|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న చేయి నలిపేసిన గౌతమ్.. కాంచన ఇంటికి వెళ్లిన సుమిత్ర.. కాఫీ ఇవ్వని దీప

Published: 13-07-2025, 9:53 PM

కార్తీక దీపం 2 సీరియల్ లోని నేటి ఎపిసోడ్ లో, జ్యోత్స్న, గౌతమ్, సుమిత్ర, దీప, కార్తీక్ ల మధ్య వివిధ సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ ఎపిసోడ్ లో వారి మధ్య సంభాషణలు, గొడవలు ఎలా ఉంటాయో చూద్దాం.

గౌతమ్ మరియు జ్యోత్స్న మధ్య ఘర్షణ

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో శివన్నారాయణ ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుంటూ కార్తీక్, దీప స్కూటీపై వెళ్తారు. మధ్యలో మొక్కజొన్న పొత్తుతో కార్తీక్ ను కూల్ చేయాలని చూస్తుంది దీప. అత్త చీర తీసుకుని అమ్మకు ఇవ్వమంటే ఇవ్వొచ్చుగా అని దీప మీద కాస్త కోపం చూపిస్తాడు కార్తీక్. నీ మీద కోపాన్ని మా అమ్మ మీద అత్తయ్య ఎందుకు చూపించాలి? ఇక శివన్నారాయణకు ఈగో అని కార్తీక్ అంటాడు. అయిపోయింది వదిలేయ్ అని దీప చెప్తుంది.

కార్తీక్ ను కూల్ చేస్తుంది దీప. నువ్వు అందగాడివి బావ అని అంటుంది వంటలక్క. మరోవైపు దీప జడలో కార్తీక్ రోజా పెట్టడం గుర్తు చేసుకుంటూ జ్యోత్స్న మండిపోతుంది. అప్పుడే గౌతమ్ తన గదిలోకి రావడంతో జ్యో షాక్ అవుతుంది. ప్రైవేటుగా మాట్లాడదామని వచ్చా అని చెప్పి జ్యో చేయి పట్టుకుంటాడు గౌతమ్ . కంగారు పడ్డ జ్యో.. పారిజాతాన్ని రమ్మని మెసేజ్ చేస్తుంది. నీ కోసం నేను దీపను కూడా చంపాలనుకున్నా. కానీ బతికేసింది. మన పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చంపే వీలు లేదు అని గౌతమ్ అంటాడు.

పారుకు కాల్ చేస్తుంది జ్యోత్స్న. వెంటనే వెళ్లాలని పారు అనుకుంటే, శివన్నారాయణ అడ్డుకుంటాడు. ఇటు జ్యో చేయిని నలిపేస్తూ రింగ్స్ నచ్చాయా? అని గౌతమ్ అడుగుతాడు. సరదాగా అలా బయటకు వెళ్దామా అంటాడు. అప్పుడే కాఫీ పట్టుకుని పారు ఎంట్రీ ఇస్తుంది. వెరైటీ వంటకాలు చేస్తున్నానని పారు చెప్పడంతో గౌతమ్ వెళ్లిపోతాడు. ఎంగేజ్మెంట్ చెడగొట్టే ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్దాం. కాశీ ఎంత వరకు వివరాలు తీసుకున్నాడో చూద్దాం అని జ్యో అంటుంది.

సుమిత్ర మరియు కాంచన మధ్య సంభాషణ

కాంచన దగ్గరకు దశరథ్, సుమిత్ర వెళ్తారు. అన్నయ్య వదిన నాతో మాట్లాడింది అంటూ కాంచన సంతోషంలో తేలిపోతుంది. ఎవరి వల్లో మన మధ్య గొడవలు వచ్చాయి కానీ మనం ఎప్పుడూ పౌరుషంగా మాట్లాడుకోలేదు అని సుమిత్ర అంటుంది. ఎవరో ఏదో అంటే ఇంటి పడుచును దూరం పెడతారా అని అనసూయ అడుగుతుంది. అందుకు కారణం నీ మేనకోడలే. లేదంటే కాంచన నేను తోబుట్టువుల్లా ఉండేవాళ్లం అని సుమిత్ర అంటుంది.

