
విడుదలకు ముందు కన్నప్ప సినిమాకు మరో షాక్ తగిలింది. మంచు విష్ణుతో పాటు చిత్రయూనిట్ ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ట్యాక్స్ ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
Key Points
మంచు విష్ణు ఇంటితో పాటు చిత్రయూనిట్ ఇళ్లలో జీఎస్టీ అధికారుల తనిఖీలు
కన్నప్ప సినిమా బడ్జెట్ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు
జూన్ 27న కన్నప్ప సినిమా విడుదల
జీఎస్టీ అధికారుల తనిఖీలు
విడుదలకు ముందే కన్నప్ప సినిమాకు మరో షాక్ తగిలింది. హీరో మంచు విష్ణుతో పాటు సినిమాలోని పలువరి ఇళ్లలో జీఎస్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్‌లోని విష్ణు కార్యాలయంలోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నప్ప సినిమా బడ్జెట్ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. కన్నప్ప సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించిన సంగతి తెలిసిందే.
సుమారు 120 నుండి 200 కోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించారని వార్తలు వస్తున్నాయి. గతంలో కన్నప్ప బడ్జెట్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టేశాం అని గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అన్నారు. ఇక ఇప్పుడు ఆయన ఇంట్లో, చిత్రయూనిట్ సభ్యుల ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ ప్రభాస్, మలయాల స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం నటించారు. దీంతో వారి రెమ్యునరేషన్ల గురించి కూడా నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది.
కన్నప్ప సినిమా బడ్జెట్
ట్యాక్స్ ఎగవేత ఆరోపణలు
కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఈ షాక్ తో చిత్రయూనిట్ ఖంగుతిన్నట్టుంది. జీఎస్టీ అధికారుల తనిఖీల ఫలితం ఏంటో చూడాలి.



Zareen Khan Blasts Paparazzi for Inappropriate ‘Try the Dress’ Remark, Demands Respect