
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో దీప మరియు కార్తీక్ పెళ్లి తర్వాత ఇంట్లో నెలకొన్న శుభవార్తతో పాటు, పారిజాతం హడావిడి, జ్యోత్స్న యొక్క రహస్యాలు, శ్రీధర్‌తో కార్తీక్ మధ్య ఎమోషనల్ డ్రామా చూడవచ్చు.
Key Points
దీప, కార్తీక్ పెళ్లితో ఇంటికి పట్టిన అరిష్టం తొలగింది.
పారిజాతం సత్యనారాయణ వ్రతం ఏర్పాటుకు హడావిడి చేస్తుంది.
కార్తీక్ శ్రీధర్‌తో ఫోన్లో మాట్లాడి అతన్ని ఏడిపించాడు.
జ్యోత్స్న సుమిత్రను తప్పించుకుంటుంది, దశరథ్ ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తాడు.
దీప మరియు కార్తీక్ పెళ్లి తర్వాత పరిణామాలు
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ పెళ్లి జరగడంతో ఇంటికి పట్టిన అరిష్టం పోయినట్లేగా అని దశరథ్ అంటే.. అవును, దేవుడి దయవల్ల అరిష్టం త్వరగా పోయింది అని శివ నారాయణ అంటాడు. జ్యోత్స్న చెడు పని చేస్తే తిడతారు మంచి పని చేస్తే దేవుడు అంటారు అని పారు అంటుంది.
జ్యోత్స్న చేసిన మంచి పని ఏంటో అని శివ నారాయణ అంటే.. దీప మెడలో తాళి తెంపడం. కార్తీక్ గాడు పెళ్లి ఇక్కడ చేయమనడం. దాంతో అరిష్టం పోవడం. జ్యోత్స్న జీవితానికి మంచి జరగడానికి దేవుడే దీప మెడలో తాళి తెంపించాడు. ఓ అనాథకు వీళ్ల చేతుల మీదుగా పెళ్లి జరిపించే అవకాశం వచ్చిందని పారిజాతం అంటుంది. రేపు సత్యనారాయణ వ్రతం కూడా మనం జరిపిస్తే పూర్తి బాధ్యత నెరవేరినట్లే అని పారు అంటుంది.
శివ నారాయణ మెచ్చుకుని అన్ని మంచి మాటలు వస్తున్నాయి. సరే అంటాడు శివ నారాయణ. జ్యోత్స్న వస్తానంటుంది. సుమిత్రను అడిగితే సైలెంట్‌గా ఉంటుంది. మళ్లీ అడిగితే పెళ్లి పనుల వల్ల అలసిపోయాను. పడుకుంటాను అని తప్పించుకుంటుంది సుమిత్ర. పిన్ని మంచితనం వెనుక ఏదైనా చెడు కుట్ర ఉందా అని దశరథ్ అనుమానిస్తాడు.
శ్రీధర్‌కు కార్తీక్ కాల్ చేసి ఇంట్లో లేకపోవడం గురించి మాట్లాడుతాడు. కారు, యాక్సిడెంట్, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్పి శ్రీధర్ చేసిన తప్పు గురించి చెబుతాడు కార్తీక్. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. తెలిసో, తెలియకో, బలహీనమో అనుకో.. తప్పు చేశాను. దాన్ని మార్చలేను. కొడుకుగా నీ మీద ప్రేమ వేరు అని శ్రీధర్ అంటాడు.
పారిజాతం యొక్క హడావిడి మరియు సత్యనారాయణ వ్రతం
నువ్ మారగలవా. నువ్ మారలేవు. నేను మారలేను. నేను చేసేది నీకు నచ్చదు. నువ్ చేసేది నీకు నచ్చదు అని శ్రీధర్ అంటాడు. టాపిక్ ఎటో వెళ్లిపోతుంది. నేను కాల్ చేసింది రేపు సత్యనారాయణ వ్రతం ఉంది. వస్తావా అని కార్తీక్ అడిగితే వస్తాను అని శ్రీధర్ చెబుతాడు. భోజనం చేశావా అని కార్తీక్ అడిగితే.. శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతాడు.