మరి ఇప్పుడెందుకు వచ్చావు అత్తా అని కార్తీక్ అంటే.. కాంచన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మధ్యలో దశరథ్ మనం వచ్చిన పని ఏంటీ అని గుర్తు చేస్తాడు. నేను కొందరికీ పరాయి దాన్నే అన్నయ్య అని కాంచన అంటే.. నన్నే కదా ఈ మాట అన్నావని సుమిత్ర బాధ పడుతుంది. నీ మనసు గాయపడేలా నేనెప్పుడైనా మాట్లాడానా? నువ్వు నేను వేరు అని నేనెప్పుడూ అనుకోలేదు. తప్పు చేశానంటే కొట్టు వదిన అని కాంచన చేతులతో చెంపలపై కొట్టుకుంటూ ఏడుస్తుంది సుమిత్ర.

ఆ సీన్ చూసి దీప, కార్తీక్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. సుమిత్ర చేతితో టాబ్లెట్ ఇస్తే కాంచన వద్దంటుంది. టాబ్లెట్స్ వాడకపోతే నేనేమైనా చచ్చిపోతా అనుకున్నావా? నా గుండెకు తట్టుకుని నిలబడే శక్తి ఉందన్నయ్యా. నా తండ్రి నన్నొక డ్రైవర్ తల్లిలా చూసి వెళ్లిపోయాడంటే ఆ రోజే చచ్చిపోవాలి. నా మేనకోడలి పెళ్లి చేయాల్సిందాన్ని. ప్రేమగా పిలవడానికి వచ్చారు ఇది చాలు అన్నయ్య. ఆడదానికి కష్టం వస్తే చెప్పుకునేది అమ్మనాన్న తర్వాత అన్నయ్యకి అని కాంచన బాధపడుతుంది.

కార్తీక్ మరియు దీప మధ్య విభేదాలు

వదిన మన మధ్య జరిగింది మర్చిపో. మనలో మనం సర్దుకుపోవాలి. కలిసిపోవాలి. నిశ్చితార్థానికి రా. మామయ్యతో మాట్లాడి చూస్తాం అని సుమిత్ర అంటుంది. నేనూ ఆ తండ్రికే పుట్టా. కానీ నాన్నకు నీ మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదు. మనం మాటలు ఇచ్చుకున్నంత తేలికగా పిల్లలు మనసులు ఇచ్చుకోలేరు కదా అని కాంచన అంటుంది. అనసూయ కాఫీ తీసుకొస్తే దీపను పిలుస్తుంది కాంచన. దీప రాదు, ఆమె కాఫీ ఇస్తే మీ వదిన తీసుకోదని అనసూయ అంటుంది.

అయినా దీప అని పిలుస్తుంది కాంచన. కాఫీ గ్లాసులు తీసుకో, మా అన్నయ్య వదినకు ఇవ్వు. కాఫీ ఎందుకు తీసుకోవడం లేదు అని సుమిత్రను అడుగుతుంది కాంచన. దీప నా ఇంటి యజమాని. నా ఇంటి కోడలు. దీప నువ్వు అమ్మగారు అని పిలుస్తావేంటీ? వరుసకు చిన్నమ్మ అవుతుంది అని కాంచన అంటుంది. కానీ ఈ మనిషి కోసం ఒక్క మెట్టు కూడా దిగను. నా తరపు నుంచి ఆహ్వానం కూడా లేదు. ఆమె వస్తే నిశ్చితార్థం జరగదేమో అనే భయం కూడా ఉంది అని సుమిత్ర చెప్తుంది.

ఓ వైపు చెల్లి, మరోవైపు భార్య. ఎవరినీ నిందించలేను. ఎవరినీ సమర్థించలేను. నా తండ్రి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకు రాకండి. నా కూతురు నిశ్చితార్థానికి రావాలి కాంచన అని దశరథ్ అంటాడు. కాంచనకు బొట్టు, చీర పెట్టి ఆహ్వానిస్తుంది సుమిత్ర. నువ్వు ఈ పట్టుచీర కట్టుకునే రావాలి అని సుమిత్ర అంటుంది. దీప నా ఇంటి కోడలిగా మా వదినకు కుంకమ పెట్టు అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవలు, అపార్థాలు, కలహాలు చూపించారు. కథలో తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తిగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.