
📌 Key Points
- ఒక్క హిట్ రాగానే కిరణ్ అబ్బవరం డైరెక్షన్ చేయడంపై విమర్శలు.
- దర్శకులను ఇబ్బంది పెడతాడని కిరణ్ పై ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
- భీమ్స్ సిసిరోలియో వంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తో రిస్క్ చేస్తున్నాడని అభిప్రాయం.
- గతంలో చాలా మంది హీరోలు డైరెక్షన్ చేసి చేతులు కాల్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.
టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్న కిరణ్ అబ్బవరం, దర్శకత్వం వైపు అడుగులు వేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పలువురు సినీ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. అతనికి ఇది సరైన నిర్ణయమా కాదా అనే చర్చ జరుగుతోంది.
కిరణ్ అబ్బవరం డైరెక్షన్ సాహసం?
Kiran abbavaram: టాలీవుడ్‌లో కొందరు హీరోలకు ఒక్క హిట్ తగిలితే చాలు.. తామేదో జేమ్స్ కామెరాన్ అయిపోయినట్లు ఫీలవుతుంటారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం తీరు కూడా అలాగే ఉందంటూ ఫిలిం నగర్ గుసగుసలాడుతోంది. నటుడిగా ఇంకా ఓనమాలు కూడా పూర్తిగా నేర్చుకోకముందే, ఇప్పుడు ఏకంగా ‘డైరెక్టర్’ క్యాప్ పెట్టుకుంటాననడం చూస్తుంటే.. అబ్బవరం గారి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
హీరోగా ఫెయిల్ అవుతున్నాడనే భయమా? వరుస డిజాస్టర్లతో కెరీర్ క్లోజ్ అయిపోతుందనుకున్న టైమ్‌లో ‘క’ సినిమా కిరణ్‌ను గట్టెక్కించింది. నిజానికి ఆ సినిమా ఆడింది అందులోని కంటెంట్ వల్ల తప్ప, కిరణ్ అబ్బవరం నటన వల్ల కాదన్నది చేదు నిజం. ఆ క్రెడిట్ అంతా దర్శకులకే వెళ్లాలి. కానీ, కిరణ్ మాత్రం ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకుని, ఇప్పుడు తానే ఒక భారీ సినిమాను డైరెక్ట్ చేస్తానంటూ మేకర్స్‌ను ఇబ్బంది పెడుతున్నాడట. ‘హీరోగా మార్కెట్ ఎప్పుడైనా పడిపోవచ్చు.. అందుకే ఇప్పుడే డైరెక్టర్ ముద్ర వేయించుకుందాం’ అనే ప్లాన్ లో ఉన్నాడా? అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
ఇండస్ట్రీలో కిరణ్ పై విమర్శలు
స్క్రిప్టుల్లో వేలు పెట్టడం చాలదా? ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం గురించి ఒక బ్యాడ్ టాక్ ఉంది.. అదేంటంటే, తనతో సినిమా చేసే ఏ దర్శకుడిని కూడా ఆయన ప్రశాంతంగా పని చేయనివ్వడని, ప్రతి సీన్ లోనూ వేలు పెడతాడని టాక్. ఇప్పుడు ఏకంగా తానే డైరెక్టర్ అంటే, ఇక సెట్స్ మీద మిగతా టెక్నీషియన్ల పరిస్థితి ‘అగమ్యగోచరం’ అన్నమాట. తన సినిమాలకు తానే ప్రొడ్యూసర్, తానే హీరో, ఇప్పుడు తానే డైరెక్టర్.. అంటే ఇక మిగతా వాళ్ళు అక్కడ ఎందుకు? కేవలం అబ్బవరం గారి భజన చేయడానికేనా?
భీమ్స్ లాంటి హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌తో రిస్క్ ఈ సినిమాకు హిట్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోను తీసుకుంటున్నారట. అసలే భీమ్స్ ఇప్పుడు టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకుని, కిరణ్ అబ్బవరం డైరెక్షన్ ప్రయోగాలు చేయడం అంటే.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కెరీర్‌ను కూడా రిస్క్‌లో పడేయడమే. నటుడిగా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది కొండంత ఉంటే, ఈ డైరెక్షన్ పిల్లిమొగ్గలు ఎందుకు? అన్నది సినీ విశ్లేషకుల ప్రశ్న.
భీమ్స్ కెరీర్‌ను రిస్క్‌లో పెడుతున్నాడా?
అతి సర్వత్ర వర్జయేత్ గతంలో చాలా మంది హీరోలు ఇలాగే ‘నేనూ డైరెక్టర్‌నే’ అని ఫీలయ్యి చేతులు కాల్చుకున్నారు. కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న టైమ్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంటే స్వయంకృతాపరాధమే. కిరణ్ అబ్బవరం నటుడిగా దృష్టి పెడితే మంచిది, లేదంటే డైరెక్టర్ అవ్వాలనే పిచ్చితో అటు హీరోగా ఉన్న గుర్తింపు కూడా పోగొట్టుకోవడం ఖాయం!
మొత్తానికి కిరణ్ అబ్బవరం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే కిరణ్ రేంజ్ మారిపోతుంది. లేదంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది.


