|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కొరటాల శివకు ఎదురుదెబ్బ! స్టార్ హీరోలంతా హ్యాండ్ ఇవ్వడానికి కారణమిదేనా?

Published: 24-03-2026, 1:35 AM
కొరటాల శివకు ఎదురుదెబ్బ! స్టార్ హీరోలంతా హ్యాండ్ ఇవ్వడానికి కారణమిదేనా?
  • దేవర సక్సెస్ క్రెడిట్ తారక్‌దే కావడంతో కొరటాల మేకింగ్‌కు గుర్తింపు రాలేదు.
  • బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కొరటాల కథలకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.
  • నాగచైతన్య 25వ సినిమా కొరటాల దర్శకత్వంలో ఉండొచ్చనే వార్తలు వచ్చినా, ప్రాజెక్ట్ ఆగిపోయింది.
  • ప్రస్తుతం కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్‌పైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన కొరటాల శివ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దేవర సినిమా విజయం సాధించినా, ఆయనకు తగిన గుర్తింపు రాలేదు. దీంతో ఆయన తదుపరి ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నారు.

బాలయ్య, పవన్ కళ్యాణ్ నో చెప్పడానికి కారణం?

Koratala Crisis : టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒకప్పుడు ‘వరుస హిట్ల మెషిన్’ అని పిలిపించుకున్న కొరటాల శివ , ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ‘లో ఫేజ్’ను ఫేస్ చేస్తున్నారు. ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసినా, ఆ సక్సెస్ క్రెడిట్ మొత్తం తారక్ మాస్ ఇమేజ్‌కే వెళ్ళిపోయింది తప్ప, కొరటాల మేకింగ్‌కు దక్కిన క్రెడిట్ మాత్రం  జీరో. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. కొరటాల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరోల చుట్టూ తిరుగుతుంటే, అందరూ ఇన్ డైరెక్ట్‌గా ‘సీన్ లేదు బ్రో’ అని చెప్పేస్తున్నారట.

బాలయ్య & పవన్ .. అసలు అపాయింట్‌మెంటే దొరకట్లేదా? కెరీర్ డల్ అవుతోందని గ్రహించిన కొరటాల, బిగ్ లీగ్ హీరోలైన నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ దగ్గరికి తన స్క్రిప్టులతో వెళ్ళారట. కానీ అక్కడ సీన్ మొత్తం మారిపోయినట్టు తెలుస్తుంది.బాలయ్య బాబు ఇప్పుడు ఫుల్ ‘చిల్’ మోడ్‌లో ఉన్నారు. కుర్ర డైరెక్టర్లు ఇచ్చే క్రేజీ అండ్ ఫాస్ట్ పేస్ ఐడియాలకే ఆయన ఓటు వేస్తున్నారు. కొరటాల పాతకాలపు ‘మెసేజ్ ఓరియంటెడ్’ స్లో నరేషన్ కథలను వినగానే, బాలయ్య బాబు సైలెంట్‌గా ‘ఇంకోసారి చూద్దాం లే’ అని పంపించేశారట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బాలయ్య ఇప్పుడు కొరటాల స్లో మేకింగ్‌ను భరించే మూడ్‌లో లేరని తెలుస్తోంది.మరో వైపు పవన్ ఆల్రెడీ తన లైనప్‌తో ఫుల్ బిజీ. కొరటాల సినిమా అంటే షూటింగ్ ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఈ ‘ల్యాగ్’ భయం వల్లే పవన్ ఆయన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. డైరెక్ట్ గా చెప్పాలంటే కొరటాల అక్కడ ‘ఘోస్ట్’ అయిపోయారన్న మాట .

చైతూ సినిమా బ్రేక్ అవ్వడానికి అసలు కారణం ఏంటి?

చైతూ 25వ సినిమా ‘బ్రేక్ అప్’.. ఈగో అడ్డు వస్తోందా? ఇక యువ హీరో నాగచైతన్య 25వ ప్రతిష్టాత్మక సినిమా కొరటాల డైరెక్షన్‌లో ఉంటుందని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రాజెక్ట్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. కొరటాలకి ఇంకా ఆ ‘స్టార్ డైరెక్టర్’ అనే ఈగో తగ్గలేదన్నది ఇన్ సైడ్ టాక్ . మరి చిన్న లేదా మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడం తన రేంజ్‌కి తక్కువని ఆయన ఫీల్ అవుతున్నారా? లేక హీరోలే ఆయనతో రిస్క్ చేయలేక సైడ్ అయిపోయారా? అనేది ఇప్పుడు మిస్టరీ.

తారక్ కోసం ‘సింప్’ అవ్వాల్సిందేనా? ఇక ప్రస్తుతానికి కొరటాల శివకు ఉన్న ఏకైక దిక్కు జూనియర్ ఎన్టీఆర్. కానీ తారక్ ఇప్పుడు గ్లోబల్ స్టార్! ‘డ్రాగన్’, ‘గాడ్ ఆఫ్ వార్ ‘ అంటూ హాలీవుడ్ లెవల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అంటే కొరటాల గారు మరో రెండేళ్లు కేవలం తారక్ డేట్స్ కోసం ‘వెయిటింగ్ లిస్ట్’లో ఉండాల్సిందే.”ఒకప్పుడు హీరోలే డైరెక్టర్ కాల్ షీట్స్ కోసం క్యూ కట్టేవారు.. ఇప్పుడు అదే డైరెక్టర్ హీరోల ఇన్ బాక్స్‌లో రిప్లై కోసం చూసుకుంటూ కూర్చునే పరిస్థితి వచ్చింది. దీంతో  ”ఎలాంటి వాడివి ఎలా అయిపోయావ్  బ్రో!” అని ఇన్ స్టాలో తెగ రోస్ట్ చేస్తున్నారట నెటిజన్లు. ఇప్పటికైనా కొరటాల శివ తన పాతకాలపు స్లో నరేషన్‌ను వదిలి, అప్‌డేట్ అవ్వకపోతే.. త్వరలోనే ఆయన పేరు ఇండస్ట్రీలో ‘ఎక్స్‌పైరీ డేట్’ దాటిన లిస్టులోకి వెళ్ళిపోవడం ఖాయం . సో ..ఎన్టీఆర్ కనికరిస్తే తప్ప కొరటాలకు కెరీర్ సేఫ్ కాదు. ఒకరకంగా  ప్రస్తుతం ఆయన పరిస్థితి ‘డైలమా’లో కాదు  కాదు, ప్యూర్ ‘కెరీర్ క్రైసిస్’లో పడ్డట్టే కన్పిస్తుంది.

తారక్ పైనే ఆశలు పెట్టుకున్న కొరటాల శివ

మొత్తానికి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందిన కొరటాల శివ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.