
కర్ణాటక ప్రభుత్వం ఫిఫా వరల్డ్ కప్-2026 మ్యాచ్‌ల స్క్రీనింగ్ కోసం బెంగళూరులో రెస్టారెంట్లు, పబ్‌ల పని వేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున 3:30 వరకు వీటిని తెరిచి ఉంచేందుకు అనుమతి లభించింది.
Key Points
కర్ణాటక ప్రభుత్వం ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల స్క్రీనింగ్ కోసం రెస్టారెంట్లు, పబ్‌ల పని వేళలను పొడిగించింది.
బెంగళూరులో తెల్లవారుజామున 3:30 వరకు ఫుడ్ అవుట్లెట్లు తెరిచి ఉంచేందుకు అనుమతి.
ఈ నిర్ణయం నైట్ లైఫ్, పర్యాటకం, హోటల్ వ్యాపారాలకు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
శాంతిభద్రతల కోసం పోలీసులు నైట్ పెట్రోలింగ్, భద్రతా చర్యలు ముమ్మరం చేశారు.
ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రభుత్వం మినహాయింపు
సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) సారథ్యంలోని కర్ణాటక సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్, రెస్టారెంట్స్, పబ్ నిర్వహకులు, వ్యాపారులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. నగరంలో ఫిఫా వరల్డ్ కప్-2026 (FIFA World Cup 2026) మ్యాచ్‌ల లైవ్ స్క్రీనింగ్స్ నేపథ్యంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, పబ్‌ల పని వేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లను వీక్షించే క్రీడా ప్రేమికుల సౌకర్యార్థం తెల్లవారుజామున 3.30 గంటల వరకు వీటిని తెరిచి ఉంచేందుకు అధికారికంగా అనుమతలు జారీ చేసింది.
సాధారణంగా బెంగళూరు (Bengaluru) నగరంలో రాత్రి వేళల్లో హోటళ్లు, పబ్‌ల నిర్వహణపై కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే, ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా జరుగుతుండటంతో ప్రభుత్వం కాస్త ప్రత్యేక మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయంతో నగరంలో నైట్ లైఫ్ (Nigh Life) సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు, పర్యాటక రంగం, హోటల్ వ్యాపారాలకు పెద్ద ఎత్తున ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచకప్ మ్యాచ్‌ల క్రేజ్ కారణంగా నగరంలో వ్యాపారాలు గణనీయంగా పుంజుకుంటాయని వ్యాపార వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రెస్టారెంట్లు, పబ్‌ల వేళల పొడిగింపు నేపథ్యంలో నగరంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు దనపు భద్రతను ఏర్పాటు చేశారు.
బెంగళూరు నైట్ లైఫ్‌కు ఊతం
శాంతిభద్రతలకు పోలీసులు ప్రత్యేక చర్యలు
ఈ నిర్ణయంతో బెంగళూరు నైట్ లైఫ్ మరింత ప్రోత్సాహం పొందనుంది. ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఆస్వాదించే క్రీడాభిమానులకు ఇది శుభవార్త. అయితే, శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వ బాధ్యత.


