
📌 Key Points
- కార్తీక దీపం 2: 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్టార్ మా ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది.
- ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతున్న కార్తీక దీపం సీరియల్, టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్!
- సుమిత్ర కూతురు దీప అని తెలుసుకున్న దశరథ్.. కథ ఉత్కంఠభరితంగా మలుపు తిరిగింది.
- దీప తన బిడ్డను పణంగా పెట్టే పరిస్థితి! ఏం జరగనుందో చూడాల్సిందే.
బుల్లితెర ప్రేక్షకులకు కార్తీక దీపం 2 అదిరిపోయే ట్రీట్. 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్టార్ మా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఈ సీరియల్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
600 ఎపిసోడ్స్ మైలురాయి!
చాలా ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఫస్ట్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ సాధించి.. టాప్ లో నిలిచింది. ఇక సెకండ్ సీజన్ కూడా అంతకు మించిన రెస్పాన్స తో దూసుకుపోతోంది. తాజాగా కార్తీకదీపం సీజన్ 2 సీరియల్ సరికొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా 600 ఎపిసోడ్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సందర్భంగా Star Maa తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్, ప్రోమోను విడుదల చేసింది.
స్టార్ మా ట్వీట్ లో ఏముందంటే..? “మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు” అంటూ స్టార్ మా పోస్ట్ చేసింది. మరో ప్రోమోలో “600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ.. ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ కృతజ్ఞతలు” అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ 💖 మన మనసుల్లో నిలిచిన #KarthikaDeepam టీమ్‌కి శుభాకాంక్షలు ✨ ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ ధన్యవాదాలు 🌸 #600EpisodesOfKarthikadeepam Watch #KarthikaDeepam Mon to Sat at 8 PM only on #StarMaa pic.twitter.com/Z3nsfmiB1T
స్టార్ మా స్పెషల్ ట్రీట్
— Starmaa (@StarMaa) February 21, 2026
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ను ఓటీటీ లో Jio Hotstar లో కాస్త ముదుగానే చూసే అవకాశం ఉంది. కార్తీకదీపం తొలి సీజన్ 1500కు పైగా ఎపిసోడ్లతో తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించింది. వంటలక్క (దీప) – డాక్టర్ బాబు (కార్తీక్) జంట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆ జోడీని మళ్లీ తెరపై చూడాలనుకున్న అభిమానుల కోరిక మేరకు రూపొందిన సీజన్2 ‘ఇది నవ వసంతం’ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది.
కథలో ఊహించని మలుపులు!
ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. 600వ ఎపిసోడ్ కథలో కీలక మలుపుగా నిలిచింది. సుమిత్ర అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అనే నిజం దశరథకు తెలిసిపోవడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. పారిజాతం చేసిన పసిబిడ్డల మార్పిడి గుట్టు రట్టవడంతో కుటుంబ సంబంధాలు కుదేలయ్యాయి. తల్లి సుమిత్ర ప్రాణాలను కాపాడటానికి దీప తన గర్భంలోని బిడ్డను పణంగా పెట్టే క్లిష్ట పరిస్థితుల్లో పడింది.
ఈ సీరియల్‌లో కార్తీక్ బాబు పాత్రలో నిరుపం పరిటాల, దీప గా ప్రేమి విశ్వనాథ్, జ్యోత్స్నగా ప్రియాంక, దశరథగా సుభాష్, పారిజాతం పాత్రలో సుమిత్ర నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ మళ్లీ దీప పాత్రలోకి రావడం ఈ సీజన్ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొదటి సీజన్‌లో మోనిత పాత్ర ఎంతటి విలనీని పండించిందో, ఈ సీజన్‌లో జ్యోత్స్న పాత్ర అదే స్థాయిలో ప్రతికూల ఛాయలను తెరపై ఆవిష్కరిస్తోంది.
కార్తీక దీపం 2 సీరియల్ మరింత ఉత్కంఠగా సాగుతోంది. రానున్న ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


