|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Keerthi Bhat: మంచి కలర్‌ ఉండి ఎక్స్‌పోజింగ్‌ చేస్తేనే షోకి పిలుస్తున్నారు

Published: 16-08-2025, 1:16 AM
Keerthi Bhat: మంచి కలర్‌ ఉండి ఎక్స్‌పోజింగ్‌ చేస్తేనే షోకి పిలుస్తున్నారు

బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ తాజాగా టీవీ ఇండస్ట్రీలోని కష్టాల గురించి మాట్లాడారు. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలను ఆమె వెల్లడించారు. షోలకు ఎంపిక ప్రమాణాలు ఆమెను ఆశ్చర్యపరిచాయి.

Key Points

1

కీర్తి భట్ బిగ్ బాస్ షోలో తన అనుభవాలను పంచుకుంది.

2

టీవీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్, ఇతర సమస్యలను ఎదుర్కొన్న విషయాన్ని వెల్లడించింది.

4

ఈ మూడు అంశాలు లేకుండా టీవీ షోలలో అవకాశాలు రావడం కష్టమని అభిప్రాయపడింది.

కీర్తి భట్ యొక్క బిగ్ బాస్ అనుభవం

కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతుంటాయంటుంటారు. కానీ బిగ్‌బాస్‌ బ్యూటీ, కన్నడ నటి కీర్తి భట్‌ ( Keerthi Bhat ) జీవితంలో మాత్రం అవి ఫ్యామిలీ మెంబర్స్‌లా తిష్ట వేశాయి. యాక్సిడెంట్‌లో కన్నవాళ్లను పోగొట్టుకుని చావు చివరి అంచుల వరకు వెళ్లొచ్చింది కీర్తి. జీవితంలో తల్లయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది. తనొక అనాధ అని ప్రియుడు వదిలేయడంతో కుంగిపోయింది. ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్‌ చేసింది. వాటిని దాటుకుని సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది.

నన్ను పిలవలేదు తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ఫైనలిస్టుగా నిలిచింది. తాజాగా ఆమె ప్రస్తుతం టీవీ ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి ఓపెన్‌ అయింది. బిగ్‌బాస్‌ 6 అయిపోయాక BB అవార్డ్స్‌ అని ఓ కార్యక్రమం చేశారు. అందులో టాప్‌ 3లో ఉన్న నేను, టాప్‌ 5లో ఉన్న రోహిత్‌ లేము. కానీ, టాప్‌ 10లో, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవాళ్లందరూ ఉన్నారు. మమ్మల్నెందుకు పిలవలేదో అర్థం కాలేదు.

టీవీ ఇండస్ట్రీలోని సవాళ్లు

కలర్‌ చూస్తున్నారు వాళ్లు పిలిస్తే వెళ్తాం కానీ, అడిగి మరీ వెళ్లలేం కదా! తర్వాత నాకర్థమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మూడు రూల్స్‌ కచ్చితంగా ఫాలో కావాలి. ఒకటి.. నోటికొచ్చినట్లు మాట్లాడి కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి. రెండు.. మోడ్రన్‌గా ఉండాలి, ఎక్స్‌పోజ్‌ చేయాలి. మూడు.. కలర్‌ బాగుండాలి. ఈ మూడు క్వాలిటీస్‌ ఉంటే షోలతో బిజీగా ఉండొచ్చు. అవి నా వల్ల కాదు అని కీర్తి చెప్పుకొచ్చింది.

షోలకు ఎంపిక ప్రమాణాలు

చివరగా, కీర్తి భట్ తన అనుభవాలను పంచుకోవడం ద్వారా టీవీ ఇండస్ట్రీలోని నిజస్థితిని వెల్లడించారు. ఆమె మాటలు చాలా ఆలోచింపజేస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.