
ప్రముఖ తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు.
Key Points
విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు.
జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.
సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు.
అభిమానులు భారీగా పాల్గొని తమ శోకం వ్యక్తం చేశారు.
కోటా శ్రీనివాసరావు కన్నుమూత
తెలుగు విలక్షణ నటుడు కోటా శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా కొదీద్సేపటి క్రితం ఆయన అంత్యక్రియలు(Funeral) జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసాయి. ఆయన కుటుంబ సభ్యులు, సినీ నటులు, కళాకారులు, అభిమానులు ఆయనకు శాశ్వత సెలవు ప్రకటించారు. ఉదయం అయన మరణవార్త తెలిసినప్పటి నుంచి భారీగా సినీ ప్రముఖులు కోటా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగిన కోటా అంత్యక్రియల్లో భారీగా అభిమానులు పాల్గొన్నారు.
అంత్యక్రియల వివరాలు
ప్రముఖుల నివాళులు
కోటా శ్రీనివాసరావు గారి అంత్యక్రియలు సాగిన విధానం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటును తెలియజేస్తుంది. ఆయనకు శాశ్వత శాంతి లభించాలని ప్రార్థిద్దాం.


