
కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్‌లో దీప తన తండ్రిని గుర్తుంచుకుని ఏడుస్తుంది. సుమిత్ర దీపపై ప్రేమ నటిస్తుంది. శ్రీధర్ యొక్క నిజస్వరూపం శౌర్య ద్వారా బయటపడుతుంది. కథనం ఆసక్తికరంగా సాగుతుంది.
Key Points
దీప దశరథ్‌ను నాన్న అంటూ పట్టుకుని ఏడుస్తుంది.
సుమిత్ర దీపపై ప్రేమ నటించి దశరథ్‌ను మోసం చేస్తుంది.
శ్రీధర్ దీపను తన కొడుకు జీవితం నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తాడు.
దీప యొక్క భావోద్వేగ ప్రయాణం
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దీపను పూలతో అలంకరించు మమ్మీ అని సుమిత్రకు జ్యోత్స్న పూలు ఇస్తుంది. కానీ, ఆ మల్లెపూలను నేలపై విసిరికొడుతుంది సుమిత్ర. మనిషికి చావు ఎలా ఉంటుందో తెలియదు. కానీ నా చావు ఇలా ఉంటుంది. నేను ఎవరికో ఏదో తప్పు చేశాను. అందుకే దీని కన్నతల్లి నా చావును కంది అని సుమిత్ర అంటుంది.
నా కన్నతల్లిని అనొద్దు అని దీప అంటే నీ కన్నతల్లి ఎవరో నీకు తెలుసా అని జ్యో అంటే.. తెలియదని దీప అంటుంది. ఏ తల్లి ఏ బిడ్డను ఇంకొకరు చావును కనదు అని దీప అంటుంది. కానీ, నీ తల్లి మాత్రం నాకు మనశ్సాంతి లేకుండే చేసుందుకే కనింది అని సుమిత్ర అంటుంది. మీ కాళ్లు పట్టుకుంటాను. నా తల్లిని ఏమనొద్దు అని దీప అంటుంది.
ఇంతలో దశరథ్ సుమిత్ర అనుకుంటూ వస్తాడు. అది విని కిందపడేసిన మల్లెపూలు తీసుకుని ప్రేమగా నటిస్తూ దీపకు పెడుతుంది సుమిత్ర. కడుపులో విషం పెట్టుకుని దశరథ్ రాగానే పైకి ప్రేమ ఒలకబోస్తుంది సుమిత్ర. మన కూతురిని పెళ్లి కూతుర్ని చేయడం అయింది. ముందుగానే దిష్టి తీసేయ్ అని దశరథ్ అంటాడు. దీప మాత్రం ఏడుస్తూ ఉంటుంది.
ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఏడుస్తావేంటీ అని కన్నీళ్లు తుడుస్తాడు దశరథ్. దీప ఉండబట్టలేక నాన్న అని దశరథ్‌ను పట్టుకుని ఏడుస్తుంది. ఏమ్మా నాన్న గుర్తొచ్చాడా అని దశరథ్ ఓదార్చుతాడు. అవును నాన్న అని దీప అంటుంది. మీ నాన్న కచ్చితంగా వచ్చి ఈ పెళ్లి చూస్తాడు అని దశరథ్ అంటాడు. తర్వాత జ్యో, పారు వెళ్లిపోతారు. మీ అమ్మ వచ్చి ముహుర్తానికి నిన్ను తీసుకొస్తుందని దశరథ్ వెళ్లిపోతాడు.
సుమిత్ర యొక్క కుట్రలు
పిలవమన్నారుగా అని అమ్మనాన్న అని పిలవకు అని దీపకు చెప్పి వెళ్లిపోతుంది సుమిత్ర. మరోవైపు కార్తీక్ చాలా బాగున్నాడని కాంచన, అనసూయ, శౌర్య మెచ్చుకుంటారు. ఇంతలో శ్రీధర్ వస్తే ఎవరిని ఏం అనకండి అని కాంచన అంటుంది. నేను అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను అని శ్రీధర్ అంటాడు. అవును, తాత అందరితో ఎలా మాట్లాడుతున్నాడో నేను చూశాను అని శ్రీధర్ మాట్లాడింది అంతా చెబుతుంది.
