
📌 Key Points
- కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
- విజయ్ సినిమా తప్పుకోవడంతో కార్తీ సినిమాకు మార్గం సుగమం అయింది.
- జనవరి 14న ‘వా వాతియార్’ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు.
- తెలుగులో ఈ సినిమా ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదల కానుంది, విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.
కార్తీ, కృతి శెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్’ సినిమా ఎట్టకేలకు సంక్రాంతికి విడుదల కానుంది. విజయ్ సినిమా వాయిదా పడటంతో ఈ సినిమాకు మార్గం సుగమం అయింది. జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.
సంక్రాంతి బరిలో కార్తీ ‘వా వాతియార్’
Vaa Vathiyaar: తమిళ చిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన సినిమాలు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9వ తేదీ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ (Jananayagan)ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో కార్తీ(Karthi), కృతి శెట్టి(Kriti Shetty) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “వా వాతియార్”(Vaa Vathiyaar). ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా తరచు వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా ఫైనాన్స్ ఇబ్బందుల కారణంగానే గతంలో వాయిదా పడిందని తెలుస్తుంది.
డిసెంబర్ 12వ తేదీ ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ చివరి నిమిషంలో నిర్మాత చెల్లించాల్సిన డబ్బును క్లియర్ చేసిన తరువాతనే సినిమా విడుదల చేయాలి అంటూ కోర్టు తీర్పు రావడంతో తప్పనిసరి పరిస్థితులలో వాయిదా పడింది. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న చిత్ర నిర్మాతలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి బరి నుంచి హీరో విజయ్ సినిమా తప్పుకోవడంతో కార్తీ వాతియార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ఈ సినిమాని జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే విడుదల కాబోతుందని తెలుగులో మరింత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఒకేసారి తెలుగు తమిళ భాషలలో ఈ సినిమాని విడుదల చేయాలని భావించారు కానీ సంక్రాంతి సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో తమిళ డబ్బింగ్ సినిమాలు ఆలస్యంగా విడుదలవుతున్నాయి.
విజయ్ సినిమా వాయిదా, కార్తీకి కలిసొచ్చిన అదృష్టం
#VaaVaathiyaar – Jan 14th ! pic.twitter.com/2sfpXDlUQp
— Prashanth Rangaswamy (@itisprashanth) January 9, 2026
‘అన్నగారు వస్తారు’గా తెలుగులో విడుదల
ఈ నేపథ్యంలోనే కార్తీ వా వాతియార్ సినిమా తెలుగు వర్షన్ మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతున్న నేపథ్యంలో కార్తీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండగా హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా ఈమెకు తమిళ డెబ్యూ సినిమా కావటం విశేషం. తెలుగులో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబమ్మ సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తమిళ సినిమాల ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు .మరి ఈ సినిమా కృతి శెట్టికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
మొత్తానికి అనేక వాయిదాల తర్వాత కార్తీ ‘వా వాతియార్’ సంక్రాంతికి విడుదల కావడం ఆయన అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా కార్తీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


