|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: జ్యోత్స్న జాతకం బయటపెట్టిన దాసు! దీప ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

Published: 11-01-2026, 10:05 PM
  • కార్తీక్ ఎమోషనల్ డైలాగ్: సుమిత్ర అత్త గురించి ఆవేదన వ్యక్తం.
  • జ్యోత్స్నను కాపాడాలని పారిజాతం ప్రయత్నం, దాసు నిరాకరణ!
  • దీప సడన్ ఎంట్రీ, బాబాయ్ అని పిలుపు, షాక్ లో అందరూ!
  • అసలు వారసురాలు బతికే ఉందని దాసు చెప్పడం, ఉత్కంఠ రేపుతున్న ఎపిసోడ్.

కార్తీక దీపం 2 సీరియల్ మరో సంచలన ఎపిసోడ్‌తో మీ ముందుకు వచ్చింది. జ్యోత్స్న జాతకం బయటపడనుందా? దీప ఎంట్రీతో కథ ఏ మలుపు తిరుగుతుందో చూడటానికి సిద్ధంగా ఉండండి! మీ టీవీలకు అతుక్కుపోండి.

దాసు ప్లాన్: జ్యోత్స్న నిజం బయటపడుతుందా?

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో నిజాలు చెప్పడం చాలా ఈజీ కానీ.. వాటిని దాయడమే కష్టం మామయ్య అంటాడు కార్తీక్. నిజాలు దాయడమే కష్టం అయితే వాటిని మోయడం ఇంకెంత కష్టమో.. అలాంటి నిజాలను మోసి మోసి ఈ గుండె రాటు దేలిపోయింది అని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. సుమిత్ర అత్త నాకు కన్నతల్లి లాంటిది. అత్తకు కొడుకు లేడనే లోటు నాతో తీర్చుకుంది. అలాంటి అత్తను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే లోపల నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు అంటాడు కార్తీక్.

అత్తకు ఏం కాదని ముందు మనం నమ్మాలి. అప్పుడే మనం అత్తకు ధైర్యం చెప్పగలం అంటాడు కార్తీక్. అవును అన్నయ్య, కార్తీక్ చెప్పింది నిజమే. వదినకు ఏం కాదు నువ్వు వదినా కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. నీ కూతురి పెళ్లి చేస్తారు. వదినకు ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండమంటుంది కాంచన.

మరోవైపు దాసు, పారిజాతం జ్యోత్స్న మాట్లాడుకుంటూ ఉంటారు. సుమిత్ర గురించి నీకు తెలిసే ఉంటుంది కదా అని దాసును అడుగుతుంది పారు. తెలుసు అమ్మ అంటాడు దాసు. తెలిసి కూడా నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నావురా? అంటుంది పారు. మనం చెప్పాలి అనుకున్న నిజాన్ని దేవుడే చెప్తేంటే ఎవరు ఏం చేస్తారమ్మా అంటాడు దాసు. అలా మాట్లాడకురా.. మెడికల్ టెస్టులు చేస్తే జ్యోత్స్న దొరికిపోతుంది. నీ కూతురిని ఇప్పుడు నువ్వే కాపాడాలి అని అడుగుతుంది పారిజాతం.

నేను ఆ పని చేయలేను అంటాడు దాసు. నీలాంటి తండ్రిని నేను ఎక్కడా చూడలేదు. ఏ తండ్రి అయినా సమస్య కూతురు వరకూ రాకుండా కాపాడుతాడు. కానీ నువ్వు అంటూ రెచ్చిపోతుంది జ్యోత్స్న. కూతురు రోడ్డు మీద పడితే తండ్రిగా ఆదుకుంటాను. ఇంట్లో చోటు ఇస్తాను అంటాడు దాసు. అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే చావడం మేలు అంటుంది జ్యోత్స్న. దాని మాటలు వదిలెయ్ నువ్వు ఈ ఒక్క సాయం చేయ్ రా మనమంతా ఒక కుటుంబం అంటుంది పారు.

దీప ఎంట్రీ: కథలో ఊహించని మలుపు!

మరి కాశీ ఎవరు అని అడుగుతాడు దాసు. వాడు మన కుటుంబమే అంటుంది పారు. మరి కాశీని ఎందుకు వదిలేశారని అడుగుతాడు దాసు. నువ్వు నీ కూతురిని కాపాడు, అది కాశీని కాపాడుతుంది అంటుంది పారు. ఇప్పుడు నీకు ఏం కావాలి అమ్మా అని అడుగుతాడు దాసు. అసలైన వారసురాలు బతికే ఉందన్నావు కదా… ఎక్కడుంది అని అడుగుతుంది పారు.

