|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను క్షమించిన సుమిత్ర- జ్యోత్స్నను కొట్టిన పారిజాతం- పారు ఉగ్రరూపం, వణికిపోయిన జ్యో

Published: 22-09-2025, 12:34 AM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపను క్షమించిన సుమిత్ర- జ్యోత్స్నను కొట్టిన పారిజాతం- పారు ఉగ్రరూపం, వణికిపోయిన జ్యో

కార్తీక దీపం 2 సీరియల్‌లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. సుమిత్ర దీపను క్షమించడం, పారిజాతం జ్యోత్స్నను కొట్టడం వంటి సంఘటనలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.

సుమిత్ర క్షమాపణ

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శౌర్య బర్త్ డే ఫంక్షన్‌లో అందరిని కలిపే ప్రయత్నం చేస్తాడు కార్తీక్. ఇకనుంచి రెండు కుటుంబాలు కలిసి ఉండలేవా. నా భార్యను క్షమించలేవా అత్త అని సుమిత్రను అడుగుతాడు కార్తీక్. మీ మావయ్య నన్ను క్షమించలేదు అని సుమిత్ర అంటుంది.

నిన్ను క్షమించాల్సింది నేను కాదు నా చెల్లి అని దశరథ్ అంటాడు. బాధపడింది దీప అని కాంచన అంటే.. ఇప్పుడు దీప నన్ను క్షమించాలా అని సుమిత్ర అంటుంది. ఆ మాట నేను అనలేదు అని కాంచన అంటుంది. క్షమిస్తానని కూడా అనలేదని సుమిత్ర అంటే నువ్ నా కోడలిని క్షమిస్తా అనలేదని కాంచన అంటుంది. నాకంటే నీకు నీ కోడలే ఎక్కువ ఇష్టమని తెలుసు వదినా అని సుమిత్ర అంటుంది.

అత్త ప్లీజ్ మాటలతో సమస్యను పెంచొద్దు. ఇకనుంచి అంత ఓ కుటుంబంగా ఉందాం. అందరం కలిసుండే దారి చూడండి. ఇది సుమిత్ర అత్తకే కాదు అందరికి దండం పెట్టి చెబుతున్నా అని కార్తీక్ అంటాడు. నాతోనే ఈ సమస్యకు మూలం పడింది కాబట్టి నేనే పరిష్కరిస్తాను అని సుమిత్ర అంటుంది. దీపను క్షమించి పాత సుమిత్రల ఆదరిస్తే నేను క్షమించినట్లే. నేను అన్ని మర్చిపోతాను. కలిసి ఉండాలని నాకు ఉండదా అని కాంచన అంటుంది.

రెండు కుటుంబాల భవిష్యత్తు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. దీపను క్షమిస్తానని ఎప్పటిలా ఉందామని చెప్పు అని కార్తీక్ అంటే.. సరేరా అని సుమిత్ర అంటుంది. నువ్వు అన్నదానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా నిర్ణయం అయితే ఇక్కడ చెప్పను. నేను శరతులు పెడతాను. ఎక్కడైతే దీపకు అన్యాయం జరిగిందో, ఎక్కడ పెళ్లి జరిగిందే, నేను ఎక్కడ తాళి తీసానో అక్కడే మీ అందరి సమక్షంలో నా నిర్ణయం చెప్పాలనుకుంటున్నాను. దీప విషయంలో నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని సుమిత్ర అంటుంది.

అన్నయ్య ఇప్పుడే మీ అందరిని మా ఇంటికి రావాలని ఆహ్వానిస్తున్నాను. మొత్తం ఇంటిల్లిపాది ఇంటికి రండి. మా ఇంట్లో విందు భోజనం. నా మేనల్లుడుగానే కార్తీక్ నువ్వు వస్తావ్ అని సంతోషంగా చెబుతుంది సుమిత్ర. అందరితోపాటు దీపతో కూడా వెళ్లొస్తామని సుమిత్ర అంటుంది. ఉండటానికి ఏం మిగిలింది బూడిద. బావ కొట్టిన దెబ్బకు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు అని జ్యోత్స్న అనుకుంటుంది.

పారిజాతం ఆగ్రహం

శ్రీధర్ కూడా వెళ్లొస్తానని చెప్పి చివరిగా ఒక్కమాట రెండు కుటుంబాలు కలవాలని అన్నారు. అందులో నేను కూడా ఉన్నానని గుర్తుపెట్టుకోండి అని వెళ్లిపోతాడు. తర్వాత రాత్రి సుమత్ర చెప్పింది తలుచుకుని శివ నారాయణ సంతోషంగా మురిసిపోతాడు. దశరథ్ వచ్చి ఒంటరిగా ఉన్నావేంటీ నాన్న అని మాట్లాడుతాడు. చాలా రోజుల తర్వాత మనసుకు హాయినిచ్చే విషయం జరిగింది. సుమిత్ర తీసుకున్న నిర్ణయం. ఆడపడుచు కాంచనను రమ్మంది అంటే కలిసిపోదామనేగా అని శివ నారాయణ అంటాడు.

ఇంతకీ నీతో ఎవరో ఉన్నారని చెప్పావ్ అని దశరథ్ అడుగుతాడు. చిన్నప్పుడే కాంచన కోసం దశరథ్ చేసింది చెబుతాడు. చెల్లి ఇక్కడే ఉండాలని పెద్ద గొడవ చేశావ్. అది చూసి కంటతడి పెట్టుకున్న మీ అమ్మ ఏవండి మనకు ఇల్లరికపు అల్లుడే రావాలని చెప్పింది. సరే అన్నా కానీ పెద్దయ్యాకా ఆ ప్రేమలు ఉంటాయా అని అనిపించాయ్. మీ అమ్మతోపాటే ఆ మాటలు పోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటాడు శివ నారాయణ.

