
టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి వార్తలపై సంచలన ట్విస్ట్! ప్రముఖ నటుడు వై.జీ. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరిగిందంటే..
Key Points
కావ్య మారన్, అనిరుధ్ పెళ్లిపై బాబాయ్ మహేంద్రన్ షాకింగ్ ప్రకటన.
ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయని మహేంద్రన్ వెల్లడి.
గతంలో అనిరుధ్ పెళ్లి వార్తలను కొట్టిపారేశారు.
రజనీకాంత్ పెళ్లి సంబంధం మాట్లాడారనే వార్తలు వైరల్.
అనిరుధ్ బాబాయ్ మహేంద్రన్ సంచలన వ్యాఖ్యలు!
Y Gee Mahendran Confirms Kavya Maran Anirudh Ravichander Wedding: ఎస్ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మారన్, అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి పెళ్లి వార్త నిజమేనంటూ అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
Y Gee Mahendran Confirms Kavya Maran Anirudh Ravichander Wedding: సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ సెన్సేషనల్ రూమర్‌కు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్ , సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు క్రీడా లోకంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే రేంజ్‌లో కావ్యకు ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు అనిరుధ్ సైతం ‘జెర్సీ’, ‘దేవర’ వంటి ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకటవుతున్నారనే వార్త తెలుగు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
పెళ్లి వార్తలపై అనిరుధ్ గతంలో ఏమన్నాడు?
“అనిరుధ్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న కుర్రాడు. వాడు ఒక పెద్ద ఇంటికి అల్లుడిగా వెళ్తున్నాడు. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెళ్లి జరగడం ఖాయం. ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి” అని వై.జీ. మహేంద్రన్ వెల్లడించారు.
ఈ ఇద్దరి జోడీ అద్భుతంగా ఉంటుందని, పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి మ్యూజిక్ బిజినెస్ రంగంలో అడుగుపెడితే బాగుంటుందని వైజీ మహేంద్రన్ ఆకాంక్షించారు. అయితే పెళ్లి తేదీ, వేదిక వంటి వివరాలను మాత్రం ఆయన దాటవేశారు.
అనిరుధ్‌కు బంధువైన సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి, కావ్య తండ్రి కళానిధి మారన్‌తో పెళ్లి సంబంధం మాట్లాడారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే ఆ సమయంలో ఈ వార్తలను అనిరుధ్ కొట్టిపారేశారు. “పెళ్లా? నవ్వకండి.. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపండి” అని అనిరుధ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
రజనీకాంత్ ప్రమేయం.. అసలు నిజం ఏంటి?
ఆ తర్వాత రజనీకాంత్, విజయ్, అజిత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించారు. ఇటీవల వచ్చిన ‘లియో’, ‘ఇండియన్ 2’, ‘వేట్టయాన్’, ‘విడాముయార్చి’, ‘కూలీ’ చిత్రాలతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.
ఇక కావ్య మారన్ విషయానికొస్తే.. భారతదేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన ‘సన్ గ్రూప్’ అధినేత కళానిధి మారన్ కుమార్తె. సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బాధ్యతలను పూర్తిగా తానై చూసుకుంటున్నారు.
కావ్య, అనిరుధ్ పెళ్లి వార్తలపై వై.జీ. మహేంద్రన్ వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఈ హైప్ మరిన్ని సంచలనాలకు దారి తీస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరింత సమాచారం కోసం వేచి ఉండండి!


