|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Keerthy Suresh: ‘వెయిట్ గందరగోళం ఇప్పుడే మొదలైంది’.. నెట్టింట వైరలవుతోన్న నటి కీర్తి సురేష్ పోస్ట్

Published: 21-06-2025, 8:06 AM

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ తన తాజా చిత్రం ‘ఉప్పు కప్పురంబు’ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘వెయిట్ గందరగోళం ఇప్పుడే మొదలైంది’ అంటూ ఆమె పోస్ట్ చేయడంతో నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది. జులై 4న ఈ సినిమా OTT లో విడుదల కానుంది.

కీర్తి సురేష్ వైరల్ పోస్ట్

టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. ఇకపోతే కీర్తి సురేష్.. త్వరలో ఉప్పు కప్పురంబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం జులై 4వ తేదీన తెలుగుతో పాటు కన్నడ, తమిళం మలయాళం, హిందీ భాషల్లో ఒటిటిలో స్ట్రీమింగ్ అన్ననుందని మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

ఉప్పు కప్పురంబు సినిమా ప్రమోషన్స్

ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుపుతున్నారు మూవీ టీమ్. అయితే ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కూడా పలు పోస్టులతో నెటిజన్లలో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఉప్పు కప్పు రంబు సినిమా పోస్టర్‌ను పంచుకుని.. ‘‘ఇంకా ఆగండి, గందరగోళం ఇప్పుడే మొదలైంది. ఉప్పు కప్పురంబు సినిమా జులై 4 వ తేదీన స్ట్రీమింగ్ అవ్వనుంది’’ అని పంచుకుంది.

జులై 4న OTT విడుదల

ఇకపోతే కీర్తి సురేష్ మహానటి వంట బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుతంగా నటించి.. జనాలకు కన్నీళ్లు తెప్పించింది. వీటితో పాటుగా మిస్ ఇండియా వంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో కూడా నటించింది. అలాగే కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా.. బాలీవుడ్‌లో కూడా తన అదృష్టం పరిక్షించుకుంది. instagram link

కీర్తి సురేష్ యొక్క ఉప్పు కప్పురంబు సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. నెట్టింట ఆమె పోస్ట్ వైరల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. జులై 4న OTT లో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.