|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కీర్తి సురేష్: పువ్వుకే అందా? అసలు సిసలైన అందం చూడండి! వైరల్ వీడియో షేక్!

Published: 17-02-2026, 4:35 AM
  • కీర్తి సురేష్‌కు తమిళనాడు ప్రభుత్వం ఫిలిం అవార్డు ప్రదానం!
  • అవార్డు ఫంక్షన్‌లో కీర్తి ట్రెడిషినల్ లుక్ అదిరింది, చీరలో మైమరపించే అందం!
  • కీర్తి క్యూట్ రియాక్షన్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు, వీడియో వైరల్!
  • రాష్ట్ర అవార్డు ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కీర్తి సురేష్!

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె రీసెంట్‌గా చేసిన ఒక క్యూట్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

అవార్డు అందుకున్న కీర్తి సురేష్

సౌత్ స్టార్ హీరోయిన్  కీర్తి సురేష్ రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వ ఫిలిం అవార్డు అందుకున్నారు ఈ ఈవెంట్ కు వెళ్లడానికి  తన ఇంటి నుంచి బయలుదేరిన  సమయంలో.. జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవార్డు ఫంక్షన్ కు అద్భుతంగా రెడీ అయ్యి వెళ్లింది కీర్తి.  చీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని ట్రెడిషినల్ లుక్ లో కనిపించింది. ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కబోతున్న కీర్తిని చూసి.. ఓ అభిమాని ‘పువ్వు సూపర్’ అని కామెంట్ చేశాడు.

వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

ఆ మాట విన్న కీర్తి.. ‘పువ్వు బాగుందా? నా లుక్ ఎలా ఉందో చెప్పు’ అని సరదాగా బదులిచ్చింది. ఆమె క్యూట్ రియాక్షన్‌కు సంబంధించిన ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.

Keerthy Suresh (@keerthysureshofficial) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

ట్రెడిషనల్ లుక్‌లో కీర్తి మెరుపులు

అవార్డు అందుకున్న తర్వాత కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు: “నాకు మొదటి రాష్ట్ర అవార్డును అందించిన తమిళనాడు ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, ఎల్లప్పుడూ అండగా నిలిచిన నా సహోద్యోగులు, సాంకేతిక నిపుణులు, నా బృందానికి ధన్యవాదాలు. అలాగే, అవార్డు గెలుచుకున్న వారందరికీ నా ప్రేమ, అభినందనలు.”

Keerthy Suresh (@keerthysureshofficial) ద్వారా భాగస్వామ్యం చేయబడిన పోస్ట్

కీర్తి సురేష్ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.