
📌 Key Points
- హాస్పిటల్‌లో దీప: తల్లిని కాపాడలేమని డాక్టర్ హారిక హెచ్చరిక!
- దశరథ్‌ను నిజం చెప్పమని జ్యోత్స్న ప్రయత్నం, శివ నారాయణ అడ్డుకున్నాడు!
- కాశీ, స్వప్నల మధ్య చిగురించిన ప్రేమ: రొమాంటిక్ సీన్స్!
- సుమిత్ర చివరి మాటలు: కుటుంబంలో విషాదం, ఉత్కంఠ!
కార్తీక దీపం 2 సీరియల్ మరో సంచలనంతో మీ ముందుకు వచ్చింది! కాశీ, స్వప్నల రొమాన్స్ లీక్ కావడంతో కథనం ఊహించని మలుపు తిరిగింది. జ్యోత్స్న కుట్రలు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. మిస్ అవ్వకండి!
కాశీ, స్వప్నల రొమాంటిక్ సీన్స్ వైరల్!
Karthika Deepam 2 Serial March 7th Episode: కార్తీక దీపం 2 సీరియల్ మార్చి 7వ ఎపిసోడ్‌లో దీపను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లిని కూడా కాపాడలేమని డాక్టర్ హారిక అంటుంది. ఇంటికెళ్లిన దశరథ్‌ను నిజం చెప్పించడానికి జ్యోత్స్న రెచ్చగొడుతుంది. శివ నారాయణ వచ్చి అడ్డుకుంటాడు.
Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిజం తెలిసాకా అంతా అర్థం చేసుకుంటారు. అందుకోసం నేను ఎన్ని బాధలు పడిన సరే మావయ్య అని కార్తీక్ అంటాడు. దాంతో కార్తీక్‌ను హగ్ చేసుకుంటాడు దశరథ్ . తర్వాత దీపను, కార్తీక్ ఇద్దరిని దశరథ్ ప్రేమగా హత్తుకుంటారు.
అనవసరమైన ఆశలు పెట్టుకున్న కాబట్టి ఇది నా కర్మ అనుకోవాలి. నా కలలోకి వచ్చిన మా అమ్మ నా కళ్లముందుకు వస్తాననుకున్నా. కోడలు మరోకసారి మా అమ్మను చంపేలా ఉంది. నా సంగతి వదిలేయండి. కనీసం భర్త గురించి అయినా ఆలోచించాలిగా. ఇదంతా స్వయంకృత అపరాధం అని కోపంగా మాట్లాడుతుంది కాంచన. దేవుడి దయ వల్ల అందరికి మంచే జరుగుతుంది అని శివ నారాయణ ఓదారుస్తాడు.
నేను కోరుకునేది ఒక్కటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కాంచన అంటుంది. మరోవైపు స్టూల్ ఎక్కి బూజు దులుపుతుంది కావేరి. స్వప్న వచ్చి అడుగుతుంది. తల్లిని దించి తాను దులుపుతానంటుంది. స్టూల్ ఎక్కి స్వప్న బూజు దులుపుతుంది. అప్పుడే కాశీ ఇంట్లోకి వస్తాడు. స్టూల్ మీద నుంచి స్వప్న కింద పడబోతుంటే కాశీ వచ్చి పట్టుకుంటాడు.
దశరథ్‌ను రెచ్చగొట్టిన జ్యోత్స్న ప్లాన్స్!
తల్లిని లేపేందుకు హెల్ప్ అడిగితే మిరపకాయలు కోశాను, కారంగా ఉంటుందని వెళ్లిపోతుంది. కాశీ అడిగితే వద్దని తానే లేస్తుంది స్వప్న. అసలు ఇంట్లోకి ఎందుకు వచ్చావని కాశీ అంటే.. కూరగాయలు తెచ్చానని చూపిస్తాడు. ఇద్దరు ప్రేమ గురించి, పూల గురించి వాదించుకుంటారు. నిన్ను నీకే కొత్తగా పరిచయం చేస్తాను అని కాశీ అంటాడు. ఆ మాటలకు ఆలోచనలో పడిపోతుంది స్వప్న.
