|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం టుడే ఎపిసోడ్ మే 5: దశరథ్‍ను కాల్చిందెవరో తెలిసిపోయింది.. జ్యోత్స్న కుట్రే.. జ్యో మంచి చేసిందన్న దీప

Published: 04-05-2025, 10:16 PM
కార్తీక దీపం టుడే ఎపిసోడ్ మే 5: దశరథ్‍ను కాల్చిందెవరో తెలిసిపోయింది.. జ్యోత్స్న కుట్రే.. జ్యో మంచి చేసిందన్న దీప

మే 5, 2025 నాటి కార్తీక దీపం ఎపిసోడ్ లో దశరథ్ హత్య వెనుక ఉన్న రహస్యం వెల్లడవుతుంది. కార్తీక్ మరియు దీప ఈ హత్యకు కారణాలను అన్వేషిస్తుండగా, జ్యోత్స్న యొక్క కుట్ర బయటపడుతుంది. ఈ సంఘటనలతో కథ ఎలా ముందుకు సాగుతుందో చూద్దాం.

Key Points

1

కార్తీక్ దీప తో దశరథ్ హత్యకు కారణాలను విశ్లేషిస్తున్నాడు.

2

జ్యోత్స్న కుట్రను కార్తీక్ ఖచ్చితంగా అంచనా వేస్తున్నాడు.

4

దశరథ్ ను సత్తిపండే కాల్చాడని వెల్లడి అవుతుంది.

దశరథ్ హత్య రహస్యం

కార్తీక దీపం 2 నేటి (మే 5, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నువ్వు ఆ ఇంటికి వెళుతున్న సంగతి జ్యోత్స్నకు ఎలా తెలిసిందని దీపతో కార్తీక్ అంటాడు. అంతా ప్లాన్ చేసినట్టు నువ్వు గన్ పట్టుకున్న సమయానికే ఎలా షూట్ చేస్తారు, అంటే నువ్వు ఆ ఇంటికి వెళుతున్న విషయం ఎవరికో తెలుసని చెబుతాడు. తనను ఎవరూ ఫాలో కాలేదని, జ్యోత్స్న కాల్ చేస్తే ఇంటికి వెళుతున్న విషయం తానే చెప్పానని దీప అంటుంది. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోందని, రెస్టారెంట్‍లో కావేరి చిన్నమ్మ వినాలనే జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకొని ఉంటారని కార్తీక్ అంటాడు.

కావేరి నీతో చెబుతుందనే జ్యోత్స్న , పారిజాతం అలా మాట్లాడుకొని ఉంటారని తన అంచనా అని కార్తీక్ అంటాడు. నువ్వు బయలుదేరిన విషయం చెప్పడంతో నిన్ను చంపడానికి జ్యోత్స్న ప్లాన్ చేసి ఉంటుందని కార్తీక్ అంటాడు. అయితే, జ్యోత్స్న అంత తెలివి తక్కువగా ప్లాన్ చేయదని మరో ఆలోచన చేస్తాడు. నువ్వు గన్ లాక్కుంటావని జ్యో ముందే అనుకొని ఉంటుందని చెబుతాడు. “ఒకవేళ దశరథ్ మామయ్యను షూట్ చేయించి, ఆ నేరాన్ని నీపై వేసి, నిన్ను జైలుకు పంపి తాను నీ లైఫ్‍లోకి రానుందేమో. ఇది సరిగ్గా మ్యాచ్ అయింది కదా” అని కార్తీక్ అంటాడు. జ్యో కుట్రను కరెక్ట్‌గా అంచనా వేస్తాడు. ఇది జస్ట్ నా ఊహ మాత్రమే అని కూడా అంటాడు.

జ్యోత్స్న కన్న తండ్రిని చంపుతుందా అని దీప ఆశ్చర్యంగా అంటుంది. ఇంతకు ముందు తప్పులు చేసింది కాబట్టి తన గురించి ఇలా ఆలోచిస్తున్నానని కార్తీక్ అంటాడు. ఏమో దశరథ్ మామయ్య కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, వాళ్లు అటాక్ చేసిన సమయానికి నువ్వు వెళ్లావేమో అని మరో అనుమానం వ్యక్తం చేస్తాడు. నువ్వు బయటికి వచ్చావ్ సంతోషం అని చెబుతాడు. ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులవుతుంది పడుకుందా అని అంటాడు.

