
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు ముందుగా ‘దేవర నాయక’ అనే టైటిల్ నిర్ణయించారు. కానీ, ఎన్టీఆర్ సినిమా టైటిల్ సారూప్యత కారణంగా టైటిల్ మార్చారు. ఈ విషయాలతో పాటు, కింగ్డమ్ పార్ట్ 2 గురించి కూడా విజయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Key Points
కింగ్డమ్ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ 'దేవర నాయక'
ఎన్టీఆర్ సినిమా టైటిల్ తో సమానత కారణంగా టైటిల్ మార్పు
కింగ్డమ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తోంది
కింగ్డమ్ పార్ట్ 2 కు సంబంధించి విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
కింగ్డమ్ చిత్ర టైటిల్ మార్పుకు కారణం ఏమిటి?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంతకాలంగా విజయ్ దేవరకొండకి సరైన సక్సెస్ లేదు. కింగ్డమ్ చిత్రం రిలీజైన తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు వర్కౌట్ కాలేదని అంటున్నప్పటికీ ఓవరాల్ గా మూవీ బాగానే ఉందని ప్రేక్షకులు అంటున్నారు.
ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్ గా 53 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. సినిమా రిలీజ్ తర్వాత కూడా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ కింగ్డమ్ గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు
ఇదే కింగ్డమ్ చిత్రానికి ముందుగా అనుకున్న టైటిల్ దేవర నాయక. వినగానే గూస్ బంప్స్ తెప్పించేలా ఈ టైటిల్ ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ తెగ ప్రజలకు రాజుగా నటించారు. అందుకే దేవర నాయక అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. కానీ అదే టైంలో ఎన్టీఆర్ దేవర మూవీ టైటిల్ కూడా ఫిక్స్ అయింది. రెండు టైటిల్స్ ఒకేలా ఉన్నాయనే ఉద్దేశంతో తాము ఈ చిత్రానికి కింగ్డమ్ అని టైటిల్ మార్చినట్లు తెలిపారు.
అదే విధంగా విజయ్ దేవరకొండ కింగ్డమ్ పార్ట్ 2 గురించి కూడా విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రధానంగా కథ ఉంటుంది. కానీ, ఇందులో దేశభక్తికి సంబంధించిన అంశముంది. అలాగే, ఒక తెగకు చెందిన నాయకుడి గురించి ఉంటుంది. ఇలా ఇన్ని అంశాలను ఒకే భాగంలో చెప్పడం సాధ్యంకాదు. అందుకే రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నాము. తన అన్నయ్య శివ కోసం సూరి చేసిన ప్రయాణాన్ని మొదటి భాగంలో చూశాం. రెండవ భాగానికి సంబంధించి గౌతమ్ దగ్గర గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మొదటి భాగంతో పోలిస్తే రెండవ భాగంగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది.
కింగ్డమ్ పార్ట్ 2 గురించి విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు
డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని చూసి అభినందించినట్లు విజయ్ దేవరకొండ తెలిపారు. సినిమా చూసి సుకుమార్ గారు ఫోన్ చేశారు. సినిమా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. నాకు సుకుమార్ గారంటే ఎంతో ఇష్టం. ఆయన నుంచి ప్రశంస రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని తెలిపారు.
చివరగా, కింగ్డమ్ చిత్రం విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తోంది, మరియు దాని రెండవ భాగం ఇంకా అద్భుతంగా ఉంటుందని విజయ్ దేవరకొండ తెలిపారు. దేవర నాయక టైటిల్ ఎంపిక మరియు మార్పు వెనుక కథ ఆసక్తికరంగా ఉంది.