శ్రీధర్‌తో నువ్వే ఓ మాట అన్నావ్. బావ చెల్లి నీతో పెళ్లి అయింది కానీ, మాతో ఉన్నట్లే అని. అప్పుడు మీ అమ్మే గుర్తు వచ్చింది. నేను ఇచ్చిన మాట మర్చిపోయాను కానీ నువ్వు గుర్తుంచుకున్నావ్. తర్వాత శ్రీధర్ రెండో పెళ్లి, పంథాలు, పౌరుషాలతో దూరమైపోయాం అని శివ నారాయణ ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరితో ఉన్నానో. నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవి నాకు మాత్రమే సొంతం అని ఏడిపించేస్తాడు శివ నారాయణ .

రేయ్ నీ భార్యతో మాట్లాడురా అని శివ నారాయణ అంటే.. అందరం కలిసిపోతే నా కోపం ఎవరి మీద ఉంటుంది అని దశరథ్ కూడా ఏడుస్తాడు. తండ్రికొడుకులు ఏడిపించేస్తారు. మరోవైపు శ్రీధర్ తాగుతుంటే కావేరి ఆమ్లేట్ తీసుకొస్తుంది. కార్తీక్ కోసమే దీప పుట్టిందని స్వప్న అంటే మీరు నమ్మట్లేదటగా. ఇప్పుడు ప్రాణదాత అని తెలిసిందిగా ఏమంటారు అని అడగాలని అనుకుంటుందట అని కావేరి అంటుంది.

కార్తీక్‌ను దీప కాపాడింది. తండ్రిగా దీపకు ఎప్పుడు రుణపడి ఉంటాను. రేపు దీపను సుమిత్ర క్షమించి రెండు కుటుంబాలు కలిస్తే మనల్ని కూడా కలిపేసుకోమ్మని దీపనే అడగాలనుకుంటున్నాను. రెండు కుటుంబాలు దీపతోనే కలుస్తాయని పిలుస్తుంది అని శ్రీధర్ అంటాడు. మీ మాటలు వింటుంటే దిష్టి తీయాలని ఉందని కావేరి అంటుంది. ఆ మాటలు విన్న స్వప్న కూడా అలాగే అనుకుంటుంది.

పారు మరియు జ్యో ప్రతిస్పందన

మరోవైపు ఆ గ్రానికి గట్టిగా ఇవ్వాల్సిందే. ఈరోజు బాగా ఓవర్ చేసింది అని జ్యోత్స్న అనుకుంటుంటే పారిజాతం వస్తుంది. పారు డోర్ క్లోజ్ చేస్తుంది. తిడతానని ముందుగానే ఫిక్స్ అయి తలుపు మూస్తున్నావా అని జ్యోత్స్న అంటుంది. దీపను ఏడిపించడానికే అన్ని మాట్లాడితే నాకు సపోర్ట్ చేయాలని తెలియదా అని అంటుంది జ్యోత్స్న. పారిజాతం ఒక్కసారిగా జ్యోత్స్న ను లాగిపెట్టి కొడుతుంది.

నన్నెందుకు కొట్టావ్ అని జ్యో అడిగితే మళ్లీ కొడుతుంది. మైండ్ పోయిందా అని జ్యో అంటుంది. అవునే నువ్ చేసినదానకి మైండ్ పోయింది అని గొంతు పట్టుకుంటుంది పారు. ఊపిరి ఆడటం లేదు అని తోస్తుంది జ్యో. మళ్లీ జ్యోత్స్నను కొడుతుంది పారిజాతం. దాంతో బెడ్‌పై పడిపోతుంది. నీకు దండం పెడతానే తల్లి. నువ్వేంటీ ఇంత భయంకరంగా ఉన్నావ్. చూస్తేనే భయమేస్తుంది అని వణికిపోతుంది జ్యోత్స్న.

నువ్వు నా రక్తానివి కాబట్టి బతికిపోయావ్. లేకపోతే చంపేసేదాన్ని. కాశీ గాడు పోలీస్ స్టేషన్‌లో ఉంటే మీ నాన్న ఫోన్ చేశాడా లేదా. దాసు మొత్తం నాకు చెప్పాడు. సొంత రక్తానికి ఉన్న విలువ బయటి రక్తానికి ఉండదని చెప్పావుగా. మీ తమ్ముడిది నీది ఒకే తల్లి రక్తం. మరి నువ్వు చూపించింది ఏంటీ. సాయం కోసం మీ నాన్న ఫోన్ చేస్తే నమ్మించి మోసం చేశావ్ అని ఉగ్రరూపం చూపిస్తుంది పారిజాతం .

గౌతమ్ విషయంలో కాశీ నన్ను మోసం చేశాడని జ్యో చెబుతుంది. నువ్వు అక్కవని వాడికి తెలియదే. దాసు ఫోన్‌లో చెప్పింది నాకు చెబితే నా తిప్పలు నేను పడేదాన్ని అని పారిజాతం అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లోని సంఘటనలు కార్తీక దీపం 2 కథాంశంలో కొత్త మలుపు తీసుకువస్తాయి. సుమిత్ర నిర్ణయం మరియు పారిజాతం చర్యల ప్రభావం తదుపరి ఎపిసోడ్‌లలో కనిపిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.