
రజినీకాంత్ మరియు అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “కూలీ” ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజునే భారీ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది.
Key Points
రజినీకాంత్, నాగార్జున నటించిన "కూలీ" సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది.
మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అంచనా.
ఎన్టీఆర్ సినిమాతో పోటీలో "కూలీ" సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.
మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
కూలీ సినిమా భారీ ఓపెనింగ్
సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “కూలీ” . ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమా మొదటి రోజే గ్రాండ్ బాక్సాఫీస్ కలెక్షన్లు నమోదు చేసింది. దాంతో అటు తలైవా ఫ్యాన్స్, ఇటు కింగ్ నాగార్జున ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కూలీ సినిమాలో స్టార్ కాస్ట్ ఎక్కువగా ఉండటం. రజినీకాంత్, నాగర్జున ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా 2 సినిమాకు రిలీజ్‌కు ముందే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాని కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సుమారు 80 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు ట్రేడ్ సర్కిల్స్ నుంచి సమాచారం. ఇది విడుదలకు ముందే సినిమా పట్ల ఉన్న అంచనాలను హైలైట్ చేస్తోంది.
కూలీ సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో అన్ని భాషల నుంచి స్టార్స్ మంచి మంచి పాత్రల్లో నటించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు విలన్ సైమన్ పాత్రలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించగా.. మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్ రంగంలోకి దిగారు. ఇక తమిళం నుంచి సత్యరాజ్, శృతీ హాసన్ లాంటి స్టార్స్ ఉండనే ఉన్నారు. అందరితో కలిసి మాస్ యాక్షన్ ట్రీట్ ను ఫ్యాన్స్ కు అందించాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. దాంతో ఈమూవీ ఫస్ట్ డేనే బాక్సా ఫీస్ దగ్గర రెచ్చిపోయింది.
తెలుగు రాష్ట్రాలు: ₹10 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
ఇతర ప్రాంతాలు (ఇండియా): ₹5 కోట్లు
ఓవర్సీస్ (అంతర్జాతీయంగా): ₹25 కోట్లు (అందులో అమెరికా లోనే $3 మిలియన్ అంటే ₹25 కోట్లకు పైగా)
ఇక కోలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం, కూలీ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు అంచనా వేయబడింది. ఇది రజినీకాంత్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లలో ఒకటిగా నిలవనుంది. ఈ అంచనాలపై ఇంకా మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్న ప్రిలిమినరీ డేటా ప్రకారం, సినిమా వసూళ్లు రికార్డులు తిరగరాస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి అధికారిక లెక్కలు ఎలా ఉంటాయి అనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ సినిమాతో పోటీ
కూలీ రిలీజ్ అయిన అదే రోజున విడుదలైన ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కలసి నటించిన వార్ 2 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. అయితే కూలీ కలెక్షన్స్ ను మాత్రం వార్ 2 క్రాస్ చేయలేకపోయింది. వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ అంచనాలు సూచిస్తున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూలీ 75 కోట్లు కలెక్ట్ చేయగా, వార్ 2 25 కోట్లకు పరిమితమైంది. కాని తెలుగులో వార్ 2 సినిమా ఫస్ట్ డే 30 కోట్లు కలెక్ట్ చేస్తే.. కూలీ 10 కోట్లకే పరిమితం అయ్యింది.
అయితే ఈ రెండు సినిమాలకు కలిసొచ్చిన అంశం ఏంటంటే.. వీటికి ఇప్పట్లో పోటీ వచ్చే సినిమాలు లేవు. దాంతో పాటు ఈ వారం మధ్యలో ఇండిపెండెన్స్ డే హాలిడే ఉండటంతో పాటు లాంగ్ వీకెండ్, శుక్రవారం, శనివారం, ఆదివారం మూడు రోజులు సెలవులు రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. దాంతో రెండు సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరకంగా ఈ నాలుగు రోజుల్లో కూలీ, వార్ 2 సినిమాలకు కలెక్షన్ల పండ పండబోతున్నట్టు అర్ధం అవుతోంది. మరి లాంగ్ రన్ లో కూలీ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.
మొత్తంమీద, కూలీ సినిమా మొదటి రోజు వసూళ్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అధికారిక లెక్కలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. ఎన్టీఆర్ సినిమాతో పోటీలో కూలీ ఎలా నిలుస్తుందో చూడాలి.


