
📌 Key Points
- కిరణ్ అబ్బవరం: వరుస విజయాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
- చెన్నై లవ్ స్టోరీకి పారితోషికం వదులుకున్న కిరణ్ నిర్ణయం సంచలనం!
- సుకుమార్ నిర్మాణంలో కిరణ్ అబ్బవరం సినిమా – భారీ అంచనాలు!
- అమెజాన్ వెబ్ సిరీస్‌లో మెరవనున్న కిరణ్ అబ్బవరం – బాలీవుడ్‌లోనూ ఎంట్రీ!
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ హీరో తన రెమ్యునరేషన్ పెంచేశాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
కిరణ్ అబ్బవరం కొత్త రెమ్యునరేషన్ ఎంత?
Kiran Abbavaram : యంగ్ హీరోలలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం మినిమమ్ గ్యారెంటీ హీరో. ఇటీవలే క, కె ర్యాంప్ సినిమాలతో పెద్ద హిట్స్ కొట్టాడు. దీంతో కిరణ్ మార్కెట్ పెరగడమే కాకుండా వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. మరో పక్క నిర్మాతగా కూడా మారి కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు.(Kiran Abbavaram)
తాజాగా కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ పెంచేసాడని టాక్ నడుస్తుంది. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సినిమాకు 5 కోట్లు అడుగుతున్నాడని టాలీవుడ్ టాక్. మొన్నటి వరకు మూడు కోట్లే తీసుకున్నాడని, ఇప్పుడు అయిదు కోట్లు అడుగుతున్నాడని పలువురు నిర్మాతలు అనుకుంటున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం సినిమా బడ్జెట్ కూడా కాస్త పెరిగిపోతుంది.
సుకుమార్ నిర్మాణంలో కిరణ్ సినిమా విశేషాలు
అయితే కిరణ్ నుంచి రాబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మాత్రం రెమ్యునరేషన్ తీసుకోలేదని ఉన్నప్పుడే ఇమ్మన్నాడని, లేదా ప్రాఫిట్స్ వచ్చాక తీసుకుంటాడని నిర్మాత SKN స్వయంగా చెప్పాడు.
చెన్నై లవ్ స్టోరీ నుండి భారీ అంచనాలు
ఇక కిరణ్ అబ్బవరం లైనప్ లో చెన్నై లవ్ స్టోరీ సినిమా, సుకుమార్ నిర్మాణంలో ఒక సినిమా, అమెజాన్ కి ఒక వెబ్ సిరీస్, బాలీవుడ్ సినిమా ఒకటి, కిరణ్ అబ్బవరం సొంత డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఇలా ఆల్మోస్ట్ అరడజను సినిమాలు లైనప్ లో ఉన్నాయి కిరణ్ అబ్బవరంకి. అయినా వరుస ఫ్లాప్ లు ఇస్తున్న మీడియం రేంజ్ హీరోలే 7 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు కిరణ్ 5 కోట్లు తీసుకుంటే తప్పు లేదు అని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.