ఇక్కడే ఉంది అంటాడు దాసు. అప్పుడే కాఫీ కప్ తో ఎంట్రీ ఇస్తుంది దీప. ఎలా ఉన్నావ్ బాబాయ్ అని అడుగుతుంది దీప. నేను బాగున్నాను. సుమిత్ర వదినకు కూడా ఏం కాదు.. నువ్వు భయపడకు అమ్మా.. కన్నకూతురు ఉంది కదా కాపాడుకుంటుందని అంటాడు దాసు. నాన్నను పిలిపించిన పని ఏంటో చెప్పు గ్రానీ అంటుంది జ్యోత్స్న. నువ్వు అసలు వారసురాలిని తీసుకురావాలి అంటుంది పారు. ఏం జ్యోత్స్న తీసుకురమ్మంటావా? అని అడుగుతాడు దాసు.

మరోవైపు దీప, కార్తీక్ దగ్గరికి వెళ్లి దాసు బాబాయి వచ్చి బయట జ్యోత్స్న, పారిజాతం గారితో మాట్లాడుతున్నాడు. ఏదో ప్లాన్ వేస్తున్నారని కార్తీక్ తో అంటుంది దీప. జ్యోత్స్న దాసు మామయ్య కూతురు. ఆ నిజం బయటపడొద్దంటే అసలైన కూతురు రావాలి. జ్యోత్స్నకు నిజం తెలుసు కానీ పారుకు చెప్పదు. దాసు మామయ్య మాటిచ్చాడు కాబట్టి పారుకు నిజం చెప్పడు. ఇంక వాళ్లు ప్లాన్ చేయడానికి ఏం ఉంటుంది అంటాడు కార్తీక్. ఇంకా ఏదైనా అవకాశం ఉందో ఆలోచించు అంటుంది దీప.

మనం దీన్ని ఆపాలంటే నువ్వు వెళ్లి మా అమ్మకు నిజం చెప్పి.. హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటుంది దీప. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వే ఈ ఇంటి వారసురాలివని బయటపడక తప్పదు అంటాడు కార్తీక్. కానీ జ్యోత్స్ననే నిజం ఒప్పుకునేలా చేయాలి అంటాడు. తను ఒప్పుకోదు బావ అంటుంది దీప.

సుమిత్ర ఆరోగ్యం: కార్తీక్ ఆందోళన!

మరోవైపు సుమిత్ర అసలైన కూతురు రాకపోతే నీ కూతురు అన్యాయం అవుతుందిరా అంటుంది పారు. ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే అంటాడు దాసు. నేను మీకు సాయం చేయలేనమ్మా అంటాడు. నువ్వు సాయం చేయకపోతే పైనున్న కళ్యాణి నిన్ను క్షమించదు రా అంటుంది పారిజాతం. జ్యోత్స్న ఎవరో నిజం చెప్పడమే అసలైన పరిష్కారం అంటాడు దాసు. ఈ నిజం ఈ రోజు చెప్పేయడే మంచిది అంటాడు దాసు. అంతలో శివన్నారాయణ వచ్చి.. నాతో ఏం చెప్పాలి దాసు అని అడుగుతాడు.

నా కొడుకు తప్పు చేశాడు. అందుకు మీరు నన్ను క్షమించాలి అని అడుగుతాడు దాసు. ఎవరు తప్పు చేస్తే వాళ్లే క్షమాపణకు అర్హులు. నువ్వు ఏ తప్పు చేయలేదు అంటాడు శివన్నారాయణ. ఇంతకీ నువ్వు నాతో ఏం చెప్పాలి దాసు అని అడుగుతాడు శివన్నారాయణ. చెప్పొద్దని సైగ చేస్తుంది జ్యోత్స్న. నాన్నతో చెప్పడానికి ఇబ్బంది అయితే నాతో చెప్పు అంటాడు దశరథ. ఈ విషయం అందరూ వినాల్సిందే. వీలైతే వదినను, దీపను కూడా రమ్మనండి అంటాడు దాసు.

వదినను చూడ్డానికి వచ్చినవాడివి పలకరించి వెళ్లిపోకుండా ఇదంతా అవసరమా? నువ్వు వెళ్లిపో దాసు అంటుంది పారిజాతం.

నువ్వు ఎప్పుడూ నన్ను సొంత తమ్ముడిలాగే చూశావు. కానీ నేను నీకు ఒక ద్రోహం చేశాను అన్నయ్య అంటాడు దాసు. ఇప్పుడు నేను చెప్పినా మీరు నన్ను క్షమించరు అంటాడు. ఏం చెప్పాలి అనుకుంటున్నావు అంటాడు దశరథ. జ్యోత్స్న గురించి అని దాసు చెప్పడంతో.. వణికిపోతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

కార్తీక దీపం 2 ఎపిసోడ్ అనేక మలుపులతో ఉత్కంఠగా సాగింది. రాబోయే ఎపిసోడ్‌లలో ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.