|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఫీమెల్ యాక్టర్స్‌‌కు కూడా ఆ స్టామినా ఉంటుంది.. అందుకే వారికి డబ్బులు ఎక్కువ ఇస్తారు.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 23-06-2025, 3:54 AM

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, తన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ ప్రమోషన్లలో భాగంగా, మహిళా నటులకు సమాన వేతనం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Key Points

1

కీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు' చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్నారు.

2

ఆమె ఈక్వల్ పే గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

4

హీరోయిన్లు కూడా థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురాగల స్టామినాను కలిగి ఉంటారని ఆమె పేర్కొన్నారు.

ఉప్పు కప్పురంబు ప్రమోషన్లు

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh), హీరో సుహాస్(Suhas) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’(Uppu Kappurambu). ఐవీ శశి దర్శకత్వంలో రూపొందిన ఈ సెటైరికల్ కామెడీ డ్రామాను రాధిక ఎల్ నిర్మించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో జూలై 4 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నేరుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈక్వల్ పే గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘రెమ్యునరేషన్ అనేది మహిళలు – మగవాళ్లకు సంబంధించినది కాదు. ఇందులోకి ఈ క్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్థం కాదు.

ఒక మేల్ యాక్టర్ థియేటర్‌కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫిమేల్ యాక్టర్‌కి కూడా ఉందంటే ఇవ్వొచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్‌కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు. ఈ హీరోయిన్‌తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వొచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్‌కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్‌కి తీసుకొస్తే ఇవ్వొచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు’ అని తెలిపింది. ప్రస్తుతం కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కీర్తి సురేష్ వ్యాఖ్యలు

ఈక్వల్ పే చర్చ

చివరగా, కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని ఈక్వల్ పే చర్చకు మరో కోణాన్ని అందించాయి. నటీనటుల మార్కెట్ విలువ ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.