
📌 Key Points
- కార్తీక్, దీపల మధ్య జ్యోత్స్న డ్రామా! అసలు నిజం తెలుసుకోవాలని దీప ప్రయత్నాలు!
- హాస్పిటల్ పేరుతో కార్తీక్‍ను తిప్పుతున్న జ్యోత్స్న! అసలు ప్లాన్ ఏంటో?
- దీపకు ఫోన్ చేసిన కార్తీక్.. జ్యోత్స్న గురించి చెప్పడంతో షాకింగ్ రియాక్షన్!
- ఇంటికి రాని జ్యోత్స్న, కార్తీక్.. కంగారు పడుతున్న శివన్నారాయణ, సుమిత్ర!
కార్తీక దీపం 2 సీరియల్‍లో బిగ్ ట్విస్ట్! దీప తీసుకున్న ఒక సంచలన నిర్ణయం కార్తీక్ జీవితాన్ని మార్చేసింది. జ్యోత్స్న వేసిన ఎత్తులకు పైఎత్తు వేస్తూ దీప ఏం చేస్తుందో చూడాలి.
కార్తీక్, దీపల మధ్య చిచ్చు పెట్టిన జ్యోత్స్న!
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న అమ్మకు బలహీనత అయిపోయింది. తనకు ఏమైనా అయితే అమ్మ తట్టుకునేలా లేదు అంటుంది దీప. ఆ మాటలు చాటుగా నిలబడి వింటుంది జ్యోత్స్న. నిజం తెలిసినా అత్త తట్టుకునేలా మనం ప్రిపేర్ చేయాలి దీప అంటాడు కార్తీక్.
ఇంతలో జ్యోత్స్న బావ అనుకుంటూ వాళ్ల దగ్గరకు వస్తుంది. నాకు కళ్లు తిరుగుతున్నాయి అంటుంది. అయితే ఇక్కడ కూర్చో అంటుంది దీప. లేదు నేను హాస్పిటల్ కి వెళ్లాలి పదా బావ అంటుంది జ్యోత్స్న. వాడు ఎందుకు నేను వస్తాను పదా అంటుంది పారు. నువ్వు వస్తే నాకు ఇంకా తలనొప్పి పెరుగుతుంది అంటుంది జ్యోత్స్న. చేసేదేమి లేక తీసుకొని వెళ్తాడు కార్తీక్.
కార్తీక్, జ్యోత్స్న కార్లో వెళ్తుంటారు. హాస్పిటల్ కి అన్నారు ఏ హాస్పిటల్ కో చెప్పలేదు అంటాడు కార్తీక్. కారు పక్కన ఆపు బావ అంటుంది జ్యోత్స్న. ఇక్కడెందుకు అని అడుగుతాడు కార్తీక్. పక్కన కొబ్బరి బోండాల బండి ఉంది. ఒక కొబ్బరి బొండం తాగితే డీ హైడ్రేషన్ తగ్గుతుంది వెళ్లి తీసుకురా బావ అంటుంది జ్యోత్స్న. పెద్దవాళ్లు చెప్పిన మాట ఎందుకు వినాలో నాకు ఈ రోజు అర్థమైంది. మా అమ్మ ఈ రోజు ఎక్కడికి వెళ్లొద్దు అంది కానీ నేనే వినలేదు అని చిరాకు పడుతూ కొబ్బరి బోండం తెచ్చిస్తాడు కార్తీక్.
షాకింగ్ ట్విస్ట్: దీప సంచలన నిర్ణయం!
