|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కిష్కింధపురి ప్రీమియర్ రివ్యూ.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హారర్ థ్రిల్లర్ మూవీపై ఆడియెన్స్ టాక్!

Published: 11-09-2025, 2:49 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం కిష్కింధపురి. నిన్న రాత్రి జరిగిన ప్రీమియర్ షో తర్వాత ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలోని కథ, నటన, మరియు బీజీఎమ్ గురించి తెలుసుకుందాం.

Key Points

1

కిష్కింధపురి ప్రీమియర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.

2

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటనకు ప్రశంసలు.

3

మొదటి 10 నిమిషాల తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది.

4

ఎం.ఆర్. రాజా కృష్ణన్ బీజీఎమ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

ప్రేక్షకుల స్పందన

తెలుగులో హారర్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రాక్షసుడు సినిమా తర్వాత మరోసారి జంటగా నటించిన మూవీ కిష్కింధపురి. ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు.

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాహు గారపాటి కిష్కింధపురి చిత్రాన్ని నిర్మించారు. అయితే, హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన కిష్కింధపురి సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

ఇక సెప్టెంబర్ 12న అంటే రేపు కిష్కింధపురి సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి (సెప్టెంబర్ 10) హైదరాబాద్‌లోని ఏఏఏ ముల్టీప్లెక్స్‌లో కిష్కింధపురి ప్రీమియర్ షోలు ప్రదర్శించారు.

నటీనటుల ప్రదర్శన

కిష్కిందపురి ప్రీమియర్స్ వీక్షించిన ఆడియెన్స్ రివ్యూ లు ఇచ్చారు. మరి ఈ సినిమా చుసిన ఆడియెన్స్ టాక్ ఎలా ఉందంటే.. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైమ్ తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ, భయపెట్టేసాడు అని చెప్పారు.

ఫస్టాఫ్‌ను ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్‌ను తెరపై అంతే చక్కగా ప్రజంట్ చేశాడట. ఇక సెకెండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్పింగ్‌గా హారర్ ఎలిమెంట్స్‌ని ఎక్కడ తక్కువ చేయకుండా అదరగొట్టాడు డైరెక్టర్ అని ప్రశంసిస్తున్నారు ప్రేక్షకులు.

తమిళ నటుడు శాండ నటన గూస్‌బంప్స్ తెప్పిస్తాయని, బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఈ జానర్ బాగా సెట్ అయిందని చెబుతున్నారు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సూపర్‌గా నటించి మెప్పించాడు. అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు కిష్కింధపురి సినిమాతో మరో సూపర్ హిట్ దక్కుతుందని ఆడియెన్స్ టాక్‌లో వినిపిస్తోంది.

కథా నేపథ్యం

అలాగే, కిష్కింధపురి క్లైమాక్స్‌లో అనుపమ పరమేశ్వరన్ పర్ఫామెన్స్ సూపర్ అని టాక్ నడుస్తోంది. థ్రిల్లర్ ఎపిసోడ్స్, స్టోరీ నెరేషన్ చాలా బాగుందని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీజీఎమ్ గురించి అంటున్నారు. ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన బీజీఎమ్ హారర్ సినిమాను సౌండ్‌తో ఎంత మ్యాజిక్ చేయచ్చో అంత చేసినట్లు చెబుతున్నారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే కిష్కింధపురి సినిమా ఆడియెన్స్‌ను భయపెడుతూ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టి మరి అలరిస్తుందని టాక్ వస్తోంది. అంతేకాకుండా కిష్కింధపురి పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ సైతం చాలా బాగుందని అంటున్నారు.

మొత్తంమీద, కిష్కింధపురి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉందని ప్రీమియర్ రివ్యూలు సూచిస్తున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ల నటన, కథనం, బీజీఎమ్ ప్రేక్షకులను అలరించాయని తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.