
కిరణ్ అబ్బవరం మరో అడుగు ముందుకేశాడు! హీరో, నిర్మాతగా సత్తా చాటిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారాడు. KA13 వర్కింగ్ టైటిల్తో వచ్చిన మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
Key Points
కిరణ్ అబ్బవరం 'KA13'తో దర్శకుడిగా అరంగేట్రం
జూలై 24న 'చెన్నై లవ్ స్టోరీ' రిలీజ్
దేవిక భట్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా
సుధాకర్ చాగంటి నిర్మాణంలో జాయ్ ఫిలిమ్స్ బ్యానర్
కిరణ్ అబ్బవరం దర్శకుడిగా మార్పు
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం ప్రస్తుతం హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే హీరోగా, నిర్మాతగా సక్సెస్ చూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు దర్శకుడిగా మారాడు. కిరణ్ ఈ నెల జులై 24న చెన్నై లవ్ స్టోరీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నేడు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు.
KA13 మేకింగ్ వీడియో విడుదల
KA13 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటిస్తూ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం దర్శకుడిగా మారడం విశేషం. మేకింగ్ వీడియోలో ఓ పక్క నటిస్తూనే మరో పక్క దర్శకత్వ భాద్యతలు చూసుకుంటున్నాడు కిరణ్. జాయ్ ఫిలిమ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా ఈ సినిమాలో నటిస్తూ దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. కన్నడ భామ దేవిక భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
చెన్నై లవ్ స్టోరీ అప్డేట్
ఈ మేకింగ్ వీడియో చూస్తే ఇదేదో పొలిటికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. మరి హీరోగా, నిర్మాతగా సక్సెస్ అయిన కిరణ్ అబ్బవరం త్వరలో దర్శకుడిగా ఎలా మెప్పిస్తాడా చూడాలి. మీరు కూడా ఆ మేకింగ్ వీడియో చూసేయండి..
కిరణ్ అబ్బవరం తన బర్త్డే సందర్భంగా ఈ మేకింగ్ వీడియో విడుదల చేసి అభిమానులకు శుభవార్త తెలిపారు. ఇక ముందు మరిన్ని అప్డేట్స్ కోసం ఎదురుచూద్దాం!