చేశాను అని శ్రీధర్ అంటాడు. ఎక్కువగా తాగకు ఆరోగ్యం పాడవుతుంది. గుడ్ నైట్ అని కాల్ పెట్టేస్తాడు కార్తీక్. మరుసటి రోజు ఉదయం సత్య నారాయణ వ్రతం ఏర్పాటు చేస్తారు. పారిజాతం, జ్యోత్స్న వస్తారు. ఇంత ఉదయమే మేము వచ్చామని బిక్కమొహం పెట్టకండి అని పారు అంటుంది. వచ్చి సత్య నారాయణ వ్రతం గురించి హడావిడి చేస్తుంది పారిజాతం.
అంతా బానే ఉందా అని కార్తీక్ అంటాడు. అంతా బాగుందని, దీప ఇంకా అలా ఉన్నావ్. తలస్నానం ఎప్పుడు చేయాలి, సాంబ్రాణి వేసుకోవాలి అని పారు అంటుంది. గ్రానీ ఏంటీ ఇంత ఓవరాక్షన్ చేస్తుందని జ్యో అనుకుంటుంది. అబ్బా ఒక్క సందడి లేదు అని పారిజాతం అంటే.. ఇప్పుడు చూడు అని నకిలేసు గొలుసు పాటకు శౌర్య డ్యాన్స్ చేస్తుంది.
శౌర్యతోపాటు పారిజాతం, జ్యోత్స్న కూడా జత కలసి ముగ్గురు డ్యాన్స్ చేస్తారు. పారిజాతం అలసిపోతుంది. వెళ్లి జ్యూస్ తాగాలి అని దీపను మెచ్చుకుంటూ వెళ్తుంది పారిజాతం. ఏంటీ అత్తా అలా చూస్తున్నావ్. నేను మీ మనిషిని, మనది రక్తబంధం. నన్ను అలాగే చూడు. తప్పు చేసినదానిలా కాదు అని లోపలికి వెళ్తుంది జ్యోత్స్న. వీళ్లు అంత తేలిగ్గా మారే మనుషులు కాదు. పారు నవ్వుతూ ఉందంటే ఏం చేస్తుందో అని భయంగా ఉందని భయపడుతుంది కాంచన.
శ్రీధర్ మరియు కార్తీక్ మధ్య ఎమోషనల్ సంభాషణ
బావ ఇక్కడే ఉన్నాడుగా ఊరుకోడని వాళ్లకు తెలుసు. ధైర్యంగా ఉండండి అని దీప అంటుంది. మరోవైపు సత్య నారాయణ వ్రతానికి సుమిత్ర రానంటుంది. పెళ్లి అయిపోయింది. నా బాధ్యత తీరిపోయింది. ఇక నేను ఎక్కడికి రాలేను అని సుమిత్ర అంటుంది. బాధ్యత నేను అక్కడి వరకు ఉందని అనుకున్నాను. ఏది మధ్యలో ఆపకూడదు. ముగ్గురం గడప దాటకూడదు. నేను కారులో వెయిట్ చేస్తుంటాను అని శివ నారాయణ వెళ్లిపోతాడు.
నేను రాలేనండి అని సుమిత్ర దశరథ్‌కు చెబుతుంది. ఇదే నీ ఆఖరి మాట అని దశరథ్ అంటాడు. అలా చెప్పలేను. కానీ, నేను ఏ అనాథకు మాతృ వాత్సల్యం అందించలేను అని సుమిత్ర అంటుంది. నీ అంతరంగం అర్థమైంది. కానీ, నేను నాన్న మాట జవదాటని వాన్ని. నువ్ సహనమూర్తి సీతాదేవిలా ఉండాలని నేను అనట్లేదు. కానీ, నీకోసం ఐదు నిమిషాలు కారులో ఎదురుచూస్తుంటాను. తర్వాత నీ ఇష్టం అని దశరథ్ వెళ్లిపోతాడు.
దీప మెడలో తాళి చూసి జ్యోత్స్న రగిలిపోతుంది. తన భార్య తాళి అని శివ నారాయణ ఇచ్చింది గుర్తు చేసుకుంటుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్‌లో దీప, కార్తీక్ జీవితంలో కొత్త మలుపులు, పారిజాతం యొక్క సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు, శ్రీధర్‌తో కార్తీక్ ఎమోషనల్ డిస్కషన్ చూడటానికి ఆసక్తికరంగా ఉంటుంది. రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూద్దాం.


