|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్డమ్ కలెక్షన్స్ డే 1.. విజయ్ దేవరకొండ సినిమాకు అదిరిపోయిన ఓపెనింగ్స్.. కెరీర్‌లోనే బెస్ట్.. నార్త్ అమెరికాలో ఎంతంటే?

Published: 31-07-2025, 12:48 PM

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు వసూళ్లు అంచనాలను అందుకుంటున్నాయి. భారతదేశంలోనూ, ఓవర్సీస్‌లోనూ మంచి ఆదరణ లభిస్తోంది.

కింగ్డమ్ సినిమాకు భారీ ఓపెనింగ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. గురువారం అంటే ఇవాళ (జూలై 31) థియేటర్లలో విడుదలైన కింగ్డమ్ ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇంకా ఓవర్సీస్‌లో అంతకుమించి మంచి వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ చెబుతున్నారు.

ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం భారతదేశంలో మొదటి రోజు కింగ్డమ్ సినిమాకు ఇప్పటివరకు రూ. 7.07 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం షోల ఆధారంగా అందిన సమాచారం ఇది. నైట్ షోలు ముగిసిన తర్వాత ఫైనల్ ఫిగర్ బయటకు వస్తుంది.

విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్?

అయితే, కింగ్డమ్ సినిమాకు బుక్ అయిన ప్రీ బుకింగ్స్ ప్రకారం రూ. 11 నుంచి 12 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కాకుండా ఈ ఏడాది మీడియం రేంజ్ హీరోల్లో ఎవరు అందుకోని ఓపెనింగ్ డే కలెక్షన్స్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఇప్పటివరకు కింగ్డమ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 18 నుంచి 20 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని పలు వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి. ఇక విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇప్పటివరకు రూ. 15.95 కలెక్షన్స్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా లైగర్ ఉంది.

ఉత్తర అమెరికా కలెక్షన్స్

ఇప్పుడు కింగ్డమ్ డే1 నాడు రూ. 20 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంటే లైగర్ రికార్డ్‌ను దాటేస్తుంది. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్‌లో ది బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కింగ్డమ్ నిలుస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కింగ్డమ్ సినిమాకు తొలి రోజు ఆక్యుపెన్సీ బాగుంది.

మార్నింగ్ షోలు: 63.56% మధ్యాహ్నం షోలు: 56.52% ఈవెనింగ్ షోలు: 50.12%తో తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్‌కు తొలి రోజు 56.73 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక తమిళ వెర్షన్‌కు మొత్తం 15.67% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. ఇక, ఉత్తర అమెరికాలో కింగ్డమ్ సినిమాకు 650,000 డాలర్లు (రూ.5.42 కోట్లు) గ్రాస్ వసూలు అయింది.

మొత్తంగా, కింగ్డమ్ సినిమా తొలిరోజు వసూళ్లు విజయవంతంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని అంచనా. వరల్డ్ వైడ్ కలెక్షన్స్‌పై అందరి దృష్టి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.