|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్ ఎమోషనల్.. దీపలా మాట్లాడిన సుమిత్ర.. జ్యోత్స్న సీఈఓ పోస్టుకు ఎసరు.. నెల రోజుల టైమ్

Published: 08-09-2025, 9:46 PM
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్ ఎమోషనల్.. దీపలా మాట్లాడిన సుమిత్ర.. జ్యోత్స్న సీఈఓ పోస్టుకు ఎసరు.. నెల రోజుల టైమ్

కార్తీక దీపం 2 సీరియల్ లోని తాజా ఎపిసోడ్ లో శ్రీధర్ మరియు కార్తీక్ మధ్య ఎమోషనల్ ఘర్షణ చూడవచ్చు. సుమిత్ర దీపలా మాట్లాడటం, జ్యోత్స్న సీఈఓ పోస్టుకు సవాలు విసిరటం వంటి సంఘటనలు ఈ ఎపిసోడ్ లో కీలక పాత్ర పోషిస్తాయి.

Key Points

1

శ్రీధర్ మరియు కార్తీక్ మధ్య ఎమోషనల్ సన్నివేశం

2

సుమిత్ర దీపలా మాట్లాడిన విషయం

4

కంపెనీ సమస్యలకు పరిష్కారం కోసం నెల రోజుల సమయం

శ్రీధర్ మరియు కార్తీక్ మధ్య సంఘర్షణ

కార్తీక దీపం 2 టుడే సెప్టెంబర్ 9వ తేదీ ఎపిసోడ్ లో శ్రీధర్ కాల్ చేస్తే కార్తీక్ మాట్లాడతాడు. వ్రతానికి రమ్మన్నా వచ్చా. ఆ తర్వాత ఫోన్ చేశావా? అంటే అవసరం తీరిపోయింది కదా అనుకుంటున్నావా? ఏం చేశానో చెప్పు అని అడుగుతాడు శ్రీధర్. నీ అభిప్రాయాలు మార్చుకోమని అనను. ప్రవర్తన మన చేతిలోనే ఉంది. తప్పు చేసిన తర్వాత నీ బిహేవియర్ పూర్తిగా మారిపోయింది మాస్టారూ. పిల్లను ఇచ్చి తండ్రి కొట్టడం తప్పు కాదు. కానీ ఆ తర్వాత ఎప్పుడైనా మంచిగా మాట్లాడావా? అని కార్తీక్ అంటాడు.

పారు చేసే పనులు తాతకు నచ్చవు. వాళ్ల పక్కన ఉన్నవాళ్లు కూడా నచ్చరు. నలుగురు గౌరవంగా చూసేలా ఉండాలి. తాత దాసు మామయ్యను దగ్గరకు తీసుకుంటే మీకేంటీ మంట? వెళ్లి తాతతో గొడవపడుతున్నారని శ్రీధర్ తో కార్తీక్ అంటాడు. అల్లుని కంటే పని మనిషిని పెళ్లి చేసుకున్న దాసు అల్లుడి కంటే ఎక్కువైపోయాడా? అని శ్రీధర్ తిరిగి అడుగుతాడు. మనం మాత్రం మారడం లేదు. బుర్రలో ఆలోచనలు మాత్రం బీసీ కాలం నాటివే. నీ ప్రవర్తనకు జనం నిజంగానే నవ్వుతున్నారు. గౌరవంగా ఉండు. ఎవరైనా నచ్చకపోతే మాట్లాడటం మానేయ్. నిన్ను ఎవరైనా ఏమైనా ఉంటే తట్టుకోలేను.నువ్వు నా తండ్రివి. నేను నీ కొడుకుని అని శ్రీధర్ ను కార్తీక్ ఏడిపించేస్తాడు.

నీ కోసం మారతాను. నువ్వు కోరుకున్న తండ్రిలా ఉంటానని కార్తీక్ అనుకుంటాడు. మరోవైపు కంపెనీ ఎంప్లాయ్స్ వచ్చి రోడ్డున పడే పరిస్థితి వస్తుందేమోనని భయపడుతూ చెప్తారు. కారణం ఎవరు? అని శివన్నారాయణ అడుగుతాడు. ఈ మధ్య కంపెనీ లాస్ లో ఉందని వినపడుతోంది. మా మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమే. ఆ భయంతోనే మీ దగ్గరకు వచ్చాం సార్ అని చెప్తారు. మీకు భయాలు అక్కర్లేదని చెప్పి పంపించేస్తాడు శివన్నారాయణ. ఏం జరిగినా మీ ఉద్యోగాలకు ఎలాంటి నష్టం ఉండదు అని కార్తీక్ కూడా చెప్తాడు. కార్తీక్ చెప్పాడంటే నేను చెప్పినట్లే అని శివన్నారాయణ కూడా అంటాడు.

కంపెనీలోని సమస్యలు మరియు ఉద్యోగుల భయం

కార్తీక్ ఏమైనా జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కు ఛైర్మన్ హా, ఎండీనా? కార్తీక్ చెప్పడం ఏంటీ అని పారిజాతం అడుగుతుంది. పోయిన సారి ప్రాబ్లెం వస్తే సాల్వ్ చేసింది కార్తీక్. అప్పుడు ఎందుకు అడగలేదని కౌంటర్ ఇస్తాడు శివన్నారాయణ. కార్తీక్ పై ఎంప్లాయ్స్ కు నమ్మకం ఉంది. కొన్ని గుర్తించాలి. కొన్ని గౌరవించాలని శివన్నారాయణ అంటాడు. ఎంప్లాయ్స్ ను నమ్ముతున్నావా? చీప్ ట్రిక్స్ ఇవి అని జ్యోత్స్న అనగానే.. 10 నిమిషాల్లో ఆడిటర్ మన ఇంట్లో ఉండాలని దశరథకు శివన్నారాయణ ఆర్డర్ వేస్తాడు. అది విని జ్యో షాక్ అవుతుంది. ఆడిటర్ వస్తే నా దొంగ లెక్కలు భయటపడతాయని జ్యో అనుకుంటుంది.

