|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిరణ్ అబ్బవరం కొడుకు మొదటి ఫొటోషూట్.. ఆకట్టుకుంటోన్న రహస్య క్యూట్ పోస్ట్

Published: 30-06-2025, 10:22 AM
కిరణ్ అబ్బవరం కొడుకు మొదటి ఫొటోషూట్.. ఆకట్టుకుంటోన్న రహస్య క్యూట్ పోస్ట్

టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం మరియు ఆయన భార్య రహస్య గోరక్ కుటుంబ జీవితంపై అభిమానుల ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. తాజాగా, వారి కొడుకు మొదటి ఫొటోషూట్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

కిరణ్ అబ్బవరం కొడుకు మొదటి ఫొటోషూట్ వీడియో రిలీజ్!

2

రహస్య గోరక్ క్యూట్ ఫ్యామిలీ వీడియోను షేర్ చేసింది.

4

కిరణ్ అబ్బవరం-రహస్య గోరక్ దంపతుల కుటుంబ జీవితం ఆకట్టుకుంటోంది.

కిరణ్ అబ్బవరం కుటుంబం

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో 2024 లో రహస్య గోరక్‌ను ఆగస్టు 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారు 2025 మే 22న ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ రాజా వారు రాణి వారు చిత్రంలో నటించారు. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ తమ మొదటి సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి వరకు వెళ్లింది.

మొదటి ఫొటోషూట్ వీడియో

కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ లకు ఇది మొదటి సంతానంగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను వారు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హనుమాన్ జయంతి రోజున తమ ఇంట్లోకి బిడ్డ అడుగు పెట్టాడని కిరణ్ అబ్బవరం వెల్లడించాడు. అయితే ఇప్పటికే కిరణ్ తన కొడుకు ఫొటోలను ఫేస్ కనిపించకుడా.. అతని తన కొడుకు పాదాలను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోను పంచుకున్నాడు.

నెటిజన్ల స్పందన

అయితే తాజాగా రహస్య తన క్యూట్ ఫ్యామిలీ వీడియోను పంచుకుంది. ‘‘మా ఇటీవలి జీవితం. నా కొడుకు మొదటి ఫోటోషూట్’’ అని క్యాప్షన్ రాసుకొచ్చి క్యూట్ వీడియో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. instagram link

కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరక్ దంపతుల కుటుంబానికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం, సుఖం లభించాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.