమాహారం. అబ్సెషన్ కంపల్షన్ డిజార్డర్ తో బాధపడుతూ బైకు చోరీ చేసే వ్యక్తి, కోటీశ్వరుడైనా క్లెప్టోమానియాక్ అయిన వ్యక్తి సరదా కోసం దొంగతనాలు చేయడం, ఇక మరొకరు ప్రొఫెషనల్ బ్లాక్‌మెయిలర్.. ఇలా ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథ.
ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బెంగళూరు నగరంలోని ఈ ముగ్గురు వేర్వేరు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఈ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచింది. దీంతో ఐఎండీబీలో 7 రేటింగ్ వచ్చింది. ఇప్పుడీ సినిమా జూన్ 27 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
చివరగా, “నిమ్మ వస్తుగలిగే నీవే జవాబుదారారు” సినిమా ఓటీటీలో విడుదల కావడం అభిమానులకు సంతోషాన్నిచ్చింది. ఈ ఆసక్తికరమైన క్రైమ్ డ్రామాను తప్పకుండా చూడండి.


