
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారి అకాల మరణం తెలుగు సినీ ప్రేక్షకులను కలచివేసింది. ఆయన మరణ వార్త తెలియగానే, సన్నిహితుడు బాబు మోహన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Key Points
కోట శ్రీనివాసరావు గారి అకాల మరణంపై బాబు మోహన్ బోరున విలపించారు.
వీరిద్దరి మధ్య అద్భుతమైన అనుబంధం తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసిందే.
బాబు మోహన్ కోట శ్రీనివాసరావును తన అన్నగా భావించేవారు.
కోట గారి మరణం బాబు మోహన్‌కు తీరని లోటు అని ఆయన వెల్లడించారు.
కోట, బాబు మోహన్ మధ్య అవినాభావ సంబంధం
కోట శ్రీనివాసరావు , బాబుమోహన్ .. తెలుగు తెరపై వీరిద్దరు చేసిన కామెడీ ఎప్పటికీ మరచిపోలేనిది . ఈ ఇద్దరు దిగ్గజ నటులు వెండితెరపై కనిపిస్తే చాలు .. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేవారు . బయట కూడా వీరిద్దరు చాలా అనోన్యంగా ఉండేవాళ్లు . కోట తనకు అన్నలాంటి వాడని బాబు మోహన్ , బాబు మోహన్ నాకు తమ్ముడి కంటే ఎక్కువ అని కోట .. ప్రతిసారి చెప్పేవారు . ఆదివారం తెల్లవారుజామున కోట శ్రీనివాసరావు మరణించారనే వార్త తెలియగానే బాబు మోహన్ బోరున విలపించారు. తనకు అన్నం తినిపించే అన్న ఇక లేడంటూ ఎమోషనల్ అయ్యాడు.
బాబు మోహన్ తీవ్ర విషాదం
తాజాగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ .. కోటన్న మరణం తనకు తీరని లోటు అన్నారు . ‘ మొన్ననే ఆయనకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాను . ఓ సినిమా షూటింగ్ గురించి ఆయనతో చెప్పాను . నిన్ననే ఆయనను కలవానుకున్నాను కానీ కుదరలేదు . ఈ రోజు ఆయన ఇంటికి వస్తానని చెప్పా. ఉదయం 10 గంటలకు వెళ్లాల్సి ఉండే. కానీ ఈలోపే ఆయన మరణించారనే వార్త తెలిసింది .
(చదవండి : ఒక గొప్ప నటుడిని కోల్పోయాం.. కోట శ్రీనివాసరావు మృతిపై ప్రముఖుల సంతాపం )
తెలుగు సినీ రంగం కోల్పోయిన మహానటుడు
సినిమాలో కనిపించినట్లుగానే బయట కూడా చాలా సరదగా ఉండేవాళ్లం. నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఒకే ప్లేటులో కలిసి తిన్నాం. నాకు అన్నం ముద్దలు తినిపించిన అన్న ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ బాబు మోహన్ బోరున విలపించాడు.
కోట శ్రీనివాసరావు మరణంతో తెలుగు సినీ రంగం ఒక అపురూపమైన నటుడిని కోల్పోయింది. బాబు మోహన్ వ్యక్తపరిచిన విషాదం వారి మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది.