ఇంతలో కార్తీక్ కి దీప ఫోన్ చేసి, ఎక్కడున్నావు బావ అని అడుగుతుంది. నాకు ఇంకా తల తిరగడం ఆగలేదు దీప. డీ హైడ్రేషన్ రాకూడదని కొబ్బరి బోండం తాగుతున్నాను అని చెప్తుంది జ్యోత్స్న. ఆ బోండం తీసి దాని తలకేసి కొట్టు బావ అంటుంది దీప. షాక్ అవుతుంది జ్యోత్స్న. దాన్ని అక్కడే వదిలేసి నువ్వు రా బావ అని కార్తీక్ తో చెప్తుంది దీప. మళ్లీ కారు స్టార్ట్ చేస్తాడు కార్తీక్. హాస్పిటల్ పేరుతో తిప్పుతూనే ఉంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న హాస్పిటల్ కి వెళ్లిందో లేదో అనుకుంటుంది పారు. ఇంతలో శివన్నారాయణ, పారుకి ఫోన్ చేసి అప్పుడు అనంగా వెళ్లారు. ఇంకా రాలేదు ఇంటికి అని అడుగుతాడు. నేను దీపను ఇంట్లో వదిలేసి వస్తున్నాను అండీ అని చెప్తుంది పారు. మరి జ్యోత్స్న ఏది అని అడుగుతాడు శివన్నారాయణ. జ్యోత్స్న తల తిరుగుతోందని హాస్పిటల్ కు వెళ్లింది అని చెప్తుంది పారు. సుమిత్ర కంగారు పడుతుంది. జ్యోత్స్న కావాలనే ఇలా చేస్తోందా అని అనుమానపడతాడు దశరథ.
కార్తీక్ పరిస్థితి ఏంటి? జ్యోత్స్న ప్లాన్ ఫలిస్తుందా?
మరోవైపు చిరాకు వస్తోందా బావ అని కార్తీక్ ని అడుగుతుంది జ్యోత్స్న. మంచి హాస్పిటల్ కి వెళ్లాలి కదా.. అక్కడ అపాయింట్ మెంట్ దొరకకపోతే నేనేం చేస్తాను అంటుంది జ్యోత్స్న. అప్పుడే పారు, జ్యోత్స్నకు కాల్ చేస్తుంది. త్వరంగా ఇంటికి రండి అని చెప్తుంది. నువ్వు దాన్ని హాస్పిటల్లో వదిలేసి ఇంటికి పో. నేను వేరే డ్రైవర్ ని పంపిస్తాను అంటుంది పారు. నాకు బావే కావాలి అంటుంది జ్యోత్స్న. వాడేమైనా నీ మొగుడా.. వాడే కావాలి అంటున్నావు అంటుంది పారు. అలాగే అనుకో అని ఫోన్ కట్ చేస్తుంది జ్యోత్స్న.
మళ్లీ మధ్యలో కారు ఆపి ఐస్ క్రీం తీసుకుంటుంది జ్యోత్స్న. కొంత దూరం వెళ్లాక కారు ఆపి.. నీ పెళ్లి రోజుకు మంచి గిఫ్ట్ ప్లాన్ చేశాను బావ అని చెప్తుంది. ఏంటది అని అడుగుతాడు కార్తీక్. దీపే ఆ ఇంటి వారసురాలని చెప్తాను అంటుంది జ్యోత్స్న. అయ్యో నువ్వు ఇంత మంచి విషయం చెప్తావని తెలియక కాస్త చిరాకు పడ్డాను అంటాడు కార్తీక్. సరే ఆ గిఫ్ట్ ఏదో త్వరగా ఇస్తే నేను వెళ్లిపోతాను అంటాడు కార్తీక్. ఇది చాలా అరుదైన గిఫ్ట్ అంటుంది జ్యోత్స్న. కార్తీక్ ని చేయి చాపమని తాళి చేతిలో పెడుతుంది జ్యోత్స్న. ఈ తాళి నా మెడలో కట్టి నన్నే గిఫ్ట్ గా తీసుకో బావ అంటుంది. షాక్ అవుతాడు కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ రోజుకో మలుపు తిరుగుతుంది. జ్యోత్స్న కుట్రలు, దీప ప్రతిఘటన మధ్య ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!


