
📌 Key Points
- కార్తీక్ ప్రాణాలకు ముప్పు వాటిల్లింది, దాసు సకాలంలో కాపాడటంతో ప్రమాదం తప్పింది.
- శౌర్యను కిడ్నాప్ చేసింది జ్యోత్స్న అని తెలుసుకున్న కార్తీక్, ఆమెపై పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
- దీపను గదిలో బంధించి, ఆమెకు కాపలాగా పారిజాతంను నియమించిన జ్యోత్స్న.
- హోమం గుండంలో మంటలు ఎగిసిపడటంతో ఏం జరగబోతుందోనని ఉత్కంఠ నెలకొంది.
కార్తీక దీపం 2 సీరియల్‌లో మరో సంచలన ఎపిసోడ్ మీకోసం! కార్తీక్ తన కూతురు శౌర్యను కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్లాడు? జ్యోత్స్న కుట్రలను ఛేదించడంలో కార్తీక్ సఫలం అయ్యాడా? తెలుసుకోవాలంటే చూడాల్సిందే!
కార్తీక్‌ను కాపాడిన దాసు ఎవరు?
Karthika Deepam 2 Serial March 19th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 19వ ఎపిసోడ్‌లో శౌర్య కిడ్నాప్ గురించి తెలిసి దీప వెళ్లిపోవాలని చూస్తుంది. డాక్టర్ హారిక వచ్చి బలవంతంగా లోపలికి పంపించేస్తుంది. దీపకు కాపలాగా పారిజాతంను పెడుతుంది జ్యోత్స్న. కార్తీక్‌కు దీప కాల్ చేసి శౌర్య గురించి అరుస్తుంది.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య కిడ్నాప్ అయిన విషయం పారిజాతం చెప్పడంతో దీప కంగారుగా బయలుదేరుతుంది. ఇంతలో డాక్టర్ ఎదురై నువ్వెక్కడికి వెళ్తున్నావ్, సుమిత్ర గారు వచ్చేశారు. నువ్వు ఇక్కడే ఉండాలని అంటుంది.
దీప వెళ్తానంటుంది. ఎక్కడికి వెళ్లేది లేదు. మనం అనుకుంది జరుగుతుంది. లోపలికి వెళ్లు అని బలవంతంగా గదిలోకి దీపను పంపించేస్తుంది డాక్టర్ హారిక. బయటకు వచ్చిన హారికను పారు మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతుంది. గైనకాలజిస్ట్ అంటూ ఏదోటి చెప్పి అందరూ నన్ను ప్రశ్నించేవాళ్లే. మా సమస్యలు మాకుంటాయి అని అరిచేసి వెళ్లిపోతుంది.
ఇంతలో జ్యోత్స్న వచ్చి అంతా ఓకేనా అని అడుగుతుంది. పారిజాతం ఓకే అని దీపను ఇక్కడే ఉంచింది డాక్టర్ అని చెబుతుంది. దీప ఎక్కడికి వెళ్లకుండా కన్నేసి చూడు అని జ్యోత్స్న అంటుంది. సరేనని చెప్పి శౌర్య గురించి అడుగుతుంది పారిజాతం. ఆపరేషన్ అయ్యేవరకు శౌర్య బావకు దొరకదు అని జ్యోత్స్న అనేసి వెళ్లిపోతుంది.
శౌర్య కిడ్నాప్‌కు జ్యోత్స్న ప్లాన్?
పారుతో కలిసి గట్టిగా ప్లాన్ చేసింది. నా కూతురుకు ఏం కాదని నేను మాటిస్తాను నీ తల్లికి ఏం కానివ్వను అని నువ్వు మాటిస్తావా. ముందు ఆపరేషన్ కానివ్వు అని కార్తీక్ అంటాడు. మాటిస్తున్నాను అని దీప అంటుంది. జ్యోత్స్న ఇక భరించలేకపోతున్నా. శౌర్య దొరకని నీ సంగతి చెబుతాను అని కార్తీక్ శౌర్య కోసం వెతుకుతుంటాడు. మరోవైపు శౌర్య గురించి దీప ఏడుస్తుంది.
