|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పాక్ ఆటగాడి ఎంపిక: కావ్యా మారన్‌పై నెటిజన్ల ఆగ్రహం! SRHకు బాయ్‌కాట్ సెగ!!

Published: 13-03-2026, 9:05 AM
పాక్ ఆటగాడి ఎంపిక: కావ్యా మారన్‌పై నెటిజన్ల ఆగ్రహం! SRHకు బాయ్‌కాట్ సెగ!!
  • పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులోకి తీసుకోవడంపై కావ్య మారన్‌పై ట్రోలింగ్.
  • అభిమానులు SRH మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు.
  • అబ్రార్ గతంలో భారత్‌ను కించపరిచే విధంగా చేసిన పోస్టులే దీనికి కారణం.
  • కొందరు క్రీడను రాజకీయం చేయకూడదని అబ్రార్ ప్రతిభను సమర్థిస్తున్నారు.

సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులోకి పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. జట్టు యజమాని కావ్యా మారన్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. SRH మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

అబ్రార్ అహ్మద్ ఎంపికపై వివాదం

పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్‌ను హైద్రాబాదు సన్‌రైజర్స్ లీడ్స్(Sunrisers Leeds) జట్టులోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అబ్రార్ ను కొనుగోలు చేసినందుకు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ ను షేమ్ ఆన్ యూ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు SRH మ్యాచులను IPL నుంచి బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహానికి కారణం ఏమిటి?

ఇంగ్లాండ్‌లో జరగనున్న ‘ది హండ్రెడ్’ (The Hundred) 2026 టోర్నమెంట్ కోసం SRH సిస్టర్ హుడ్ లాంటి సన్‌రైజర్స్ లీడ్స్(Sunrisers Leeds) అనే జట్టును సన్ గ్రూప్ (కావ్య మారన్ కుటుంబం) కొనుగోలు చేసింది. మార్చి 12, 2026న జరిగిన ప్లేయర్ వేలంలో, పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఈ జట్టు రూ. 2.34 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో కావ్య మారన్ స్వయంగా పాల్గొని, కోచ్ డేనియల్ వెట్టోరితో కలిసి బిడ్డింగ్ చేశారు. ట్రెంట్ రాకెట్స్ అనే జట్టుతో గట్టిగా పోరాడి మరి అబ్రార్‌ను సొంతం చేసుకున్నారు. భారత్ – పాక్ మధ్య వివాదాల మూలంగా పాకిస్తాన్ ఆటగాళ్లను భారతీయ యాజమాన్యాలు కొనుగోలు చేయకూడదనే ఒక పద్దతి ఉండేది, కానీ దానిని పక్కన పెట్టి కావ్య మారన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఈ వివాదానికి మూలం అయింది. ఈ వార్త బయటకు రాగానే భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం 2019లో భారత్-పాక్ మధ్య జరిగిన గొడవల సమయంలో, భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను అవమానిస్తూ అబ్రార్ “Fantastic tea” అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా బాలాకోట్ దాడులను ఎగతాళి చేస్తూ కొన్ని వీడియోలు కూడా చేశాడు. దీంతో ఒక “భారత ద్వేషి”కి కావ్య మారన్ ఎలా అవకాశం ఇస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

విమర్శలు, మద్దతు మధ్య సన్‌రైజర్స్ లీడ్స్

సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ SRH అంటూ పిలుపునిస్తున్నారు. అంతేకాదు హ్యాష్ ట్యాగ్ షేమ్ ఆన్ కావ్యా మారన్ అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్స్ సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఎక్స్ అకౌంట్ ను రిపోర్ట్ కొట్టడం వలన జట్టుకు సంబంధించిన ఎక్స్ (X) అకౌంట్ కూడా కొద్దిసేపు నిలిపివేయబడింది. అయితే కొంతమంది మాత్రం క్రికెట్ అనేది ఒక ఆట అని, దానిని రాజకీయం చేయకూడదని అబ్రార్ ప్రతిభను సమర్థిస్తున్నారు. అబ్రార్ కేవలం ఇంగ్లాండ్‌లో జరిగే మ్యాచ్‌లే ఆడతాడు, ఐపీఎల్‌లో ఆడడు. అయినప్పటికీ, భారత్ ను తక్కువగా మాట్లాడిన ఆటగాడికి మన వాళ్లు మద్దతు ఇవ్వడంపై మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విమర్శలపై సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కోచ్ వెట్టోరి స్పందిస్తూ.. అబ్రార్ యూనిక్ బౌలర్ అని, రకరకాల పద్ధతుల్లో బౌలింగ్ చేయగలడు కాబట్టే కొనుగోలు చేశామని వివరణ ఇచ్చాడు.

మొత్తానికి, పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేయడం ద్వారా కావ్య మారన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.