|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: షాకింగ్.. దీప తాళి తెంచిన జ్యోత్స్న.. లాగిపెట్టి కొట్టిన సుమిత్ర.. వంటలక్కకు రాణియోగం

Published: 05-08-2025, 9:40 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: షాకింగ్.. దీప తాళి తెంచిన జ్యోత్స్న.. లాగిపెట్టి కొట్టిన సుమిత్ర.. వంటలక్కకు రాణియోగం

కార్తీక దీపం 2 సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ అనూహ్య మలుపులతో సాగుతుంది. దీపకు రాణియోగం ఉందని గురువు చెప్పడం, జ్యోత్స్న దీప తాళి తెంచడానికి ప్రయత్నించడం, సుమిత్ర దీపను కొట్టడం వంటి సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

Key Points

1

దీపకు రాణి యోగం ఉందని గురువు భవిష్యత్తు చెబుతాడు.

2

జ్యోత్స్న దీప తాళి తెంచే ప్రయత్నం చేస్తుంది.

4

కార్తీక దీపం 2 లో ఆసక్తికరమైన ట్విస్టులు, షాకింగ్ సంఘటనలు.

జాతకం ప్రకారం దీప పెళ్లి

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఇచ్చిన జాతకం ప్రకారం ఇప్పటికే పెళ్లి అయిపోయి ఉండాలని గురువు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు చేయి చూసి జాతకం చెప్పమని అడుగుతారు. మీరు ఇచ్చిన జాతకం, చేయి చూస్తే ఎక్కడ పొంతన కుదరడం లేదు. చేయి మారిందని అనడంతో జ్యోత్స్న, పారిజాతం కంగారు పడతారు. తను నా మనవరాలు. ఏ శుభ కార్యం చేయలన్నా జరగడం లేదని శివన్నారాయణ అంటాడు.

జాతకం ఈ అమ్మాయిదేనా? లేదా మీకు మరో మనవరాలు ఉందా? అని గురువు మళ్లీ అడుగుతాడు. ఆ జాతకం మా కూతురిదేనని సుమిత్ర స్పష్టంగా చెప్తుంది. మీరు ఇచ్చిన జాతకంలో ఇప్పుడు ఆ కల్యాణ గీత లేదమ్మా అని గురువు అంటాడు. అప్పుడే జ్యూస్ తాగండని దీప అడుగుతుంది. ఓ సారి నీ చేయి చూపించమని అడుగుతాడు గురువు. మహర్జాతకం, రాణి యోగం. ముందున్నవన్నీ మంచి రోజులేనమ్మా. పెంచిన నాన్నకు దూరమైనా కన్నతండ్రికి దూరం కాలేదు. అనాథ కాదు. అయినవాళ్లకు చేరువలోనే ఉంది. తొందర్లోనే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. నువ్వు నీ వాళ్లను చేరతావని గురువు దీపను ఉద్దేశించి అనడంతో జ్యో షాక్ అవుతుంది.

ఉన్నది ఒక్కగానొక్క మనవరాలు. ఏ శుభ కార్యం జరగడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదని శివన్నారాయణ బాధ పడతాడు. తప్పు చేసిన వాళ్లదే కాదు చూసిన వాళ్లది కూడా. చేసిన పాపానికి వద్దన్నా ఫలితం వెతుక్కుంటూ వస్తుంది. మీకు అబ్బాయేనా ఇంకా ఎవరైనా ఉన్నారా? అని గురువు అడుగుతాడు. కూతురు కూడా ఉందని శివన్నారాయణ చెప్తాడు. ఆవిడ సౌభాగ్యంగా సంతోషంగా ఉందా? ఎందుకంటే ఈ ఇంటి రక్తం కన్నీరు పెడితే అది వినాశనమే. ఏ శుభ కార్యం జరగదు. జరగాలి అంటే అందరూ ఒక్కటై మీ ఇంటి రక్తానికి ఏదైనా మంచి జరిగేలా చేయండని చెప్పి గురువు వెళ్తూ మీ దంపతులిద్దరూ జాగ్రత్తగా ఉండండని దశరథ, సుమిత్రలను హెచ్చరిస్తాడు.