మరోవైపు దీపను డాక్టర్ హారిక చెక్ చేస్తుంది. బీపీ నార్మల్‌గా ఉంది. ఇలాగే ఉండండి. ఆపరేషన్ అయ్యేవరకు హాస్పిటల్‌లోనే ఉండాలని డాక్టర్ హారిక చెబుతుంది. తర్వాత దశరథ్‌తో సుమిత్రను ఎప్పుడు హాస్పిటల్‌లో జాయిన్ చేయాలని తాను చెబుతానని, జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండమని, ఇవాళ తనను కలిసింది చెబుతుంది హారిక . కడుపుతో ఉన్న వాళ్లు బోన్ మ్యారో ఇవ్వొచ్చా అని అడిగిందని, నేను సరిగ్గా ఆన్సర్ ఇవ్వలేదని, ఏదైనా తను సమస్య చేస్తే నేను కవర్ చేయలేనని హారిక అంటుంది.
పాజిబులిటీ ఉంటే నేను చేయనా. మీరు మాత్రం ఎలాంటి హోప్స్ పెట్టుకోకండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతుంది. ఇక నేను మీ అమ్మకు నా మొహం చూపించలేనురా అని దశరథ్ బాధపడుతాడు. ఇంటికెళ్లి క్యారేజ్ తీసుకొస్తానని దీపతో అంటాడు కార్తీక్. దీపను హాస్పిటల్‌లో ఉంచేసి కార్తీక్, దశరథ్ వెళ్లిపోతారు. జరిగిన విషయాలన్నింటి గురించి ఆలోచిస్తుంది జ్యోత్స్న.
డాడీని రెచ్చగొట్టి తనకేం తెలుసో నిజం రాబట్టాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంతలో దశరథ్ వస్తాడు. ఎక్కడికి వెళ్లావ్ అని జ్యోత్స్న అడిగితే.. దీపను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడానికి అని దశరథ్ అంటాడు. ఆ పని మనిషి కోసం నువ్వెళ్లాల్సిన అవసరం ఏంటీ అని జ్యోత్స్న అంటుంది. శివ నారాయణ, సుమిత్ర, పారిజాతం వస్తారు.
సుమిత్ర చివరి మాటలు: కథలో కీలక మలుపు!
జ్యోత్స్న అడిగిన విధానం కరెక్టే కానీ తప్పు కాదు అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్నను సమర్థిస్తున్నావా అని దశరథ్ అంటే.. నేను ఎవరిని సమర్ధించట్లేదు. దీప సంగతి కార్తీక్ చూసుకుంటాడు. నువ్వు వెళ్లింది దీప కడుపులో బిడ్డకు సమస్య ఉన్నందుకు అని శివ నారాయణ అంటాడు. ఏంటీ మావయ్య దీప బిడ్డకు సమస్య అని సుమిత్ర అడుగుతుంది.
లేదు. కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్‌లో జాయిన్ చేశామని దశరథ్ అబద్ధం చెబుతాడు. అవును, అని శివ నారాయణ కవర్ చేస్తాడు. నాన్నతో బిజినెస్ గురించి మాట్లాడాలి, నువ్వు లోపలికి వెళ్లు సుమిత్ర అని దశరథ్ అంటాడు. దీప నా గురించి కంగారు పడుతుంటుంది. నాకేం కాదని చెప్పండి. దీప పిల్లలతో కూడా నేను ఆడుకుంటానని చెప్పండి అని సుమిత్ర అంటుంది.
నువ్వన్నదే చెప్పారని దశరథ్ అంటాడు. దశరథ్ మాట మారుస్తున్నాడని పారిజాతం డౌట్ పడుతుంది. ఏం కానప్పుడు అమ్మకు ఎందుకు చెప్పొద్దని జ్యోత్స్న అంటుంది. కొన్ని ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. కరెక్ట్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నా అని దశరథ్ అంటాడు. సుమిత్రను ఎప్పుడు హాస్పిటల్‌లో ఎప్పుడు జాయిన్ చేయాలో ఫోన్ చేసి చెబుతానన్నరని దశరథ్ అంటాడు.
టైమ్ దగ్గరపడింది అని జ్యోత్స్నను ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు దశరథ్. దేనికి అని జ్యో అంటే.. ఆపరేషన్‌కు అని కవర్ చేస్తాడు. దాంతో జ్యో షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో ముగిసింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఈ సీరియల్ మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుంది!
