|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kareena Kapoor: కరీనా కపూర్ చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. ఆమెను బాయ్‌కాట్ చేయాలంటూ డిమాండ్

Published: 30-04-2025, 7:15 AM

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దాడి తర్వాత, కరీనా కపూర్ పాకిస్థానీ ఫ్యాషన్ డిజైనర్‌తో దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి ప్రతిస్పందనగా, నెటిజన్లు ఆమెను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Key Points

1

కరీనా కపూర్ పాకిస్థానీ డిజైనర్‌తో దిగిన ఫోటో వైరల్

2

నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు, బాయ్‌కాట్ పిలుపు

4

సోషల్ మీడియాలో #BoycottKareenaKapoor ట్రెండింగ్‌లో ఉంది

పాకిస్థానీ డిజైనర్‌తో ఫోటో

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతీయులను ఆగ్రహానికి గురి చేస్తోంది. అమాయకపు పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడంతో ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కన్నీరు పెట్టుకునేలా చేసింది. అయితే ఈ దాడిలో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారు చనిపోవడం గమనార్హం. ఈ ఘటనలో ఏకంగా 26 మంది చనిపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ దాడి పాకిస్తాన్ వాల్లే చేశారని అంతా అనుమానపడుతున్నారు. ఈ మేరకు గత కొద్ది రోజుల నుంచి పలు పోస్టులు పెడుతున్నారు. అయితే కొంతమంది పాకిస్తాన్ వారిని అక్కడిని తరలించిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా పాకిస్తాన్‌కు చెందిన నటీనటుల సినిమాలు కూడా బ్యాన్ చేయించారు. ఇదిలా ఉంటే.. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor) పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఫొటో ఒకటి నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మున్నన్‌ను కలిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ కావడంతో వాటిని చూసిన వారు విమర్శలు చేస్తున్నారు. అయితే ఇందులో కరినా తెల్లటి కార్సెట్ డ్రెస్, ఫరాజ్(Faraj Manan) నల్లటి టీ షర్ట్ ధరించి కనిపించారు. ఇక ఈ ఫొటో చూసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరీనా కపూర్ ఇలా చేయడం సిగ్గుచేటు ఆమెను బాయ్ కాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆమెను కూడా పాకిస్తాన్‌కు పంపాలని అంటున్నారు.

నెటిజన్ల ఆగ్రహం, విమర్శలు

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఆమెను తిట్టిపోస్తున్నారు. కాగా, కరీనా కపూర్ సినిమాల విషయానికొస్తే.. ఈ అమ్మడు గత ఏడాది క్రూ, సింగం అగైన్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) సరసన ‘ధైరా’ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ మూవీకి మేఘన గుల్జార్(Meghana Gulzar) దర్శకత్వం వహిస్తోంది. దీనిని జంగిల్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు టాక్.

#BoycottKareenaKapoor ట్రెండ్

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_)

కరీనా కపూర్ పై నెటిజన్ల ఆగ్రహం, బాయ్‌కాట్ పిలుపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాదం భవిష్యత్తులో ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.