జ్యోత్స్న, సుమిత్ర ప్రవర్తన

డబ్బుల కోసం వీళ్లు ఏదేదో చెప్తుంటారని పారు అంటే శివన్నారాయణ కోప్పడతాడు. భూమ్మీద ఉన్న నీరంతా ఒకటేనంటా. కానీ పారే నేలను బట్టి రంగు, రుచి మారతాయంటా. అలాగే మనుషులంతా ఒక్కటేనంటా. వాళ్ల బుద్ధులను బట్టే వాళ్ల పనులు మారతాయంటా. బుద్ధి మంచిదవాలంటే చేతలు మారాలి. మారం ఇలాగే ఉంటామంటే దేవుడు ఊరుకుంటాడా ఏంటీ? గురువు జాతకం చూసి గుణం చెప్పారు. నేనైతే మాట చూసే చెప్పేయగలను అని దీపతో కార్తీక్ అంటుంటే జ్యోత్స్న బావా అని గట్టిగా అరుస్తుంది. నువ్వు డ్రైవర్ వి, సలహాలు ఇవ్వకూడదని జ్యో అంటే.. నా భార్యతో వంద మాట్లాడుకుంటానని కార్తీక్ చెప్తాడు. మాటలు మనసును గుచ్చుతున్నాయా? అని ప్రశ్నిస్తాడు.

అంటే నువ్వు నాకు గుచ్చుకోవాలనే మాట్లాడుతున్నావా అని జ్యోత్న్స అంటుంది. బావా కావాలని ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావని కార్తీక్ ను దీప అంటే.. ఆ మాట నువ్వు నన్ను అంటున్నట్లు ఉందని జ్యో అంటుంది. అప్పుడే కార్తీక్ ను శివన్నారాయణ పిలుస్తాడు.

వంట గదిలోకి వెళ్తున్న దీపను ఆగమంటుంది జ్యోత్స్న . గురువు ఏదో చెప్పాడని ఫీల్ అవకు. నీదేదో మహార్జాతకం అని, రాణియోగం వస్తుందనే సరికి భూమ్మీద నిలబడట్లేదు. ఈ ఇంటికి నువ్వే అరిష్టం. నువ్వు అడుగుపెట్టిన చోట ఏ శుభకార్యాలు జరగవని జ్యోత్స్న అంటుంది. నేను ఈ ఇంటి మనిషిని, అదే ఇంటి పని మనిషిని. ఈ ఇంటి వాళ్ల పనిమనిషిని. గురువు చెప్పిన మాటలు విని అమ్మానాన్న బాధపడుతున్నారు. సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మానాన్న సంబంధం చూస్తారు. తొందరగా పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారని జ్యోతో దీప అంటుంది. వరుస పెట్టి చూస్తే మీ బావ భార్యను, నీకు అక్కలాంటిదాన్ని అని దీప అనడంతో జ్యో షాక్ అవుతుంది.

దీపకు రాణియోగం

నీది పనిమనిషి స్థాయి. మా బావది మా స్థాయి. మా బావ నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి మాకే సలహాలిచ్చే స్థాయికి ఎదిగావు. ఇదంతా తాళిని చూసుకుని అని తాళి పట్టుకుంటుంది జ్యోత్స్న. ఇది నీకు లైసెన్స్ లాంటిది. ఇది ఉందనే గొప్పదానిలా ఫీల్ అవుతున్నావ్. ఇది నీ మెడలో లేకపోతే, నీకు గుర్తింపు లేదు. ఈ తాళి మెడలో ఉండకూడదని జ్యో అంటే.. నన్ను నాలా ఉండనివ్వు పాత దీపలా మార్చనివ్వకు అని దీప సీరియస్ అవుతుంది. నేను వదిలేస్తే ఆ తాళి నీ మెడలోకి వచ్చింది. బలవంతంగా లాక్కున్నావు. తెంచేయాలని జ్యోత్స్న ట్రై చేస్తుంది. అప్పుడు అందరూ వచ్చి వదలమన్నా జ్యో వినదు. తాళి తెంచేస్తుంది.

దీప కన్నీళ్లు పెట్టుకుంటూ కూలబడిపోతుంది. జ్యోత్న్స చేతిలో నుంచి జారిన తాళిని కార్తీక్ పట్టుకుంటాడు. కార్తీక్ కొట్టేలోపే సుమిత్ర జ్యోత్స్న చెంపపై గట్టిగా కొడుతుంది. దీంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్ లో జరిగిన సంఘటనలు కార్తీక దీపం 2 కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. దీప భవిష్యత్తు ఏమిటి? జ్యోత్స్న, సుమిత్రల ప్రవర్తన ఎలా ఉంటుంది? తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.