అదంతా పారిజాతం చూస్తుంది. కార్తీక్‌కు దాసు కాల్ చేసి శౌర్య ఉన్న ప్లేసులోనే ఉన్నాను అని, జ్యోత్స్నే ఇదంతా చేసిందని తెలుసు అంటాడు. దాసు లొకేషన్ పంపిస్తాడు. దాంతో కార్తీక్ అక్కడికి వెళ్తాడు. మరోవైపు పారిజాతంను శౌర్య కిడ్నాప్ అయింది నీకెలా తెలుసుని నిలదీస్తుంది. మరోవైపు దాసు దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. అక్కడే శౌర్య ఉంది. నేను అన్ని చూడగలను. కానీ కాపాడలేను అని దాసు అంటాడు.
ఇద్దరు కార్తీక్‌ను పట్టుకుంటే ఓ రౌడీ కత్తి తీస్తాడు. అప్పుడే మరోవైపు హోమం గుండంలో నుంచి మంట చాలా ఎత్తులో ఎగిసిపడుతుంది. రౌడీ కత్తితో పొడవబోతే దాసు కర్రతో కొడతాడు. దాంతో కార్తీక్‌కు ప్రమాదం తప్పుతుంది. లోపలికి వెళ్లి శౌర్యను లేపుతాడు. శౌర్యను శ్రీధర్ తీసుకెళ్తాడని దాసుకు చెబుతాడు కార్తీక్ .
దీపకు పారు కాపలా.. ఏం జరుగుతోంది?
మరోవైపు దీప రూమ్ దగ్గర పారిజాతం ఉంటే శివ నారాయణ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఏదోటి మ్యానేజ్ చేస్తుంది పారు. సుమిత్ర, జ్యోత్స్న పక్క పక్కనే పడుకుని ఆపరేషన్‌కు పడుకుంటారు. డాక్టర్స్ అంతా రెడీ చేస్తారు. జ్యోత్స్నను అటు తిరగమని, ఇంజక్షన్ వేయాలని చెబుతుంది డాక్టర్ హారిక. ఇంజక్షన్ వేయడంతో మత్తుతో స్పృహ కోల్పోతుంది జ్యోత్స్న.
దీపకు ఎవరో బలమైన శత్రువులు ఉన్నారని, దీపపై జరిగిన అటాక్స్, శౌర్య కిడ్నాప్ గురించి చెబుతుంది కాంచన. వాళ్లు ఎవరైనా కార్తీక్ వదిలిపెట్టడు. దీపకు బిడ్డ వల్ల సమస్య అన్నారుగా. ఆ ఆపరేషన్ కూడా ఇవాలే అని శ్రీధర్ అంటాడు. ఏం జరిగినా కూడా తట్టుకోడానికి సిద్ధంగా ఉండాలని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతాడు శ్రీధర్ .
మరోవైపు కార్తీక్ వచ్చి మా ఆవిడకు కాపాల కాస్తున్నావా అని పారిజాతంను అంటాడు. నేను వెళ్లిన పని పూర్తి చేశాను. అదంతా తర్వాత క్లియర్‌గా చెబుతాను. నీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయింది అని వెళ్లిపోతాడు. దీపకు శౌర్య ఇంట్లో సేఫ్‌గా ఉంది. కిడ్నాప్ చేయించింది జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. దాంతో దీప కోప్పడుతుంది. ముందు అత్తయ్య ఆపరేషన్ జరగాలి. ఎవరిని వదిలిపెట్టను అని కార్తీక్ అంటాడు.
కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. కార్తీక్, శౌర్యలను కాపాడుకుంటాడా? జ్యోత్స్న ప్లాన్స్ ఏమవుతాయి? మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి!


