
రిషబ్ శెట్టి రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా రూ. 680 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. దీపావళి సందర్భంగా, మేకర్స్ అదిరిపోయే యాక్షన్ సీన్లతో నిండిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
Key Points
అక్టోబర్ 2న విడుదలై రూ. 680 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
దీపావళి సందర్భంగా యాక్షన్ సీన్లతో కూడిన కొత్త ట్రైలర్ విడుదల.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించగా, రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో.
హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.
‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ జర్నీ
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది . అక్టోబర్ 2 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ . 680 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పలు రికార్డులను బద్దలు కొడుతోంది . ఇప్పటికీ అత్యధిక థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్(Kantara Chapter 1 Deepavali Trailer)ని రిలీజ్ చేశారు మేకర్స్.
దీపావళి కానుకగా నేడు(గురువారం) విడుదలైన ఈ కొత్త ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిని చూపించారు. యాక్షన్ సీన్లను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించి ఈ చిత్రంలో యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించాడు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.
కొత్త ట్రైలర్‌లో యాక్షన్ హైలైట్స్
రిషబ్ శెట్టి, హోంబలే ఫిలింస్
‘కాంతార చాప్టర్ 1’ విజయవంతమైన రన్ కొనసాగుతుండగా, తాజా ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాక్సాఫీస్ వద్ద దాని ప్రభంజనం కొనసాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


