|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Keerthy Suresh : రెమ్యునరేషన్స్ లో ఈక్వల్ పే.. సమంతకు కౌంటర్ ఇచ్చిన కీర్తి సురేష్..? జనాల్ని ఎవరు రప్పిస్తే వాళ్ళకే..

Published: 22-06-2025, 10:45 AM

తాజాగా, సమంత ఈక్వల్ పే గురించి చేసిన వ్యాఖ్యలకు కీర్తి సురేష్ స్పందించారు. నటుల మార్కెట్ విలువను బట్టి రెమ్యునరేషన్ నిర్ణయించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Key Points

1

సమంత ఈక్వల్ పే విషయంపై చేసిన వ్యాఖ్యలకు కీర్తి సురేష్ స్పందించారు.

2

కీర్తి సురేష్ మార్కెట్ విలువను బట్టి రెమ్యునరేషన్ నిర్ణయించాలని అన్నారు.

4

కీర్తి సురేష్ వ్యాఖ్యలు సమంతకు కౌంటర్ అని చర్చ జరుగుతోంది.

సమంత వ్యాఖ్యలు మరియు చర్చ

Keerthy Suresh : ఇటీవల రెమ్యునరేషన్స్ విషయంలో సమంత ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఒకే రెమ్యునరేషన్స్ ఇస్తాను, నా నిర్మాణ సంస్థలో అలాగే ఇస్తాను, అందరూ అలాగే ఇస్తే బాగుంటుంది అని శుభం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడింది. ఈ విషయం అప్పుడు బాగా చర్చగా మారింది. అయితే గతంలోనే అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సైతం థియేటర్స్ కి జనాల్ని రప్పించేవారికే రెమ్యునరేషన్ ఇస్తారు. మార్కెట్ బేస్ చేసుకొని రెమ్యునరేషన్స్ ఇస్తారు. ఇందులో ఆడ – మగ అనే తేడా ఉండదు. అందరికి ఈక్వల్ పే అంటే ఒక లైట్ బాయ్ జనాల్ని తెప్పించలేడు కదా అని క్లారిటీ ఇచ్చారు.

సమంత రెమ్యునరేషన్స్ ఈక్వల్ పే అని చెప్పడంతో మరోసారి చర్చగా మారింది. తాజాగా కీర్తి సురేష్ ఈ ఈక్వల్ పే గురించి మాట్లాడింది. కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు సినిమాతో జులై 4 న అమెజాన్ ఓటీటీలోకి రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా 10 టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

కీర్తి సురేష్ స్పందన

ఈ ఇంటర్వ్యూ లో ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి అడగ్గా కీర్తి సురేష్ స్పందిస్తూ.. రెమ్యునరేషన్ అనేది మహిళలు – మగవాళ్లకు సంబంధించింది కాదు. ఇందులోకి ఈక్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్ధం కాదు. ఒక మేల్ యాక్టర్ థియేటర్ కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫీమేల్ యాక్టర్ కి కూడా ఉందంటే ఇవ్వొచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్ కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు. ఈ హీరోయిన్ తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వొచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్ కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్ కి తీసుకొస్తే ఇవ్వొచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు అని తెలిపింది.

మార్కెట్ విలువ మరియు రెమ్యునరేషన్

దీంతో కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా కీర్తి నిజం చెప్పింది, రియాలిటీ అర్ధం చేసుకుంది అని ఆమెని అభినందిస్తూ ఇది సమంతకు కౌంటర్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Also See : Meenaakshi Chaudhary : హాట్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి..

చివరగా, కీర్తి సురేష్ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని రెమ్యునరేషన్ విధానంపై కొత్త చర్చను ప్రారంభించాయి. మార్కెట్ విలువ, ప్రేక్షకుల ఆకర్షణ ప్రధానమని ఆమె స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.