జ్యోత్స్నను పారిజాతం ఫాలో అవుతుంది. జ్యోత్స్న ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటే వేరే కారులో నుంచి పారిజాతం చూస్తుంటుంది. రాత్రే నీపై అనుమానం వచ్చింది, గౌతమ్‍నే కలిసేందుకే వచ్చిందా అని అనుకుంటుంది. ఇంతలో జ్యోత్స్న దగ్గరికి సత్తిపండు వస్తాడు. వీడితో దీనికి ఏం పని అని పారిజాతం అనుకుంటుంది. కళ్లు జోడు బాగుందని సత్తిపండు అంటే.. చెంపపై కొడుతుంది జ్యోత్స్న.

“రేయ్ ఇడియట్ బుల్లెట్ ఎందుకురా మిస్ చేశావ్. నేను ఎక్కడ కాల్చమంటే ఎక్కడ కాల్చావ్” అని సత్తిపండు కాలర్ పట్టుకొని కోపంగా అడుగుతుంది జ్యోత్స్న. దీప గన్ పట్టుకున్న సమయంలో సత్తిపండే దశరథ్‍ను షూట్ చేశాడని దీంతో తెలిసిపోయింది. బుల్లెట్ సరిగ్గా గుండెల్లో దిగి ఉంటే తన తండ్రి దశరథ్ ప్రాణం పోయేది, దీప జైలుకు వెళ్లి ఉండేదని జ్యో అంటుంది. కానీ అలా జరగలేదని చెబుతుంది.

దశరథ్ గుండెల్లో బుల్లెట్ తలగకుండా కాస్తలో మిస్ అయ్యేందుకు కారణం మీరే అని జ్యోత్స్నతో సత్తిపండు అంటాడు. కదలకుండా ఆయనను గట్టిగా పట్టుకొని ఉంటే, అనుకున్న ప్లేస్‍లో బుల్లెట్ తలిగి ఉండేదని అంటాడు. అందుకే బుల్లెట్ గుండెకు కాకుండా రెండు ఇంచులు పక్కకు తలిగిందని చెబుతాడు. పారిజాతం దూరంగా ఉండడం ఏమీ వినిపించదు. అయితే, చేతులతో గన్ పట్టుకున్నట్టు సత్తిపండు చూపించడంతో దశరథ్‍ను కాల్చంది వీడేనా అని పారిజాతానికి అనుమానం వస్తుంది.

నువ్వు చేసిన తప్పుకు నేను దొరికిపోయేలా ఉన్నానని జ్యోత్స్న అంటుంది. తప్పు నేను చేసినా.. చేయించింది మీరే కదా అని సత్తిపండు బదులిస్తాడు. దొరికిపోయేది నువ్వే రా.. పేషెంట్ బాడీలో ఉన్న బుల్లెట్ దీప గన్‍లో నుంచే వచ్చింది ప్రూవ్ చేసేందుకు ప్రయత్నిస్తే ఎస్ఐ మోసం చేశాడని జ్యో చెబుతుంది. బుల్లెట్ మార్చలేదని చెబుతుంది. దీంతో సత్తిపండు కంగారు పడతాడు. మా డాడీకి తలిగిన బుల్లెట్ ఏ గన్‍లో నుంచి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.. షూట్ చేసింది నువ్వే అని తెలిస్తే నేను కూడా కాపాడలేను అని చెబుతుంది.

జ్యోత్స్న యొక్క కుట్ర

షూట్ చేసిన నాకు శిక్ష పడితే.. చేయించిన మీకు పడదా అని సత్తిపండు అంటాడు. నన్ను చీట్ చేస్తే బతకనివ్వను అని సత్తిపండు కాలర్ పట్టుకుంటుంది జ్యోత్స్న. నన్ను కాపాడే బాధ్యత మీదే, నేను దొరికిపోతే మీరు దొరికిపోతారు అని సత్తిపండు అంటాడు. సిటీలో ఉండకుండా దూరంగా పారిపో అని డబ్బు ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు చెబితే తప్ప మన గురించి తెలియదని అంటుంది.

