
📌 Key Points
- ఐపీఎల్ టికెట్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్టుదల
- ప్రతి ఎమ్మెల్యేకు మూడు టికెట్లు ఇస్తామని డీకే శివకుమార్ హామీ
- అంతర్జాతీయ మ్యాచ్‌లకు అదనంగా టికెట్లు
- టికెట్ల పంచాయతీపై నెటిజన్ల విమర్శలు
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐపీఎల్ టికెట్ల కోసం పట్టుబట్టడంతో రాజకీయ దుమారం రేగింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ఎమ్మెల్యేలకు మూడు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఉచిత టికెట్ల కోసం ఎమ్మెల్యేల డిమాండ్
ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైన నేపథ్యంలో టికెట్ల పంచాయతీ కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం నుంచే తమకు ఉచితంగా ఫ్యామిలీ టికెట్లు కావాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొండి పట్టు పట్టారు. తాము వీఐపీలమని.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు జరిగితే కచ్చితంగా నాలుగు టికెట్లు ఇవ్వాల్సిందేనని ప్రెస్ మీట్లు పెట్టి రచ్చ రచ్చ చేశారు. అయితే దీనిపై స్వయంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగారు.
డీకే శివకుమార్ హామీ
చివరకు ఐపీఎల్ మ్యాచ్‌లకు మూడు టికెట్లు ఇస్తామని డీకే శివకుమార్ చెప్పడంతో శాంతించారు ఎమ్మెల్యేలు. అలాగే అంతర్జాతీయ మ్యాచ్‌లకు రెండు, రిక్వెస్ట్ మేరకు మరో రెండు టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు డిప్యూటీ CM శివకుమార్. అయితే, ఈ పంచాయతీ నేపథ్యంలో నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. ఐపీఎల్ టికెట్లపై పెట్టిన శ్రద్ధలో సగం సమస్యలపై పెట్టుంటే.. పరిస్థితి మరోలా ఉండేదని చురకలు అంటిస్తున్నారు. ఇలాంటి పంచాయతీల కోసమే రాష్ట్ర ప్రజలు మీకు ఓటేసి గెలిపించారా? అంటూ విమర్శలు చేస్తున్నారు. కాగా ఐపీఎల్ మార్చి 28వ తేదీన ప్రారంభం కాగా, ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి.
నెటిజన్ల ఆగ్రహం
A post shared by India Today (@indiatoday)
ఐపీఎల్ టికెట్ల వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల డిమాండ్‌పై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


