|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Komati Reddy On Tollywood: నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలి: కోమటిరెడ్డి

Published: 11-08-2025, 10:12 AM
Komati Reddy On Tollywood: నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలి: కోమటిరెడ్డి

టాలీవుడ్‌లోని కార్మికుల సమస్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి మంత్రి కీలక సూచనలు చేశారు.

Key Points

1

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్మికుల పక్షానే ఉన్నారని ప్రకటించారు.

2

నిర్మాతల సమస్యను అర్థం చేసుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్‌కు సూచించారు.

4

సమ్మెల వల్ల చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు.

కోమటిరెడ్డి, ఫిల్మ్ ఫెడరేషన్‌తో చర్చలు

తాము ఎప్పటికీ కార్మికుల పక్షానే ఉంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు . పట్టు , విడుపులు వదిలిపెట్టి సమస్యను పరిష్కరించుకోవాలని ఫిల్మ్ ఫెడరేషన్ ‌ ప్రతినిధులకు సూచించారు . నిర్మాతల సమస్యను కూడా అర్థం చేసుకోవాలని .. మొండి పట్టుదలకు పోతే మీరే నష్టపోతారని తెలిపారు . టాలీవుడ్ ‌ లో నెలకొన్న సమస్యపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి సమావేశమయ్యారు .

విడతలవారీగా వేతనాల పెంపుకు అంగీకరించాలని నిర్మాతల మండలికి మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు . రేపు మరోసారి ఫిలిం ఛాంబర్ ‌ లో కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు . మీరు సమ్మె చేస్తే చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుందని .. మీరు నిర్మాతల మండలి కలిసి కమిటీగా ఏర్పాటు కావాలన్నారు . ఒకే సారి పెంచాలంటే ఎవరికైనా ఇబ్బందేనని .. వెంటనే సమ్మెలు విరమించి పనిలోకి దిగాలని మంత్రి కోరారు . ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు .

వేతనాల పెంపుపై నిర్ణయం

మా పరిస్థితి వివరించాం : ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు

సమ్మెలను విరమించాలని విజ్ఞప్తి

మా పరిస్థితిని మంత్రికి వివరించామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు . పలు అంశాలకు మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మేము చెప్పిన సమస్యలపై నిర్మాతలతో మంత్రి ఫోన్ చేసి మాట్లాడారని వెల్లడించారు . రేపటి సమావేశానికి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ వస్తానని చెప్పారని .. ఫిల్మ్ ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు . రేపటి భేటీలో మా తరపున కమిటీ సభ్యులు హాజరవుతారని తెలిపారు .

చివరగా, మంత్రి కోమటిరెడ్డి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రేపటి సమావేశం సానుకూల ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.