నేను కూడా తెగించి బతుకున్నా అని జ్యోత్స్న అంటుంది. “నాకు ప్రమాదం తప్పదని తెలిస్తే.. సొంత తండ్రినే చంపాలనుకున్న దాన్ని.. నిన్ను వదిలేస్తానా చెప్పు” అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. దశరథ్‍ను షూట్ చేయించింది జ్యోత్స్ననే అనే విషయం స్పష్టంగా బయటపడిపోయింది.

డబ్బు ఇచ్చి మరీ వాడిని బెదిరిస్తుంది ఏంటి అని పారిజాతం అనుకుటుంది. దాసు, దశరథ్‍లపై అటాక్ చేయించింది జ్యోత్స్న అని తెలిస్తే అసలు వదలననని, నేనంటే ఏంటో చూపిస్తానని ఆలోచిస్తుంది.

ఎక్కడికి వెళుతున్నావని దీపను అనసూయ అడుగుతుంది. సుమిత్రమ్మ ఇంటికి అని దీప బదులిస్తుంది. దశరథ్‍ను చూసేందుకు వెళతానంటుంది. చెంప మీద కొడితే గదిలో పడతావంటూ కోప్పడుతుంది అనసూయ. ఎలా ఉందో విన్నావ్ కదా అని అంటుంది. ఆరోజు ఒంటి నిండా రక్తంతో దశరథ్ ఉండడం చూశానని, ఆ ఇంటిని తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తోందని దీప అంటుంది.

చాటుగా అయినా ఓసారి చూసొస్తాని దీప అంటే.. ఈసారి వెళ్లి ఎవరిని కాల్చివస్తావే అని అనసూయ అంటుంది. ఎవరిని కాలుస్తావో చెబితే ముందు గుండె గట్టిగా చేసుకొని ఉంటామని వెటకారంగా అంటుంది. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అత్తయ్య అని దీప అడుగుతుంది. నీ చేతులను చూసే అని అనసూయ అంటుంది. జనాలు అనుకున్న మాటలు అంటూ దీపను కొన్ని ప్రశ్నలు అడుగుతుంది అనసూయ.

నిశ్చితార్థం ఆపి జ్యోత్స్న జీవితం కాపాడి నువ్వు చెడ్డదానివి అయ్యావని అనసూయ అంటుంది. నాటకాలు ఆడి గౌతమ్‍ను జ్యో కాపాడిందని చెబుతుంది. వీటన్నింటికీ జ్యోత్స్న కారణం కాదా అని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ తెలిసినా జ్యో పెళ్లి ఆపేందుకు నువ్వు ఎందుకు ఆరాటపడ్డావని అడుగుతుంది. సైలెంట్‍గా ఉంటే.. నిజాలు చెప్పి అదే ఇరుక్కునేది కదా అని అనసూాయ అంటుంది.

పారిజాతం పరిశోధన

కార్తీక్ బాబును దక్కించుకోవాలని జ్యోత్స్న ఒక నాటకం మొదలుపెట్టి జ్యోత్స్న ఇరుక్కుపోయిందని, గౌతమ్‍ను కాపాడి మరింత కూరుకుపోయిందని దీప అంటుంది. పెళ్లి ఆపకుండా నాశనం అయిపోయేది జ్యోత్స్న జీవితమే కదా అని అనసూయ అంటుంది. అప్పుడు నరసింహానికి వ్యతిరేకంగా చెప్పి కోర్టులో నన్నెందుకు కాపాడవని దీప అడుగుతుంది. అది, ఇది వేరు అంటుంది అనసూయ.

దేవుడు లాంటి మొగుడు, రత్నం లాంటి కూతురు, తల్లి లాంటి అత్త.. ఏ కష్టం లేని జీవితం నీకు ఉందని, అనవసరమైనవి ఎందుకు నెత్తిన వేసుకుంటున్నావని దీపతో అనసూయ అంటుంది. నేను ఆపకపోతే జ్యోత్స్న పెళ్లి ఆపుకుంటుందని నాకు తెలుసు అని, మీ పాటి ఆలోచన కూడా నాకు రాదని అనుకున్నారా అని దీప అంటుంది. గౌతమ్‍ చాలా డేంజర్ అని, అలాంటి వాడినే జ్యో మోసం చేస్తోందని దీప అంటుంది. తనను మోసం చేసిందని తెలిస్తే జ్యోను గౌతమ్ వదలడని, వీలైతే మానం తీస్తాడు.. లేకపోతే ప్రాణం తీస్తాడు అని దీప అంటుంది. జ్యోత్స్నకు జీవితమే లేకుండా పోతుందని చెబుతుంది.