కార్లో స్వప్న, కాశీ వెళ్తారు. రెండు రోజులు నేచర్ ట్రిప్ కు వెళ్దామని అనగానే నాన్న కారు ఇచ్చాడని స్వప్న అంటుంది. మరో రెండు నెలల్లో సాలరీ పెరుగుతుంది. అప్పుడు మంచి ఇల్లు, కారు కొనుక్కోవాలి. ఆ తర్వాత లైఫ్ లోకి పిల్లలు వస్తారని కాశీ చెప్తుండగా ఫోన్ కు మెయిల్ వస్తుంది. మెయిల్ చూసి స్వప్న షాక్ అవుతుంది. అప్పుడే ప్రాజెక్ట్ మేనేజర్ కాల్ చేసి లేఆఫ్ లో కొంతమంది ఎంప్లాయ్స్ ను కంపెనీ తీసేసింది. ఆ లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది. ఇక ఆఫీస్ కు రానక్కర్లేదని చెప్పడంతో కాశీ షాక్ అవుతాడు. ఇక్కడితో జీవితం ఆగిపోతుందా? ముందు కారు స్టార్ట్ చేయమని స్వప్న అంటుంది.

ఇది కాకపోతే వేరే కంపెనీ మనలో టాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరని స్వప్న అంటుంది. ఎంతో కష్టపడితే కానీ ఈ జాబ్ రాలేదు దిల్లు. బయట అవకాశాలు కూడా తక్కువేనని స్వప్న ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే జాబ్ గురించి ఆలోచిస్తూ బైక్ కు డ్యాష్ ఇస్తాడు కాశీ. మరోవైపు శివన్నారాయణ ఇంట్లో ఆడిటర్ లెక్కలు వివరిస్తాడు. గత మూడు నెలల నుంచి కంపెనీ లాస్ లోనే ఉందని ఆడిటర్ చెప్తాడు.

జ్యోత్స్న యొక్క సవాళ్లు మరియు కార్తీక్ ప్రతిస్పందన

మ్యాన్ పవర్ ఎక్కువ ఉండటం కారణం తాత. 50 ప్లస్ ఉన్నవాళ్లతో వర్క్ చేయించడం కష్టం. ఆన్ టైమ్ లో వర్క్ కంప్లీట్ కాదు. ఈ బ్యాచ్ ను రిలీవ్ చేస్తే తప్పా మనకు రిలీఫ్ రాదు. ఈ నిర్ణయాన్ని ఇదివరకే తీసుకున్నా. కానీ కొంతమంది అడ్డుకున్నారని కార్తీక్, దీపను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా మాట్లాడుతుంది జ్యోత్స్న. అది మనకు నిర్ణయం. అవతలి వాళ్లకు జీవితం. కష్టాల్లో ఉన్నవాళ్ల తరపున మాట్లాడటం అన్యాయం అవదని దీప అంటే, జ్యోత్స్న ఆపేసి ఆడిటర్ ను పంపించేస్తుంది. నువ్వు పని మనిషివి కంపెనీ ఆడ్వైజర్ వి కాదు. కాఫీ ఇవ్వు కానీ సలహాలు ఇవ్వకు అని జ్యో అంటుంది.

నీ సలహాలు, నిర్ణయాల వల్లే కంపెనీకి ఈ గతి పట్టిందని జ్యోపై శివన్నారాయణ సీరియస్ అవుతాడు. నాశనమైన సత్యరాజ్ రెస్టారెంట్ ను కార్తీక్ నంబర్ వన్ పొజిషన్ లో నిలబెట్టాడు. కానీ నువ్వు నష్టాల్లోకి తీసుకు వచ్చావని శివన్నారాయణ, దశరథ ఫైర్ అవుతారు. జ్యోత్స్న సీఈవో అయిన వన్ ఇయర్ లో కంపెనీకి ఎప్పుడు లాభాలు రాలేదని శివన్నారాయణ అంటాడు. 50 ప్లస్ ఉన్నవాళ్లను తీసేయాలని జ్యోత్స్న అంటుంది. మనకు అవి నిర్ణయాలు, కానీ అవతలి వాళ్లకు జీవితాలు అని దీప లాగే సుమిత్ర అనడంతో అందరూ షాక్ అవుతారు.

నెల రోజులు టైమిస్తున్నా. కంపెనీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలని శివన్నారాయణ కండీషన్ పెడతాడు. సీఈవో పోస్టుకు అర్హురాలివని ప్రూవ్ చేసుకోకపోతే వేరే సీఈవో వస్తారు అని శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు. నీ పనితనం మీద నమ్మకం పోతే దోషిలానే చూస్తారు. అది ఆలోచించి నిర్ణయాలు తీసుకో అని జ్యోత్స్నకు సుమిత్ర చెప్పడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్ లో కార్తీక్ తన తండ్రి శ్రీధర్ తో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కంపెనీ సమస్యలను అధిగమించడానికి కార్తీక్ మరియు జ్యోత్స్న మధ్య పోటీ కొనసాగుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.