
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ తన ఇంటి పనిమనిషిపై దొంగతనం ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. రూ.4 లక్షల నగదును దొంగిలించినట్లు ఆమె ఫిర్యాదు చేసింది.
Key Points
బిగ్ బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఇంటి పనిమనిషి రూ.4 లక్షల నగదు దొంగిలించాడని ఆరోపించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఐదు నెలలుగా ఆమె ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిపై ఆరోపణలు ఉన్నాయి.
రూ.4 లక్షల నగదు దొంగతనం
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ కశిష్ కపూర్ (24) పోలీసులను ఆశ్రయించింది . తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు పీఎస్ లో ఫిర్యాదు చేసింది . తన ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముంబయిలోని అంబోలి స్టేషన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది . తన బీరువాలోని రూ .4 లక్షల నగదు చోరీ చేశాడని జూలై 9న ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది .
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . ప్రస్తుతం పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు . కాగా .. సచిన్ కుమార్ మార్ చౌదరి గత ఐదు నెలలుగా ఆమె ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్నారని పోలీసులకు తెలిపింది . కాగా .. బిగ్ బాస్ బ్యూటీ కశిశ్ కపూర్ బీహార్ స్వస్థలం కాగా .. ప్రస్తుతం ముంబయి అంధేరి వెస్ట్‌లోని ఆజాద్‌నగర్ వీర దేశాయ్ రోడ్‌లోని సొసైటీలో నివసిస్తోంది . ఆమె సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ లో నటించింది . బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది .
పనిమనిషిపై ఆరోపణలు
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనతో బిగ్ బాస్ ఫేమ్ కశిష్ కపూర్ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటోంది. పోలీసుల దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంది.