కార్తీక్‍ బాబును కోరుకోవడం వల్ల జ్యోత్స్న తనకు శత్రువు అయిందని, కానీ ఒకప్పుడు తనకు మంచి చేసిందని దీప గుర్తు చేసుకుంటుంది. “ఒకప్పుడు అందరూ వదిలేసినా నన్ను చేయి పట్టుకొని అక్కా అని పిలిచిన మనిషి. నన్ను నా కూతురిని ఇంటికి తీసుకెళ్లి ఉండడానికి నీడ, బతకడానికి ధైర్యం ఇచ్చారు. కడుపు నిండా అన్నం పెట్టారు. సొంత మనిషిలా చూసుకున్నారు. రుణపడిపోయాను. ఆ రుణం తీర్చుకోవాలి. జ్యోత్స్న జీవితం ఏమైతే ఏంటి అని నేను వదిలేస్తే నేను మనిషిని అవను. విశ్వాసం లేని జంతువుగా మిగిలిపోతాను” అని దీప అంటుంది.

గౌతమ్ ఎలాంటి వాడో జ్యోత్స్న నోటితోనే చెప్పిస్తే పెళ్లి ఆగిపోతుందనేదే తన ఉద్దేశ్యమని జ్యోత్స్న అంటుంది. గౌతమ్ గురించి పెద్దవాళ్లకు తెలిసినా.. నేను ఏ తప్పు చేయలేదని తెలుస్తుందని అంటుంది. దీప మాటలను కార్తీక్ వింటూ ఉంటాడు. సుమిత్ర, దశరథ్‍లకు ఒక్క కూతురైన జ్యోత్స్నకు ఏమైనా జరిగితే వారు ఏమై పోతారని అంటుంది. సుమిత్ర తనకు ఎప్పటికీ తల్లిలాంటి వారేనని దీప చెబుతుంది.

ఈరెండు కుటుంబాలు ఒకటిగా కలిసిపోయి అప్పుడు పండగలా ఉండేదని దీప అంటుంది. శ్రీధర్, నా కారణంగా నాలుగు ముక్కలైందని బాధపడుతుంది. వీళ్లందరినీ కలపాలి, మళ్లీ ఆ ఇంటికి పండుగ తీసుకురావాలని దీప అంటుంది. సుమిత్ర, కాంచన ఆప్యాయంగా మాట్లాడుకోవాలి, నువ్వు గెలిచావ్ మనవడా అని కార్తీక్ బాబును వాళ్ల తాతయ్య అనాలి, పెళ్లి జరిగి భర్తతో జ్యోత్స్న సుఖంగా ఉండాలి అంటూ తనకు ఉన్న ఆశలను దీప చెబుతుంది. వీళ్లంతా ఒకే ఇంట్లో సంబరం చేసుకుంటుంటే నా కూతురు మధ్యలో ఉండాలి అని దీప అంటుంది. నేను చచ్చిపోయేలోపు చూడాలనుకుంటున్నది ఇదే అని దీప అంటుంది.

దీని కోసం చచ్చిపోవడం ఎందుకు, బతికుండగానే సాధిస్తామని కార్తీక్ అంటాడు. అంతా విన్నానని చెబుతాడు. ఎందుకు దీపను రెచ్చగొట్టారని అనసూయను అడుగుతాడు. ఇది మళ్లీ ఆ ఇంటికి వెళతానంటే కోపం ఆగలేదని అనసూయ బదులిస్తుంది. వద్దు దీప.. వెళ్లే సమయం వస్తే నేనే తీసుకెళతా.. అంత వరకు ఆ ఇంటికి వెళ్లొద్దని కార్తీక్ చెబుతాడు. దీంతో దీప, అనూసూయ లోపలికి వెళతారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 5) ఎపిసోడ్ ముగిసింది.

చివరికి దశరథ్ హత్యకు సత్తిపండు కారణమని తెలిసింది. జ్యోత్స్న కుట్ర విఫలమైంది. కార్తీక్ మరియు దీప ఇప్పుడు ఈ సంఘటన నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.