అలా శ్రీధర్ బండారం బయటపెడుతుంది శౌర్య. తాతయ్య తలుచుకుంటే పెళ్లి జరగదా అని శౌర్య అంటుంది. దాంతో శౌర్యను తీసుకెళ్లమని అనసూయకు చెబుతుంది కాంచన. తర్వాత శ్రీధర్‌ను కాంచన మందలిస్తుంది. అది ఆపిన కార్తీక్ మీలో మంచితనం ఉంది. అదే మంచినతంతో ఉండండి అని అంటాడు. నా కొడుకు కోసం పెళ్లికి వచ్చాను. కానీ, నీకు మంచి జరగాలంటే దీప నీ జీవితంలో ఉండకూడదురా అని శ్రీధర్ అనుకుంటాడు.
సారీరా కార్తీక్ నేను వచ్చింది నీ పెళ్లి ఆపడానికే అని మనసులో అనుకుంటాడు శ్రీధర్ . కార్తీక్ అన్నదానికి సరేరా అని వెళ్లిపోతాడు శ్రీధర్. ఈయన వచ్చాడని సంతోషిస్తే ఇలా చేస్తున్నాడేంట్రా అని కాంచన అంటుంది. నాన్నను ఏమనకు అమ్మ. మనకోసం వచ్చాడు. మనమే గౌరవం ఇద్దామని కార్తీక్ అంటాడు. వీడేంటీ నాకన్న ఎక్కువ కోప్పడేవాడు. ఇప్పుడు ఇలా అంటున్నాడు. మేము కాకపోయినా వీళ్లిద్దరు కలిసి ఉండాలి అని కాంచన అనుకుంటుంది.
శ్రీధర్ మరియు శౌర్య మధ్య ఘర్షణ
పెళ్లికూతురు, పెళ్లికొడుకుని తీసుకురమ్మని పంతులు చెబుతాడు. దీప దగ్గరికి పారు, సుమిత్ర, జ్యోత్స్న వెళ్తారు. అక్కడ శౌర్య, అనసూయ ఉంటారు. దీపకు బాసింగం కట్టలేదని అంటే సుమిత్ర కోపంగా కడుతుంది. పెళ్లికి ముందు తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలని కాంచన చెబుతుంది. దీప ఆశీర్వాదం తీసుకుంటే సుమిత్ర చీదరించుకుంటుంది.
దీప కన్నీళ్లు సుమిత్ర పాదాలపై పడతాయి. మా అమ్మను ఆశీర్వదించమని శౌర్య అంటే.. సుమిత్ర ఆశీర్వదిస్తుంది. దీప చేయి పట్టుకుని తీసుకెళ్లండి అని అనసూయ అంటే అలాగే చేస్తుంది సుమిత్ర. పెళ్లిపీటలపై కార్తీక్, దీప కూర్చొంటారు. పారు, జ్యోత్స్న, శ్రీధర్ పక్కకు వెళ్లిపోతారు. పెళ్లి ఆపేందుకు ప్లాన్‌తో రెడీగా ఉన్నానని శ్రీధర్ చెబుతాడు. అది తాళి లేకుండా చేయడమే అని శ్రీధర్ అంటాడు.
క్రీస్తూ పూర్వం ఐడియా ఇదని పారు అంటుంది. పారు చెప్పింది కూడా నచ్చదు. శౌర్య ను కిడ్నాప్ చేస్తున్నాను. కూతురు కనపడలేదని మండపం వదిలేసి వెతుకుతారు. అంతలో ముహుర్తం అయిపోయిందని పెళ్లి ఆగిపోతుంది అని జ్యోత్స్న చెబుతుంది. ఐడియా అదిరిపోయింది. ఏరోజుకైనా నా కోడలివి నువ్వే అని శ్రీధర్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్‌లో దీప, శ్రీధర్ మరియు శౌర్యల మధ్య సంఘర్షణ మరింత తీవ్రమవుతుంది. సుమిత్ర కుట్రలు ఎంతవరకు విజయవంతం అవుతాయో తెలియాల్సి ఉంది.


